ETV Bharat / science-and-technology

అదిరేటి ఫీచర్లతో నోకియా స్మార్ట్​ఫోన్​.. అతి తక్కువ ధరకే! - నోకియా జీ400 5జీ ఫోన్​ ఫీచర్లు

అతి తక్కువ ధరలో బడ్జెట్​​ ఫోన్​ కొనాలనుకునే వారికి గుడ్​ న్యూస్​. అదిరేటి ఫీచర్లతో నోకియా కంపెనీ ఓ స్మార్ట్​ ఫోన్​ను మార్కెట్​లో విడుదల చేయనుంది. మరికొద్ది రోజుల్లో ఈ ఫోన్​ భారతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్​ ధర.. రూ.5,999 మాత్రమే. మరి ఇంత తక్కువ రేటులో అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్​లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!

nokia budget smartphones
nokia budget smartphones
author img

By

Published : Mar 14, 2023, 2:04 PM IST

Updated : Mar 14, 2023, 2:38 PM IST

మొబైల్​ వినియోగదారులను తనవైపు ఆకర్శించడానికి నోకియా సంస్థ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా గత కొద్దిరోజులుగా అతి తక్కువ ధరలో పాటుగా గుడ్​ క్వాలిటీ, అదిరేటి ఫీచర్లున్న 5జీ ఫోన్​లను మార్కెట్​లో విడుదల చేస్తోంది. ఇటీవలే 'నోకియా సీ12' పేరుతో ఓ బడ్జెట్​ ఫోన్​ను భారత్​ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు నోకియా మాతృసంస్థ హెచ్​ఎండీ వెల్లడించింది. కేవలం రూ.5,999 ధరతో మార్చి 17 నుంచి అమెజాన్​లో అందుబాటులోకి తీసుకువస్తునట్లు తెలిపింది. దీంతో పాటుగా 'నోకియా జీ400' 5జీ ఫోన్​ను కూడా భారతీయ మార్కెట్​లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది హెచ్​ఎండీ కంపెనీ. మరి వీటిలో ఉన్న ఫీచర్లేంటో తెలుసుకుందామా.

కేవలం రూ.5,999 ధరకే నోకియా సీ12 బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్​ను తీసుకొస్తోంది నోకియా. ఇది ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ ఫోన్. ఈ స్మార్ట్​ ఫోన్​ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో హెచ్‌డీ ప్లస్​ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ లాంటి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విశేషం ఏంటంటే.. ఈ ఫోన్​కు సంవత్సరం పాటు రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ కూడా అందిస్తుంది. ఇప్పటికే నోకియా కంపెనీ రూ.5,499 ధరలో 'నోకియా సీ01' పేరుతో ఓ బడ్జెట్ ఫోన్​ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ ధరలో నోకియా సీ12 రిలీజ్ చేయడం విశేషం. మరి ఈ స్మార్ట్‌ ఫోన్ ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

నోకియా సీ12 గో ఫీచర్లు, ప్రత్యేకతలు

  • 6.53 అంగుళాల హెచ్​డీ+ డిస్​ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​
  • 8 ఎంపీ​ బ్యాక్​ కెమెరా
  • 5 ఎంపీ ప్రంట్​ కెమెరా
  • 2/64 జీబీల మెమరీ స్టోరేజ్​
  • 3,000mAh సామర్థ్యం గల​ బ్యాటరీ
  • 5 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​

వీటిలో పాటుగా ఈ ఫోన్​లో మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. దీని వెనుక భాగం మెటాలిక్​ ఫినిషింగ్​తో 3డీ డిజైన్​లో తయారుచేశారు. ఈ నోకియా సీ12 ఫోన్​లో​ ఫేస్​ అన్​లాక్​ సపోర్ట్​, పోర్ట్రెయిట్​ మోడ్​, నైట్​ మోడ్​ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఉండే బ్యాటరీ కూడా మంచి పనితీరు కనబరుస్తుందని కంపెనీ తెలిపింది. దీనిలో ఇన్‌‌బిల్ట్ 2జీబీ ర్యామ్ ఉండగా.. అదనంగా మరో 2జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మొత్తం 4జీబీ ర్యామ్ ఉన్న ఫోన్​గా దీన్ని వినియోగించుకోవచ్చు. మెమరీ కార్ట్​ స్టోరేజీని కూడా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

నోకియా జీ400 5జీ ఫోన్ ఫీచర్లు

  • 6.58 అంగుళాల డిస్​ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్​ సిస్టమ్​, సీపీయు క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 480+
  • 48+5+2 ఎంపీల ట్రిపుల్​ బ్యాక్​ కెమెరా
  • 16 ఎంపీ ఫ్రంట్​ కెమెరా
  • 4/64 జీబీ మెమరీ స్టోరేజ్​, స్టోరేజ్​ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు
  • 5,000mAh సామర్థ్యం గల​ బ్యాటరీ
  • 20 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​

ఈ ఫోన్​ మార్చి 20న భారతీయ మార్కెట్​లో అందుబాటులోకి రానుంది. ఒకే ఒక కలర్​లో మాత్రమే విడుదల చేయనున్న ఫోన్​ ధరను రూ. 19,990 గా హెచ్​ఎండీ సంస్థ నిర్ధరించింది. ఈ నోకియా జీ400 5జీ ఫోన్​లో ఫింగర్ ​ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇందులో ఉన్న బ్యాటరీ రెండు రోజులు లాంగ్​ లైఫ్​ను అందిస్తుంది.

Last Updated : Mar 14, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.