ETV Bharat / science-and-technology

ఆగస్టులో మార్కెట్​లోకి వచ్చే స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! - శాంసంగ్ కొత్త ఫోన్లు?

జులై నెలలో వరుసగా ఫోన్లు లాంచ్ చేసి అదరగొట్టిన మొబైల్ కంపెనీలు..ఆగస్టులో కూడా కొత్త మోడల్స్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ఫోన్ల నుంచి ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ వరకూ ఈ జాబితాలో ఉన్నాయి. గేమర్స్ కోసం జీటీ మోడల్స్‌, స్టైలిష్‌ డిజైన్ కోరుకునే వారికి కాంపాక్ట్, ఫ్లిప్ మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి. మరి మొబైల్ కంపెనీలు ఈ మోడల్స్‌ను ఎప్పుడు విడుదల చేయనున్నాయి..వాటి ధరెంత?ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారనేది చూద్దాం..

smartphones
స్మార్ట్​ఫోన్
author img

By

Published : Jul 28, 2021, 7:45 AM IST

ఆగస్టు నెలలో విడుదల కానున్న స్మార్ట్​ఫోన్ వివరాలు మీకోసం..

మైక్రోమాక్స్‌ ఇన్‌ 2బీ..

smartphones
మైక్రోమాక్స్‌ ఇన్‌ 2బీ

మైక్రోమాక్స్‌ బడ్జెట్‌ శ్రేణిలో రెండు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనుంది. మైక్రోమాక్స్‌ ఇన్‌ 2బీ, ఇన్‌ 2బీబీ పేరుతో వీటిని తీసుకురానుంది. హై-రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లేతో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఇన్‌ 2బీని జులై 30న మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ధర రూ.15,000 లోపు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇన్ 2బీబీ మోడల్‌ను ఆగస్టు రెండు లేదా చివరి వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇవేకాకుండా మైక్రోమాక్స్‌ 5జీ ఫోన్‌ను కూడా తీసుకురానుంది. అయితే దీని విడుదల, ఫీచర్లకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

మోటోరోలా..

smartphones
మోటోరోలా

మోటోరోలా కూడా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఆగస్టులో విడుదల చేయనుంది. వీటిలో ఒక ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. వెనక వైపు మూడు కెమెరాలు ఇస్తున్నారట. దీని ధర సుమారు రూ. 20,000 ఉండొచ్చని సమాచారం. మరో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 879 ప్రాసెసర్ ఉపయోగించారట. దీని ధర సుమారు రూ. 25,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ మోడల్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేయనున్నారు.

రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్..

smartphones
రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్

ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ ఉపయోగించారట. హై-రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇస్తున్నారని సమాచారం. వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. దీని ధర రూ. 25,000 వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో ఈ మోడల్‌ గేమ్ ఛేంజర్ అవుతుందని రియల్‌మీ భావిస్తోంది. దీనితోపాటు మైక్రోమాక్స్‌ ఇన్, రెడ్‌మీ 10 సిరీస్‌ వేరియంట్లకు పోటీగా బడ్జెట్ ధరలో రియల్‌మీ సీ సిరీస్ పేరుతో కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. వీటిని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.

గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌..

smartphones
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌

గతంలో వచ్చిన పిక్సెల్‌ మోడల్స్‌కు భిన్నంగా గూగుల్ పిక్సెల్ 6 , 6ప్రో మోడల్స్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో గూగుల్ వైట్‌ఛాపెల్ చిప్‌సెట్‌ను ఉపయోగించారని సమాచారం. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్‌/ 512జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో విడుదల చేయనున్నారు. వీటి ధర సుమారు రూ. 55,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

పోకో ఎక్స్‌3 జీటీ..

smartphones
పోకో ఎక్స్‌3 జీటీ

కొద్దిరోజుల క్రితం గేమింగ్‌ ఫీచర్లతో ఎఫ్3 జీటీ మోడల్‌ను పోకో కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఎక్స్‌3 జీటీ పేరుతో మరో కొత్త మోడల్‌ను ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో 6.6-అంగుళాల డిస్‌ప్లేతోపాటు 64ఎంపీ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఇస్తున్నారట.

అసుస్‌ 8జెడ్‌..

smartphones
అసుస్‌ 8జెడ్‌

కాంపాక్ట్ డిజైన్‌తో అసుస్ 8జెడ్‌ పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను ఆగస్టులో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 5.9-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. అడ్రినో 660 గ్రాఫిక్‌ కార్డ్‌ ఇస్తున్నారు. వెనకవైపు సోనీ లెన్స్‌తో 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 12 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపీ సోనీ లెన్స్ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ర్యామ్‌, స్టోరేజ్, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

వివో వీ21 ప్రో..

smartphones
వివో వీ21 ప్రో

ఈ సిరీస్‌లో వివో ఇప్పటికే వీ21, వీ21ఈ 5జీ మోడల్స్‌ను విడుదల చేసింది. త్వరలో వీ21 ప్రో పేరుతో మరో కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. ఇందులో 6.44-అంగులాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్‌, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.

శాంసంగ్‌..

smartphones
శాంసంగ్

శాంసంగ్ ఆగస్టు నెలలో నాలుగు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. వాటిలో శాంసంగ్ జెడ్‌ ఫోల్డ్‌ 3, ఫ్లిప్ 3 5జీ మడత ఫోన్లతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ ఎం52, గెలాక్సీ ఎఫ్52 మోడల్స్‌ ఉన్నాయట. గెలాక్సీ ఎం52 ధర సుమారు రూ. 25,000, ఎఫ్‌52 ప్రారంభ ధర రూ. 15,000 ఉంటుందని అంచనా. వీటిలో హై-రిఫ్రెష్‌ రేట్‌తో ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇవేకాకుండా గెలాక్సీ ఏ12 పేరుతో మరో కొత్త మోడల్‌ను శాంసంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.