ETV Bharat / science-and-technology

మెటా 'థ్రెడ్స్' యాప్ లాంఛ్.. 100కు పైగా దేశాల్లో ట్విట్టర్​కు పోటీగా.. - మెటా థ్రెడ్స్ లాంఛ్

Meta Threads Launch : ఫేస్​బుక్ మాతృసంస్థ మెటా.. 'థ్రెడ్స్​' యాప్​ను లాంఛ్ చేసింది. ట్విట్టర్​కు పోటీగా ఈ యాప్​ను మెటా.. వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.

Meta launches Threads
Meta launches Threads
author img

By

Published : Jul 6, 2023, 9:04 AM IST

Updated : Jul 6, 2023, 10:00 AM IST

Meta Threads Launch : మెటా కంపెనీ సరికొత్త మైక్రో బ్లాగింగ్​ యాప్​ను తీసుకొచ్చింది. 'థ్రెడ్స్​' పేరుతో సరికొత్త యాప్​ను బుధవారం లాంఛ్ చేసింది. ఈ యాప్​.. ప్రస్తుతం మార్కెట్​ లీడర్​గా ఉన్న ట్విట్టర్​కు గట్టి పోటీని ఇస్తుందని టెక్​​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ట్విట్టర్​ వినియోగదారులు ఈ యాప్​ వైపు మళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాలలో యాపిల్​, గూగుల్​, గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులోకి వచ్చింది.

ఇన్​స్టాగ్రామ్​ యూజర్​నేమ్​తోనే..
Threads Instagram : థ్రెడ్స్​ యాప్​ను ఇన్​స్టాగ్రామ్​ యూజర్ ​నేమ్​తోనే వినియోగించుకోవచ్చు. అలాగే ఇన్​స్టాగ్రామ్​లో మనం ఫాలో అయ్యేవారినే.. ఇక్కడ కూడా ఫాలో కావచ్చు. థ్రెడ్స్​లో అక్షరాల లిమిట్​ 500గా ఉంచింది మెటా. ట్విట్టర్​లో​ 280 అక్షరాలు కాగా.. థ్రెడ్స్​లో అంత కంటే ఎక్కువే.

Twitter Tweet Limit : ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్నప్పటి నుంచి ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్​లో పలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ట్వీట్స్‌ను చూడటంలో యూజర్లకు పరిమితులు విధించింది ట్విట్టర్​. ట్విట్టర్​ పాలసీ పరమైన మార్పులు కొందరు వినియోగదారులకు నచ్చడం లేదు. ట్విట్టర్​లో మార్పుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నారు. ఇదే సరైన సమయంగా భావించిన ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా.. ట్విట్టర్​కు పోటీగా థ్రెడ్స్​ను లాంఛ్ చేసింది. అంతర్జాతీయంగా ట్విట్టర్​కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త యాప్‌ను మెటా ఆవిష్కరించింది.

'థ్రెడ్స్​​' రీచ్​ అవుతుందా?
Meta Launch New App : ఇప్పటివరకు ట్విట్టర్​కు పోటీగా నిలిచేందుకు మాస్టోడాన్, ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే బ్లూస్కై యాప్​ను తీసుకొచ్చారు. అయితే ఈ యాప్‌లు అంతగా యూజర్లను ఆకట్టుకోలేపోయాయి. మెటా కంపెనీ అండర్​లో ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​ ఉన్నాయి. రోజూ దాదాపు 300 కోట్ల మంది యూజర్లు వీటిని వినియోగిస్తున్నారు. ఈ యూజర్​ బేస్​తో మైక్రో బ్లాగింగ్​ యాప్ థ్రెడ్స్​ను కూడా సక్సెస్​ చేయాలని మెటా భావిస్తోంది. మరి ఏ మేరకు థ్రెడ్స్ సక్సెడ్ అవుతుందో చూడాలి.

Last Updated : Jul 6, 2023, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.