ETV Bharat / science-and-technology

జూన్‌లో రాలేదు కానీ.. జులైలో ఈ స్మార్ట్​ ఫోన్స్​ రిలీజ్​ పక్కా!

Smartphones July 2022: గాడ్జెట్‌ ప్రియులకు జూన్‌ నెల కొంత నిరాశ కలిగించిందనే చెప్పుకోవాలి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ విడుదల వాయిదా పడటం ఇందుకు ప్రధాన కారణం. దీంతో జులైలో విడుదలయ్యే మోడల్స్‌ గురించి యూజర్లు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం..జులై నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ల జాబితాపై మీరు ఓ లుక్కేయండి..

list-of-smartphone-launches-in-july-2022

author img

By

Published : Jun 28, 2022, 10:21 PM IST

OnePlus Nord 2T 5G
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 12.1తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వోక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జూన్‌ చివరి వారం లేదా జులై మొదటి వారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. ధర రూ. 30వేలలోపు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

list-of-smartphone-launches-in-july-2022
వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ 5జీ

ఈ ఫోన్‌తో పాటు వన్‌ప్లస్‌ 10 టీ అనే మరో కొత్త ఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. ఇందులో 120 హెర్జ్‌ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 ప్రాసెసర్ ఉపయోగించినట్లు సమాచారం. 4,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందట. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేస్తారని అంచనా.

Realme GT Series

రియల్‌మీ జీటీ సిరీస్‌
రియల్‌మీ కంపెనీ జీటీ సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ రియల్‌మీ జీటీ నియో 3టీ, రియల్‌మీ జీటీ2 మాస్టర్‌ ఎడిషన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటిలో ముందుగా ఏ మోడల్‌ను విడుదల చేస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. జీటీ నియో 3టీలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

రియల్‌మీ జీటీ 2 మాస్టర్‌ ఎడిషన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ వన్‌, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, రెండు 50 ఎంపీ, ఒక 2 ఎంపీ కెమెరాలుంటాయని సమాచారం. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి.

Nothing Phone 1

నథింగ్ ఫోన్‌ వన్‌

నథింగ్ ఫోన్‌ వన్‌ను జూన్‌ నెలలో విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ, కేవలం ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మాత్రమే ప్రారంభించారు. జులై 12న ఈ ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ ఫీచర్ల గురించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ వన్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీని ధర రూ. 35 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉంటుందని సమాచారం.

Google Pixel 6A

గూగుల్ పిక్సెల్‌ 6ఏ
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. టెన్సర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పిక్సెల్‌ 6ఏలో వెనుకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలు, వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఫోన్‌లోని 4,410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్‌ ధర సుమారు ₹ 40,000 ఉంటుందని అంచనా.

Asus ROG Phone 6

అసుస్‌ ఆర్‌వోజీ ఫోన్ 6
గేమింగ్ ప్రియుల కోసం అసుస్‌ కంపెనీ రెండు వేరియంట్లలో ఆర్‌వోజీ ఫోన్‌ 6ను తీసుకురానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 165 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, వెనుకవైపు అదనంగా ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. అంతేకాకుండా వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు ముందు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం. గేమ్స్‌ ఆడేప్పుడు ఫోన్‌ వేడెక్కకుండా కూలింగ్ ప్యాడ్స్‌ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ధర రూ. 60 వేల నుంచి రూ. 70 వేల మధ్య ఉండొచ్చని అంచనా. ముందుగా జులై 5న అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. తర్వాత భారత్‌లో విడుదల చేస్తారని సమాచారం.

iQOO 9T & iQOO 10 Pro

ఐకూ 9టీ & ఐకూ 10 ప్రో
ఐకూ కంపెనీ కూడా రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఐకూ 9టీ, ఐకూ 10 ప్రో పేర్లతో వీటిని తీసుకురానుంది. ఈ రెండు ఫోన్లలో 120 హెర్జ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఇస్తున్నట్లు సమాచారం. ఐకూ 9 టీ మోడల్‌ 120 వాట్ ఛార్జింగ్‌కు, ఐకూ 10 ప్రో ఫోన్‌ 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. జులై రెండో వారంలో ఒక మోడల్‌, చివరి వారంలో మరో మోడల్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

Xiaomi 12 Ultra

షావోమి 12 అల్ట్రా
షావోమి కంపెనీ కూడా గత నెలలోనే ఈ మోడల్‌ను విడుదల చేస్తారని భావించినప్పటికీ జులై నెలకు వాయిదా వేసింది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 2K అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో లైకా (Leica) కెమెరా సెటప్‌ ఉంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జులై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ధర రూ. 50 వేల లోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

Oppo Reno 8 Series

ఒప్పో రెనో 8 సిరీస్‌
ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారట. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. జులై రెండు లేదా మూడో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ధర రూ. 40 వేల లోపు ఉంటుందని అంచనా.

Moto Edge 30 Ultra

మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా
మోటోరోలా ఫ్లాగ్‌షిప్ శ్రేణిలో కొత్త మోడల్‌ను జులై రెండు లేదా నాలుగో వారంలో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. 200 ఎంపీ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం ముందుభాగంలో 60 ఎంపీ కెమెరా అమర్చినట్లు సమాచారం. 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.73-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారని సమాచారం. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 125 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్‌ చేస్తుందట. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లో లభిస్తుందని అంచనా.

ఇవేకాకుండా లావా కంపెనీ కొత్త 5జీ ఫోన్‌, వివో టీ1ఎక్స్‌, శాంసంగ్‌ ఎస్‌ 21 ఎఫ్‌ఈ 4జీ, మోటో జీ42 మోడల్స్‌ విడుదలవుతాయని సమాచారం. అయితే ఈ ఫోన్లలోని ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న 5జీ ఫోన్లకు పోటీగా తక్కువ ధరలో లావా 5జీ ఫోన్‌ తీసుకొస్తుందట. దీని ధర రూ. 15 వేల లోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇవీ చూడండి: ఫొటో ఎడిటింగ్, ఫైల్ కన్వర్షన్.. అన్నీ టెలిగ్రామ్​లోనే! ఈ 'బాట్స్​'ను ట్రై చేయండి!!

ఎలక్ట్రిక్ వెర్షన్​లో పల్సర్, కేటీఎం.. బజాజ్ అదిరే ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.