Jio Cloud Laptop : నేటి టెక్ యుగంలో పర్సనల్ కంప్యూటర్ (PC) అనేది నిత్యావసరంగా మారిపోయింది. అందుకే పీసీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. అయితే ఈ పీసీ మార్కెట్‌కు సవాల్ విసురుతూ.. దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 'క్లౌడ్ ల్యాప్‌టాప్'ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
డమ్మీ మాత్రమే!
రిలయన్స్ జియో ఇటీవలే జియోబుక్ పేరుతో ఒక లో-కాస్ట్ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర కేవలం రూ.14,499. వాస్తవానికి ఇది కేవలం బేసిక్ కంప్యూటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ వర్క్‌కు ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకే రిలయన్స్ జియో దీనికి 'క్లౌడ్' సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
అంతా 'క్లౌడ్' లోనే..
జియో తీసుకురానున్న ఈ క్లౌడ్ ల్యాప్‌టాప్ అనేది ఒక డంబ్ టెర్నినల్ మాత్రమే అని గుర్తించుకోవాలి. అయితే దీని ప్రాసెసింగ్, స్టోరేజ్ అంతా జియో క్లౌడ్‌లోనే జరుగుతుంది. అందువల్ల కంప్యూటర్లో చాలా ఖరీదైన సూపర్ ప్రాసెసర్, స్టోరేజ్ డివైజ్‌లు ఉండాల్సిన అవసరం ఉండదు. కనుక ల్యాప్‌టాప్ ధర చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం జియో కంపెనీ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
తక్కువ ధరకే ల్యాప్‌టాప్!
రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్ అందించాలనే లక్ష్యంతో ఈ క్లౌడ్ ల్యాప్‌టాప్ కాన్సెప్ట్‌ను తీసుకువస్తోంది. అయితే ఈ సర్వీస్ వాడుకోవాలంటే.. యూజర్లు కచ్చితంగా జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జియో క్లౌడ్ ల్యాప్‌టాప్ వల్ల విద్యాసంస్థలకు ఆర్థికంగా బాగా కలిసిరానుంది. ఎలా అంటే.. విద్యా సంస్థలు తమ విద్యార్థుల కోసం భారీ స్థాయిలో హార్డ్వేర్స్ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. దీని వల్ల వాటిపై చాలా ఆర్థిక భారం పడుతుంది. ఒకసారి జియో క్లౌడ్ ల్యాప్‌టాప్ అందుబాటులోకి వస్తే.. ఈ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎంటర్‌ప్రైజెస్‌కు కూడా జియో క్లౌడ్ ల్యాప్టాప్స్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
భారీ నెట్వర్క్
రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఉంది. అందువల్ల ఫైబర్ ద్వారా చాలా మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించగలిగే సామర్థ్యం జియోకు ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే జియో కంపెనీ ఈ క్లౌడ్ ల్యాప్‌టాప్‌ను ఎప్పుడు మార్కెట్లోకి తెస్తుందో ఇంకా వెల్లడించలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన 45వ ఏజీఎంలోనే క్లౌడ్ పీసీ గురించి ప్రకటించింది. పైగా టెల్కో సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందించిన అనుభవం కూడా రిలయన్స్‌కు ఉంది.
జియో వెబ్‌క్యామ్‌తో ఇకపై నేరుగా టీవీ నుంచే వీడియో కాల్స్!
ఓవర్ స్పీడింగ్ చలాన్ నుంచి తప్పించుకోవాలా? గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్ వాడండి!