ETV Bharat / science-and-technology

Iphone 15 Battery Life Charging Speed : ఐఫోన్​ 15 సిరీస్​ బ్యాటరీ లైఫ్​, ఛార్జింగ్​ స్పీడ్​పై టెక్​ లవర్స్​ అసంతృప్తి!.. - ఐఫోన్​ 15 బ్యాటరీ కెపాసిటీ​ పూర్తి వివరాలు

Iphone 15 Battery Life Charging Speed : సెప్టెంబర్​ 13 బుధవారం ఐఫోన్​ 15 న్యూ సిరీస్​ను లాంఛ్​ చేసింది యాపిల్​. అయితే రిలీజ్​ అయిన ఒక్క రోజులోనే దీని బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్​ స్పీడ్ సహా మరికొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఐఫోన్​​ లవర్స్​. మరి ఈ వెర్షన్​ ఫోన్​లో అంతలా నిరుత్సాహపరిచేలా ఉన్న విధంగా కీలక అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Iphone 15 Battery Life Charging Speed Issue Why Full Analysis In Telugu
ఐఫోన్​ 15 సిరీస్​లో USB-C కనెక్టర్​పై టెక్​ లవర్స్​ అసంతృప్తి?
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 2:24 PM IST

Iphone 15 Battery Life Charging Speed : యాపిల్​, ఆండ్రాయిడ్.. ఇలా ఏ రకం ఫోన్​లైనా సరే మొబైల్​ సంస్థలు అప్డేటెడ్​ వెర్షన్​లను రిలీజ్​ చేస్తుంటాయి. అయితే ఇలా ప్రతి ఏడాది లేదా అవసరాన్ని బట్టి ఒక మోడల్​కి సంబంధించి వెర్షన్​లు విడుదల చేసేముందు అందులో ప్రధాన మార్పులను తీసుకువస్తాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు మొత్తం 14 వెర్షన్​లను లాంఛ్​ చేసిన ప్రముఖ ప్రీమియం గ్యాడ్జెట్స్​ తయారీ సంస్థ యాపిల్​​ తాజాగా ఐఫోన్ 15 సిరీస్​ను లాంఛ్​ చేసింది. అయితే ఇందులో వినియోగించిన USB-C ఛార్జింగ్​ కనెక్టర్​పై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఐఫోన్​లలో చాలావరకు లైట్నింగ్ కనెక్టర్‌ కేబుల్​నే వాడారు. కాగా, ప్రస్తుతం దీనికి బదులుగా టైప్​-సీను ఐఫోన్​ 15 సిరీస్​లో వినియోగించారు.

Iphone 15 Charger Type : ప్రస్తుతం మార్కెట్​లో అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్​ ఫోన్​ల కంపెనీలు కూడా ఈ రకం ఛార్జింగ్​ కనెక్టర్లను తమ ఉత్పత్తుల్లో వాడుతున్నాయి. అంతేకాకుండా యాపిల్​కి చెందిన పలు ప్రాడక్ట్స్​లైన మ్యాక్​బుక్​, ఐప్యాడ్ లాంటి వాటిల్లో కూడా ఈ USB టైప్​-C ఛార్జింగ్​ కనెక్టర్​ను గమనించవచ్చు. మరి ఇవన్ని దృష్టిలో ఉంచుకొని యాపిల్​ తాజాగా తెచ్చిన ఐఫోన్​ 15 బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరిచిందా? లేదా అలాగే USB-C ద్వారా ఛార్జింగ్​ మరింత వేగంగా ఎక్కేలా ఏమైనా మార్పులు చేసిందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇలా కనెక్టర్​ విషయంలో ఏ మాత్రం ప్రత్యేకత లేకుండా ఇప్పటికే ఉన్న వెర్షన్​లలో వాడిన కనెక్టర్​నే అమర్చడంపై మొబైల్​​ లవర్స్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ టైప్​-సీ కనెక్టర్​ అనేది ఫోన్​ బ్యాటరీ లైఫ్ సహా ఛార్జింగ్​ స్పీడ్​పై ప్రభావం చూపుతుందని అంటున్నారు టెక్​ నిపుణులు. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 14, 15 సిరీస్​ల మధ్య ఏమైనా తేడాలున్నాయా లేవా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్​15, ఐఫోన్​ 15 ప్రో బ్యాటరీ లైఫ్​!
ఐఫోన్​ 15 లాంఛ్​ సమయంలో యాపిల్​ ఈ సిరీస్​కి సంబంధించి బ్యాటరీ కెపాసిటీల వివరాలను తెలపనప్పటికీ.. అవి ఎంతకాలం పాటు మన్నికగా ఉంటాయనే వాటికి సంబంధించి అంచనాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ఐఫోన్​ 15 బ్యాటరీకి ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 16 నుంచి 20 గంటల వరకు ఉంటుందని తెలిపింది. అలాగే ఐఫోన్​ 15 ప్లస్​ బ్యాటరీకి ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 20 నుంచి 26 గంటల వరకు ఉంటుందని యాపిల్​ చెబుతోంది.

పెద్దగా మార్పులు చేయలేదు!
గతేడాది తీసుకువచ్చిన ఐఫోన్ 14 సిరీస్​లోని ఛార్జింగ్​ స్పీడ్​నే ఐఫోన్ 15 సిరీస్​లోనూ గమనించవచ్చు. కాగా, ఈ రెండింటి బ్యాటరీ లైఫ్​ సహా ఛార్జింగ్​ స్పీడ్​లో పెద్దగా మార్పులేమి గుర్తించలేదని నిపుణులు​ అంటున్నారు. దీని కారణంగానే చాలావరకు ఐఫోన్​ లవర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ప్రో సిరీస్​లో కూడా!
ఐఫోన్​ 15 సిరీస్​లోని ప్రో, ప్రో మ్యాక్స్​ మోడల్స్​లో కూడా ఈ రకమైన బ్యాటరీ పనితీరునే కనబరుస్తున్నాయి. వీటిల్లో లోకల్​ వీడియో ప్లేబ్యాక్​తో దాదాపు 23 నుంచి 29 గంటల బ్యాటరీ సామర్థ్యాన్ని గమనించవచ్చు. అయితే అచ్చం ఇలాంటి ఫిగర్స్​నే ప్రస్తుతం ఉన్న ఐఫోన్​ 14 ప్రో మోడల్స్​ క్యారీ చేస్తుంది.

బరువు తగ్గింది!
ఐఫోన్​ 14 ఫోన్​ బరువుతో పోలిస్తే ఐఫోన్ 15 సిరీస్​ మోడళ్లు​ దాదాపు 10% వరకు బరువును కోల్పోయాయి. ఇందులో టైటానియమ్​ ఫ్రేమ్​ను ఫిక్స్ చేశారు. కాగా, ఫోన్​ లైట్​వెయిట్​ అంశాన్ని యూజర్స్​ సులువుగా పసిగట్టేయవచ్చు. మొత్తంగా కొత్తగా లాంఛ్ చేసిన ఫోన్ల రన్‌టైమ్‌లను మెరుగుపరచడానికి యాపిల్​ తన కొత్త 3nm ప్రాసెసింగ్ హార్డ్‌వేర్ సామర్థ్యాన్ని ఉపయోగించలేకపోవడం కొంచెం నిరాశపరుస్తుందని అంటున్నారు గ్యాడ్జెట్స్ నిపుణులు.

ఆండ్రాయిడ్​ల డివైజ్​లకు సమానంగా!
శాంసంగ్​, మోటోరోలా సహా ఇతర ఆండ్రాయిడ్​ ఫోన్ల తయారీ కంపెనీలు కూడా గంటలోపే ఛార్జింగ్​ ఎక్కేలా USB-C ఛార్జింగ్​ పోర్ట్​ను వాడుతున్నాయి. ఇదే కనెక్టర్​ను ఐఫోన్​ 15 సిరీస్​లో వాడారు.

ఐఫోన్​14, 15 సేమ్​ ఛార్జింగ్​ స్పీడ్​!
Iphone 15 Battery Life Charging Time : తమ​ ఉత్పత్తుల కోసం యాపిల్​ సంస్థ చాలావరకు 20W లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ఎడాప్టర్​ను వాడుతుంటుంది. దీనితో తమ గ్యాడ్జెట్స్​కు కేవలం 30 నిమిషాల్లోనే 50% ఛార్జ్​ ఎక్కుతుంది. ఈ ఛార్జింగ్ స్పీడ్​ను ఐఫోన్​ 14లో కూడా చూడవచ్చు. కాగా, 100% ఛార్జింగ్​ కోసం కనీసం గంటపాటు వేచి ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం వచ్చిన యాపిల్​ స్మార్ట్​ఫోన్​లు సున్నా నుంచి పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి గంట, గంటన్నర కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఐఫోన్​ 15 లాంఛ్​కి ముందు యాపిల్​ ఈ సిరీస్​లో 35W ఎడాప్టర్​ను వాడిందని పుకార్లు వచ్చినా అలాంటిదేమి కనిపించలేకపోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.