యువత అధికంగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇందులో ఉండే 'రీల్స్' ఫీచర్‌లో తక్కువ నిడివితో.. విలువైన సమాచారంతో పాటు.. యువత తమ ప్రతిభను పాటలు, నృత్యాలను వీడియోల రూపంలో అప్‌లోడ్ చేసే వీలుంటుంది. తాజాగా ఈ రీల్స్‌కు సంబంధించి మార్పులు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. ఇప్పటి వరకూ రీల్స్‌లో వీడియో నిడివి 15-30 సెకన్లు ఉండగా.. దాన్ని కాస్త 60 సెకన్ల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
-
Reels. up to 60 secs. starting today. pic.twitter.com/pKWIqtoXU2
— Instagram (@instagram) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Reels. up to 60 secs. starting today. pic.twitter.com/pKWIqtoXU2
— Instagram (@instagram) July 27, 2021Reels. up to 60 secs. starting today. pic.twitter.com/pKWIqtoXU2
— Instagram (@instagram) July 27, 2021
ఇటీవలే టిక్‌టాక్, ది రీల్స్ అర్చ్ రైవల్ తమ యూజర్లు రూపొందించే వీడియోల్లో వైవిధ్యం చూపించేందుకు వీడియో నిడివి కాస్త 3 నిమిషాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మార్పును గమనించిన ఇన్‌స్టాగ్రామ్.. రీల్స్ వీడియో నిడివిని 60 సెకన్లకు పెంచింది. అంతేకాదు.. టీనేజర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఖాతాలకు భద్రత కల్పించే దిశగా అడుగులు వేసింది. కొత్తగా ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించే టీనేజర్స్ (16-18) అకౌంట్లను ప్రారంభం నుంచే ప్రైవేట్‌లోకి మార్చనుంది.
-
✨ @JezzChung is here with tips on how to prioritize your privacy and protect your peace on Instagram 💫https://t.co/L1FLIEWFnb pic.twitter.com/UsOegDFuvy
— Instagram (@instagram) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">✨ @JezzChung is here with tips on how to prioritize your privacy and protect your peace on Instagram 💫https://t.co/L1FLIEWFnb pic.twitter.com/UsOegDFuvy
— Instagram (@instagram) July 27, 2021✨ @JezzChung is here with tips on how to prioritize your privacy and protect your peace on Instagram 💫https://t.co/L1FLIEWFnb pic.twitter.com/UsOegDFuvy
— Instagram (@instagram) July 27, 2021
అపరిచితుల నుంచి ఎలాంటి అభ్యంతరకరమైన సందేశాలు రాకుండా, యూజర్ల వివరాలకు భంగం కలుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. వారి అకౌంట్ల ప్రైవసీకి సంబంధించి టీనేజర్ల ఇన్‌స్టా అకౌంట్స్‌కు పుష్ నోటిఫికేషన్లను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా భద్రతను దృష్టిలో పెట్టుకొని టీనేజర్లు పబ్లిక్‌లో ఉన్న వారి అకౌంట్లను ప్రైవేటులోకి మార్చుకోవాలని కోరింది.
ఇదీ చదవండి:Instagram: 'స్టోరీస్' చేసేయ్.. డబ్బులు సంపాదించేయ్!