ETV Bharat / science-and-technology

మళ్లీ నిలిచిపోయిన వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలు - మళ్లీ నిలిచిపోయిన ఇన్​స్టాగ్రామ్​

WhatsApp
వాట్సాప్​
author img

By

Published : Oct 9, 2021, 1:37 AM IST

Updated : Oct 9, 2021, 6:21 AM IST

01:35 October 09

మళ్లీ నిలిచిపోయిన వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలు

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇలా జరగడం వారంలో ఇది  రెండోసారి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల.. కొంత సమయం పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.  

ఈ హఠాత్‌ పరిణామంపై ఇన్​స్టాగ్రామ్​ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెప్పింది.

ఇలానే సోమవారం రాత్రి 9 గంటల తర్వాత.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల.. కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 గంటల తర్వాత వాట్సాప్‌ సేవలు పునరుద్ధరించారు.

Last Updated : Oct 9, 2021, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.