ETV Bharat / science-and-technology

గూగుల్ పే యూజర్లకు అలర్ట్​! ఆ యాప్స్​ను వెంటనే డిలీట్ చేయండి - లేదంటే డబ్బులు పోవడం గ్యారెంటీ! - గూగుల్ పే లేటెస్ట్​ సెక్యూరిటీ అలర్ట్​

How To Secure Your Google Pay Account In Telugu : గూగుల్ పే యూజర్లకు అలర్ట్​. కొన్ని స్క్రీన్​ షేరింగ్స్​ యాప్​లు, థర్డ్ పార్టీ యాప్​లు.. మీ ఆన్​లైన్​ ఆర్థిక లావాదేవీలను ట్రాక్​ చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. అందుకే వాటిని వాడకూడదని హెచ్చరిస్తోంది. మరి ఆ స్క్రీన్ షేరింగ్ యాప్స్​ ఏమిటో చూద్దామా?

Google Pay users are advised not to use these apps
how to Secure Your Google Pay Account
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 11:47 AM IST

How To Secure Your Google Pay Account : భారతదేశంలోని టాప్​-5​ యూపీఐ పేమెంట్​ యాప్స్​లో 'గూగుల్ పే' ఒకటి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ప్రపంచంలో గూగుల్ పే యాప్​కు ఉన్న బిగ్గెస్ట్​​ మార్కెట్లలో భారత్​ అతి ప్రధానమైనది. అందుకే గూగుల్ ప్రస్తుతం తమ యూజర్లకు ఒక అలర్ట్​ పంపించింది. కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ సహా​, థర్డ్ పార్టీ యాప్​లను.. మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఉపయోగించవద్దని సూచిస్తోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​
గూగుల్ పే తమ యూజర్ల భద్రత కోసం, ఆన్​లైన్​ మోసాలను నివారించడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ను ఉపయోగిస్తోంది. దీని ద్వారా రియల్​-టైమ్​లో జరిగే అనుమానిత ఆర్థిక లావాదేవీలను గుర్తించగలుగుతోంది. అయితే కొంత మంది యూజర్లు గూగుల్ పే ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని గూగుల్ హెచ్చరిస్తోంది.

ఆ యాప్స్​తో జాగ్రత్త!
Most Dangerous Screen Sharing Apps : ఉదాహరణకు Screen Share, AnyDesk, TeamViewer లాంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ చాలానే​ ఉన్నాయి. వీటిని ఫోన్స్​, ట్యాబ్స్​, కంప్యూటర్లలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్స్​ రిమోట్ ఏరియా నుంచి మీ డివైజ్​లను కంట్రోల్​ చేస్తూ ఉంటాయి. అంటే ఆన్​లైన్​ ఫ్రాడ్​స్టర్స్​ చేతిలోకి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలను చేరుస్తాయి. కనుక ఆన్​లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఈ స్క్రీన్ షేరింగ్​ యాప్​లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని గూగుల్ హెచ్చరిస్తోంది. వీలైతే వాటిని ఫోన్ నుంచి అన్​-ఇన్​స్టాల్ చేయాలని.. లేదంటే పూర్తిగా డిలీట్ చేసేయాలని సూచిస్తోంది.

థర్డ్ పార్టీ యాప్స్​ డౌన్​లోడ్ చేయవద్దు!
Most Dangerous Third Party Apps : కొంత మంది యూజర్లు థర్డ్ పార్టీ యాప్​లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదు. కొన్ని సార్లు సైబర్ నేరగాళ్లు.. తాము గూగుల్ పే ప్రతినిధులమని చెప్పుకుంటూ.. తాము సూచించిన థర్డ్ పార్టీ యాప్​లను డౌన్​లోడ్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. గూగుల్ పే మాత్రమే కాదు.. ఏ పేమెంట్ యాప్​ కూడా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్​లను డౌన్​లోడ్ చేసుకోమని చెప్పదు. కనుక ఇలాంటి బోగస్ కాల్స్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే గూగుల్ పే హెల్ప్​లైన్​ సహకారం తీసుకోవాలి. ఇంకా అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడితే ఏమౌతుంది?

  • మీరు ఆన్​లైన్​లో మనీ పేమెంట్స్ చేస్తున్నప్పుడు, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉపయోగిస్తే..
  • సైబర్ నేరగాళ్లు మీకు తెలియకుండానే మీ ATM, డెబిట్ కార్డు సహా, బ్యాంకింగ్ వివరాలు అన్నీ తెలుసుకోగలుగుతారు.
  • మీ ఫోన్​కు వచ్చే OTPలను కూడా వారు నేరుగా చూడగలుగుతారు.
  • దీనితో మీ ఫోన్​ సాయంతోనే.. మీ బ్యాంక్ అకౌంట్​లోని డబ్బులను దోచుకుంటారు.

కనుక, గూగుల్ పే మాత్రమే కాదు.. ఏ పేమెంట్ యాప్​ ఉపయోగించినా కూడా.. స్క్రీన్ షేరింగ్ యాప్​లను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు అలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్​లను, థర్డ్ పార్టీ యాప్​లను మీ డివైజ్​ల నుంచి తొలగించాలి. అప్పుడే మీరు సేఫ్​గా ఉంటారు.

జియో వెబ్​క్యామ్​తో ఇకపై నేరుగా టీవీ నుంచే వీడియో కాల్స్​!

రూ.15వేలకే ల్యాప్​టాప్​ - 'క్లౌడ్'​తో రిలయన్స్ జియో మేజిక్ - మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.