వాతావరణంలో జరిగే మార్పులు.. ఇంటర్నెట్ కనెక్షన్, స్పీడుపై ప్రభావం చూపుతాయి అంటున్నారు ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. వర్షం, తుపాను, వడగాల్పులు.. ఇలా ప్రతీది ఇంటర్నెట్ స్పీడుకు ఆటంకం కలిగిస్తాయని స్పష్టం చేశారు. అయితే.. కేవలం వాతావరణమే కాదు.. మానవ ప్రవర్తనల వల్ల కూడా ఇంటర్నెట్ స్పీడు తగ్గుతుందని పరిశోధకులు జేమ్స్ జిన్ కాంగ్, పాల్ హస్కెల్ తెలిపారు.
వాతావరణ మార్పులు ఇంటర్నెట్ స్పీడుపై ప్రభావం చూపుతాయా?
అవును.. వాతావరణంలో ఏర్పడే మార్పులు ఇంటర్నెట్ స్పీడుపై రకరకాలుగా ప్రభావం చూపిస్తాయి. వర్షాలు, తుపాను, ఎండలు ఎలక్ట్రికల్ కనెక్షన్లకు భౌతికంగా నష్టం కలిగిస్తాయి.
ఇదీ చదవండి : బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్ కహానీ తెలుసా?
ఇంటర్నెట్ స్పీడ్‌పై వర్షం ప్రభావమెంత?
ఇంటర్నెట్ కనెక్షన్లకు రూటర్లు, కేబుల్స్ అవసరం. వర్షం కారణంగా ఈ కేబుల్స్, రూటర్లు భౌతికంగా దెబ్బతింటాయి. చాలా దేశాల్లో ఇంటర్నెట్ కేబుళ్లు.. భూమిలోనుంచి వెళ్తాయి. దీంతో వర్షం, వరదల కారణంగా మట్టి, దుమ్ము ధూళి.. కేబుల్స్‌లోకి వెళ్లటంతో అవి దెబ్బతిని ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడుతుంది.
ఇదీ చదవండి : 2025 నాటికి 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు!
వర్షం, తుపాను ప్రభావం.. వైర్లెస్ సిగ్నల్స్ పైనా ఉంటుందా?
అవును. వైఫై, మైక్రోవేవ్, శాటిలైట్ రేడియో.. లాంటి వైర్లెస్ కనెక్షన్లపైనా వర్షం ప్రభావం ఉంటుంది. నీటి బిందువులు కొంత మేరకు సిగ్నల్‌ను గ్రహిస్తాయి. దీనివల్ల సిగ్నల్ కవరేజీ తగ్గుతుంది. ఒకవేళ వర్షం ఆగినా.. గాలిలోని అధిక తేమ కారణంగా కనెక్షన్ స్పీడు తగ్గుతుంది.
మానవ ప్రవర్తనకు, ఇంటర్నెట్ స్పీడుకు ఏంటి సంబంధం?
వర్షం కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమవుతారు. ఇంకొంత మంది ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తుంటారు. దీంతో ఇంటర్నెట్ వాడకం పెరుగుతుంది.. లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్ వినియోగం పెరిగి.. తద్వారా స్పీడు తగ్గుతుంది. ఇలా కేవలం ఇంట్లోనే జరగదు.. నగరాలు, దేశాల్లోనూ ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరిగి.. స్పిడు తగ్గుతుంది.
ఇదీ చదవండి : ఇంటర్నెట్ వేగంలో టాప్ 10 దేశాలివే..
ఇంటర్నెట్పై వడగాల్పులు, గాలుల ప్రభావమెంత?
అధిక ఉష్ణోగ్రత కలిగిన వడగాల్పులు కారణంగానూ కేబుళ్లు భౌతికంగా దెబ్బతిని ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సైతం నష్టం కలుగుతుంది. శాటిలైట్ సిగ్నల్స్.. గాలిలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణ ప్రభావం వీటిపైనా ఉంటుంది.
అయితే వాతావరణ ప్రభావం రేడియో సిగ్నల్స్పైనా సాధారణంగా ఉండదు. గాలి ద్వారా భౌతికంగా శాటిలైట్ డిష్‌లు దెబ్బతినే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : అంతర్జాలం... రేట్ల మాయాజాలం