గూగుల్ పిక్సెల్ ఫోన్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో మోడళ్ల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిని గూగుల్ మొట్టమొదటి ప్రాసెసర్ టెన్సర్ను కృత్రిమ మేధాతో(ఏఐ) పూర్తిగా రీడిజైన్ చేసి.. రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. గూగుల్ టెన్సర్ చిప్‌లోని వ్యవస్థ.. రెండు స్మార్ట్‌ఫోన్‌లకు మరింత సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపింది. ఫలితంగా పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్లు సమర్థంగా పనిచేస్తాయని పేర్కొంది.
భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు నిరాశే!
పిక్సెల్ 6 సిరీస్‌ను సరికొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్. అయితే వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లోనే గూగుల్ లాంచ్ చేసింది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, తైవాన్, జపాన్, బ్రిటన్ సహా అమెరికా దేశాల్లోనే విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ లేదు. దీంతో భారత్‌లోని గూగుల్ పిక్సెల్ ఫోన్ ఫ్యాన్స్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో పిక్సెల్ 5 సిరీస్‌ను విడుదల చేసినప్పుడు గూగుల్ ఇలానే చేసింది. ఈ ఫోన్లు ఈ నెల 28న విపణిలోకి రానుండగా.. ప్రీ ఆర్డర్స్ కోసం ఈనెల 19 నుంచే అందుబాటులో ఉంచింది గూగుల్.
ధరెంతంటే..?
గూగుల్ పిక్సెల్ 6 ధర రూ.44,881 నుంచి ప్రారంభమవగా.. పిక్సెల్ 6 ప్రో ధర రూ.67,355 నుంచి అందుబాటులో ఉంటుంది.
పిక్సెల్ 6 ఫీచర్లు
- 6.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే
- ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్
- 8 జీబీ ర్యామ్
- అత్యాధునిక బ్యాక్ కెమెరా(1/1.3 అంగుళాల లెన్స్‌తో..)
- 4కె వీడియోను క్వాలిటీతో రికార్డ్ చేసే.. అప్‌గ్రేడెడ్ అల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్
- హెచ్డీఆర్ సపోర్ట్
పిక్సెల్ 6 ప్రో ఫీచర్లు (Google Pixel 6 Pro)
- 6.7 అంగుళాలు ఓఎల్ఈడీ డిస్ప్లే
- క్యూహెచ్డీ ప్లస్ రిజల్యూషన్
- 12 జీబీ ర్యామ్
- అత్యాధునిక బ్యాక్ కెమెరా(1/1.3 అంగుళాల లెన్స్‌తో..)
- 4కె వీడియోను క్వాలిటీతో రికార్డ్ చేసే.. అప్‌గ్రేడెడ్ అల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా
- సరికొత్త అల్ట్రావైడ్ లెన్స్
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్
- హెచ్డీఆర్ సపోర్ట్
స్మార్ట్ గూగుల్ అసిస్టెంట్
పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్లలో భాషను మరింత మెరుగ్గా అవగాహన చేసుకునే వాయిస్ అసిస్టెంట్‌ను పొందుపరిచారు. ఇది మెసేజ్‌లు, మెయిల్స్‌ను అసిస్టెంట్ వాయిస్‌తో త్వరగా టైప్ చేయడానికి, సవరించడానికి, పంపడానికి వినియోగదారులకు ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.
ఇదీ చూడండి: Facebook Name Change: ఫేస్‌బుక్ పేరు మారనుందా..?