ఫోన్లో కొన్ని సార్లు మనం మెసేజ్ టైప్ చేసేప్పుడు తప్పులు దొర్లకుండా ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లో ఆటో కరెక్ట్ ఫీచర్(autocorrect feature android ) ఉంటుంది. ఒకవేళ మనం ఏవైనా పదాలు తప్పుగా టైప్ చేసినా ఆండ్రాయిడ్ ఆటో కరెక్ట్ ఫీచర్ గుర్తించి వాటిని సరిచేస్తుంది. అయితే ఈ ఫీచర్ కొంతమందికి ఉపయోగకరంగా ఉంటే మరికొంత మంది యూజర్స్‌కి ఇది చికాకు కలిగిస్తోంది. అదేంటీ మనం టైప్ చేసే దాన్లో తప్పులను సరిచేస్తే మంచిదేగా అనే సందేహం రావొచ్చు.
ఆటోకరెక్ట్ ఫీచర్‌తో మొబైల్‌లో టైప్ చేస్తున్నప్పుడు మనం టైప్ చేయాలనుకున్న పదం కాకుండా ఒకే రకమైన అక్షరాలు ఉండే మరో పదాన్ని తీసుకుంటుంది. దీంతో మనం టైప్ చేసే మెసేజ్ అర్థమే మారిపోతుంది. దీనివల్ల కొన్నిసార్లు అవతలి వారి నుంచి అభ్యంతరం వ్యక్తమయ్యే పరిస్థితీ లేకపోలేదు. అలానే వేరే భాషలో టైప్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఫీచర్‌తో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా మెసేజ్ టైప్ చేసే ప్రతిసారీ ఆటో కరెక్ట్ ఎంపిక చేసిన పదాన్ని తొలగించి మనం అనుకుంటున్న పదం టైప్ చేసేందుకు సమయం వృథా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆటో కరెక్ట్ ఫీచర్‌ని (autocorrect feature android) డిసేబుల్ చేయడం మినహా మరో దారిలేదు. ఇంతకీ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లో ఆటో కరెక్ట్ ఫీచర్‌ని(disable autocorrect in android) ఎలా డిసేబుల్ చేయాలో చూద్దాం.
- ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ మేనేజ్‌మెంట్ లేదా సిస్టం సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో లాంగ్వేజెస్ అండ్ ఇన్‌పుట్ అనే ఆప్షన్ ఉంటుంది.
- దానిపై క్లిక్ చేస్తే వర్చువల్ కీబోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న కీబోర్డ్‌లతో కూడిన జాబితా కనిపిస్తుంది. అందులో జీబోర్డ్ అనే కీబోర్డ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత జీబోర్డ్ ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే ఆటో కరెక్ట్ ఫీచర్ ఆగిపోతుంది.
- అయితే కొన్ని ఫోన్ మోడల్స్‌లో ఈ కీబోర్డ్ అడిషనల్ సెట్టింగ్స్ లేదా డీఫాల్ట్ కీబోర్డ్ ఆప్షన్‌లో ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అందులో ఆటోఫిల్ సర్వీస్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ ఆప్షన్‌కి బదులు నన్ (None) అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ ఫోన్‌లో ఆటో కరెక్ట్ ఫీచర్ ఆగిపోతుంది. ఇక డీఫాల్డ్ కీబోర్డ్ ఉన్న ఫోన్లలో వాటిపై క్లిక్ చేస్తే సదరు కీబోర్డుకు సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో ప్రెడిక్ట్ టెక్ట్స్, ఆటో స్పెల్ చెక్ వంటి ఆప్షన్లను డిసేబుల్ చేస్తే ఆటో కరెక్ట్ ఆగిపోతుంది.
ఇదీ చూడండి: WhatsApp Chats leak: వాట్సాప్ చాట్స్ లీక్ అవకుండా ఇలా చేయండి!