Chandrayaan 3 Distance Covered : చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి కక్ష్య వైపు దూసుకెళుతోంది. జులై 14న ప్రయోగించినప్పటి నుంచి చంద్రుడివైపు మూడింట రెండు వంతుల దూరం ప్రయాణించిందని ఇస్రో శుక్రవారం తెలిపింది.
Chandrayaan 3 Trans Lunar Injection : దాదాపు మూడు వారాల్లో ఐదు సార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దురంగా వ్యోమనౌకను తీసుకెళ్లారు. ఆగస్టు 1న కీలక విన్యాసం- (స్లింగ్షాట్)తో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 కక్ష్యను పెంచి ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ వ్యోమనౌక భూకక్ష్యను వీడి, చందమామను చేరుకునే మార్గం (లునార్ ట్రాన్స్ఫర్ ట్కాజెక్టరీ)లోకి ప్రవేశించింది.
Lunar Orbit Insertion Maneuver : శనివారం మరో కీలక విన్యాసానికి ఇస్రో రెడీ అయింది. రాత్రి 7 గంటల సమయంలో చంద్రయాన్-3 వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి(లూనార్ ఆర్బిట్ ఇంజక్షన్) ప్రవేశపెట్టన్నామని తెలిపింది. వ్యోమనౌక చంద్రుడికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు (పెరిలూన్) ఈ విన్యాసాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది.
-
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The spacecraft has covered about two-thirds of the distance to the moon.
Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST. pic.twitter.com/MhIOE65w3V
">Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 4, 2023
The spacecraft has covered about two-thirds of the distance to the moon.
Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST. pic.twitter.com/MhIOE65w3VChandrayaan-3 Mission:
— ISRO (@isro) August 4, 2023
The spacecraft has covered about two-thirds of the distance to the moon.
Lunar Orbit Injection (LOI) set for Aug 5, 2023, around 19:00 Hrs. IST. pic.twitter.com/MhIOE65w3V
Chandrayaan 3 Landing Date On Moon : ప్రయోగ తేదీ నుంచి చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యను చేరుకోవడానికి దాదాపు 33 రోజులు పడుతుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి.. ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఆగస్టు 23 లేదా 24న ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగనుంది. చంద్రునిపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్ అయిన తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్-3లో ఆర్బిటర్‌ను పంపడంలేదు. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకు వెల్లడించింది.
Chandrayaan 3 Budget : చంద్రయాన్-3 ల్యాండర్ మృదువుగా చంద్రుడి ఉపరితలంపై దిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 613 కోట్ల రూపాయలను ఇస్రో ఖర్చు చేసింది. చంద్రయాన్-3 బరువు 3,900 కిలోలు, అందులో ల్యాండర్, రోవర్ బరువు 1752 కిలోలు.