ETV Bharat / science-and-technology

బెజోస్​తో స్పేస్​ ట్రిప్​కు రూ.206 కోట్లు చెల్లించి.. ఇప్పుడేమో.. - బ్లూ ఆరిజిన్ స్పేస్ ట్రిప్ ఎప్పుడు?

అపర కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్​తో స్పేస్ ట్రిప్​కు వెళ్లేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి.. ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. వేలం ప్రక్రియలో పాల్గొని 28 మిలియన్ డాలర్లకు బిడ్ దాఖలు చేసిన ఆ వ్యక్తిని అదృష్టం వరించింది. అయితే.. ప్రస్తుత యాత్రను రద్దు చేసుకునేందుకు ఆ వ్యక్తి చెబుతున్న కారణం వింటే నోరెళ్లబెట్టాల్సిందే.

Space Trip With Jeff Bezos
అమెజాన్ స్పేస్ ట్రిప్.. ఇప్పుడు రాలేను
author img

By

Published : Jul 17, 2021, 12:07 PM IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో కలిసి అంతరిక్షయానానికి వెళ్లేందుకు సిద్ధమైన వ్యక్తి ఆ యాత్రను విరమించుకున్నారు. ఆన్​లైన్ బిడ్డింగ్​లో దాదాపు 28 మిలియన్ డాలర్లు (రూ.206 కోట్లు) చెల్లించిన అతను.. అంతరిక్ష ప్రయాణానికి సమయం లేదని చెబుతున్నాడట. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కారణంగానే ఈ యాత్ర చేయలేకపోతున్నట్లు అతను చెప్పారని, అందువల్ల ప్రయాణ తేదీని పొడిగించాలని కోరుతున్నారని 'బ్లూ ఆరిజిన్' ఓ కథనంలో వెల్లడించింది.

ఇక కష్టమే..

బిడ్డింగ్​ గెలుచుకున్న వ్యక్తి ట్రిప్​కు నిరాకరించినందున 18 ఏళ్ల ఆలివర్ డెమెన్ అనే యువకుడు ఈ యాత్రలో భాగం అవుతాడని బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. దీనితో అంతరిక్షయానం చేయనున్న చిన్న వయస్కుడిగా డెమెన్ రికార్డులకెక్కనున్నాడు. ఇదే యాత్రలో బెజోస్‌తో పాటు ప్రయాణించనున్న మరో వ్యక్తి.. 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలో విహరించనున్న పెద్ద వయస్కుడిగా నిలిచిపోనున్నారు.

వీరిద్దరితో పాటు బెజోస్, అతని సోదరుడు మార్క్​లు న్యూ షెపర్డ్ రాకెట్‌లో నింగిలోకి వెళతారు. అమెరికాలోని టెక్సాస్ లాంచ్ ప్యాడ్​ నుంచి జులై 20న బయలుదేరనున్న ఈ ప్రయోగ కార్యక్రమం https://www.blueorigin.com లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.