AI Usage In Samsung S24 Series : భవిష్యత్ అంతా కృత్రిమ మేథస్సు-ఏఐదే. అంతటా వినిపిస్తున్న మాట ఇది. దిగ్గజ సంస్థల నుంచి సామాన్య జనం వరకు అంతా AI జపమే చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులకు ఏఐ బాటలు వేస్తుందని అంచనాలు వేస్తున్నారు. పెద్దగా శ్రమలేకుండా పనిచేసే వెసులుబాటు లభిస్తుందని మైక్రోసాఫ్ట్ మద్దతిస్తున్న ఓపెన్ AI నిరూపిస్తోంది. ఇదే ఒరవడిని టెక్ సంస్థల నుంచి గాడ్జెట్ల తయారీ సంస్థల వరకు అన్నీ అందిపుచ్చుకుంటున్నాయి.
-
Say Hi to the ease of searching for anything with the #GalaxyS24 Ultra. Simply circle it, find it. Epic search is here.
— Samsung India (@SamsungIndia) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Pre-book now: https://t.co/UVcH9n7HJX. #Samsung pic.twitter.com/0F91lOVYSN
">Say Hi to the ease of searching for anything with the #GalaxyS24 Ultra. Simply circle it, find it. Epic search is here.
— Samsung India (@SamsungIndia) January 18, 2024
Pre-book now: https://t.co/UVcH9n7HJX. #Samsung pic.twitter.com/0F91lOVYSNSay Hi to the ease of searching for anything with the #GalaxyS24 Ultra. Simply circle it, find it. Epic search is here.
— Samsung India (@SamsungIndia) January 18, 2024
Pre-book now: https://t.co/UVcH9n7HJX. #Samsung pic.twitter.com/0F91lOVYSN
గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24 Series Launch) సిరీస్ ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్, AIను జోడించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఎస్24, ఎస్24+, ఎస్24 అల్ట్రా పేరిట తీసుకొచ్చిన మూడు కొత్త ఫోన్లలో ఫ్రాసెసర్ల నుంచి కెమెరా వరకూ ఎన్నో ఆధునిక పరికరాలను సమకూర్చింది. సిమ్, ఇంటర్నెట్ లేకుండా మొబైల్‌లో టీవీ ప్రసారాలు అయ్యే ఫీచర్లు తెచ్చింది. గెలాక్సీ S24లో సొంతంగా అభివృద్ధి చేసిన అనేక AI ఫీచర్లతో శామ్‌సంగ్ ఆశ్చర‌్య పరుస్తోంది. గూగుల్‌పై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేస్తోంది.
-
Tired of typing relentlessly to search for something you like? Bid adieu to typing and welcome a new way to search. Get your hands on the #GalaxyS24 Ultra, and search for all you want in seconds.
— Samsung India (@SamsungIndia) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Simply circle it. Find it. Know more: https://t.co/3hZT82fg3h. #SamsungUnpacked pic.twitter.com/rDz6oj44nW
">Tired of typing relentlessly to search for something you like? Bid adieu to typing and welcome a new way to search. Get your hands on the #GalaxyS24 Ultra, and search for all you want in seconds.
— Samsung India (@SamsungIndia) January 17, 2024
Simply circle it. Find it. Know more: https://t.co/3hZT82fg3h. #SamsungUnpacked pic.twitter.com/rDz6oj44nWTired of typing relentlessly to search for something you like? Bid adieu to typing and welcome a new way to search. Get your hands on the #GalaxyS24 Ultra, and search for all you want in seconds.
— Samsung India (@SamsungIndia) January 17, 2024
Simply circle it. Find it. Know more: https://t.co/3hZT82fg3h. #SamsungUnpacked pic.twitter.com/rDz6oj44nW
లైవ్‌లోనే 13 భాషలు, 17 మాండలికాల్లో
ఏదైనా ఇమేజ్ లేదా వీడియో చూస్తున్నప్పుడు అందులో నచ్చిన అంశం లేదా భాగాన్ని సర్కిల్ చేస్తే దాని గురించి సమగ్ర వివరాలను అందించే కొత్త టూల్‌ను S24 ఫోన్లలో శామ్‌సంగ్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ కాల్ వింటున్నప్పుడే లైవ్‌లోనే 13 భాషలు, 17 మాండలికాల్లోకి భాషను అనువదించే ఫీచర్‌ను AI ద్వారా సమకూర్చింది.
-
Craving a snack, and don’t know what it’s called. Don’t worry! The epic way to search is here with the #GalaxyS24 Ultra. Simply circle it, find it.
— Samsung India (@SamsungIndia) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Pre-book now: https://t.co/xvxF415kNJ. #Samsung pic.twitter.com/rnZ2XnJyZz
">Craving a snack, and don’t know what it’s called. Don’t worry! The epic way to search is here with the #GalaxyS24 Ultra. Simply circle it, find it.
— Samsung India (@SamsungIndia) January 18, 2024
Pre-book now: https://t.co/xvxF415kNJ. #Samsung pic.twitter.com/rnZ2XnJyZzCraving a snack, and don’t know what it’s called. Don’t worry! The epic way to search is here with the #GalaxyS24 Ultra. Simply circle it, find it.
— Samsung India (@SamsungIndia) January 18, 2024
Pre-book now: https://t.co/xvxF415kNJ. #Samsung pic.twitter.com/rnZ2XnJyZz
ఏడేళ్లవరకూ OS అప్‌డేట్ గ్యారెంటీ
ఏదైనా మెనూ లేదా ఆహారం ఫోటో తీసినప్పుడు దాని వివరాలను యూజర్ల సొంత భాషలోకి అనువదించే ఫీచర్‌ను సైతం చేర్చింది. భాష తెలియని వేరే దేశం లేదా ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపకరిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫోటోలను నచ్చిన విధంగా అత్యంత సులభంగా మార్పిడి చేసుకునే వెసులుబాటును AI సహాయంతో S24 గ్యాడ్జెట్లో చేర్చారు. గెలాక్సీ S24లో కెమెరా, ఇతర ఆధునికత సౌకర్యాలను సైతం గతంలో వచ్చిన ఫోన్ల కంటే ఆధునికమైనవి చేర్చింది. ఏడేళ్లవరకూ OS అప్‌డేట్ హామీతో S24 సిరీస్ ఫోన్లను శామ్‌సంగ్ తెస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాట్సాప్‌లో కొత్త టెక్ట్స్ ఫార్మాట్లు- అక్షరాలకు స్టైల్ నేర్పేయండిక!
ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్‌లో లైవ్ TV, OTT చూడొచ్చు- అదెలాగో తెలుసా?