ప్రస్తుత రోజుల్లో భారత పౌరులందరికీ ఆధార్ కార్డ్ కీలకంగా మారింది. దూర ప్రయాణాలు చేసేప్పుడైనా, మీ కొరియర్ని అందుకోవాలన్నా సంబంధిత అథారిటీకి మిమ్మల్ని గుర్తించడం ఆధార్‌తో సులభతరం. అయితే.. ఆధార్ అధికారిక వెబ్సైట్ నుంచి కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకుని వెంట ఉంచుకువాల్సిందే. అందుకు ఆధార్ నమోదు చేసుకునేప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు (Aadhaar card download without otp) ఓటీపీ వస్తుంది. తద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ (Aadhaar card download without mobile number ) లేకపోతే.. ఎలా అనుకుంటున్నారా? రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకున్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ అందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి ఈ స్టెప్స్‌ని అనుసరించాలి.
- అధికారిక వెబ్సైట్ 'యూఐడీఏఐ'ని ఓపెన్ చేసి 'my Aadhaar' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- 'order Aadhaar PVC card' ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
- 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి
- 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
- 'my mobile number is not registered' ఆప్షన్ ఎంచుకోవాలి.
- ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- 'send OTP' ని క్లిక్ చేయాలి. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
- 'Terms and conditions'ని సెలెక్ట్ చేసి 'submit' ని క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ ఆధార్‌కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది.
- 'make payment' ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేయాలి. ఆ తర్వాత మీకు కావల్సిన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.