5 Upcoming Compact SUVs : కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్. మరి కొద్ది నెలల్లోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన టాటా, మహీంద్రా, కియా, టయోటా నుంచి కొత్త కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ కార్లను మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే లాంఛ్ చేయనున్నారు.
టాటా పంచ్ సీఎన్జీ(Tata Punch CNG)
ఇటీవలే టాటా మోటార్స్ లాంఛ్ చేసిన హుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ మోడల్‌కు దీటుగా టాటా పంచ్ సీఎన్జీ వెర్షన్‌ను ఈ నెల ప్రారంభంలోనే పరిచయం చేయనుంది టాటా మోటార్స్. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో పంచ్ CNGని లాంఛ్ చేశారు నిర్వాహకులు. ఇది ఆల్ట్రోజ్ CNG మాదిరిగానే ట్విన్-సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులో 1.2ఎల్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. CNG మోడ్‌లో 73.5 పీఎస్ నడిచేలా దీన్ని తయారు చేస్తున్నారు.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్(Tata Nexon Facelift)
త్వరలో రానున్న ఈ Tata Nexon Faceliftని.. Curvv కాన్సెప్ట్ ప్రేరణతో డిజైన్‌ను చేస్తున్నారు. ఆరేళ్ల జీవితకాలంలో కాంపాక్ట్ SUVకి రెండవ అతిపెద్ద అప్డేట్గా నిలవనుంది. ఎక్స్టీరియర్తో పాటు ఇంటిరీయర్ కూడా పూర్తిగా రీ-డిజైన్ చేస్తున్నారు. కొత్త స్టీరింగ్ వీల్, ఇల్యూమినేటెడ్ లోగో, టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ సహా మరిన్ని హంగులతో Tata Nexon Facelift త్వరలోనే లాంఛ్ కానుంది. 1.2ఎల్ డీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో అమర్చనున్నారు.
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్(Kia Sonet Facelift)
ఈ ఏడాది చివరిలోపు ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది. అయితే భారత్‌లోకి మాత్రం 2024 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్‌తో పాటు మెకానికల్ పరంగానూ ఎన్నో సరికొత్త అప్డేట్లను ఈ మోడల్లో వాడనున్నారు. మున్ముందు అధునాతన సాంకేతికతలను కూడా ఇందులో వినియోగించనున్నారు.
టయోటా కాంపాక్ట్(SUV Toyota Compact SUV)
మారుతీ సుజుకి ఫ్రాంక్స్‌కు అప్డేటెడ్ వెర్షన్‌గా టయోటా టైసర్‌ను మార్కెట్లోకి తేనున్నారు. ఇంటిరీయర్తో పాటు ఎక్స్టీరియర్ కూడా సరికొత్త మార్పులతో రూపొందుతుంది Toyota Compact SUV. 1.2ఎల్ ఎన్ఏ కే-సిరీస్ పెట్రోల్, 1.0ఎల్ ట్రిపుల్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లను ఈ మోడల్లో వినియోగించనున్నారు.
మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్(Mahindra XUV300 Facelift)
మహీంద్రా XUV300కు కొనసాగింపుగా మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకొస్తోంది మహీంద్రా సంస్థ. వచ్చే ఏడాది జూన్‌లోపు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. XUV700ను ప్రేరణగా తీసుకొని దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 1.2ఎల్ టర్బో పెట్రోల్, 1.5ఎల్ డీజిల్ ఇంజన్‌లను దీంట్లో వినియోగించనున్నారు. ఇంటిరీయర్ డిజైన్‌లో కూడా భారీ మార్పులు చేయనున్నారు.