ETV Bharat / priya

Village Food Factory : గరిట పట్టాడంటే.. లక్ష్మీదేవి గలగలలాడాల్సిందే! - daddy arumugam cooking videos

యూట్యూబ్‌ ఛానెళ్లు ఎన్నో ఉన్నాయి. అందులో వంటల ఛానెళ్లు కూడా లెక్కలేనన్ని. అయితే, ‘విలేజ్‌ ఫుడ్‌ ఫ్యాక్టరీ’ ఛానెల్‌కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అవును, మిగిలినవాటిలో వంటకాలను మనం నేర్చుకోవడానికి చూస్తాం. కానీ ఈ ఛానెల్లో వంటకాలను చూసి కూడా ఆస్వాదిస్తాం. 65ఏళ్ల ఓ వ్యక్తి ఒంటిచేత్తో భారీ స్థాయిలో వండే ఆ వంటకాలు కనులకూ విందు చేస్తాయి మరి.

village food factory, dady Arumugam
విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ, డాడీ ఆర్ముగం
author img

By

Published : Jun 6, 2021, 11:26 AM IST

మామూలుగా వంటల ఛానెళ్లలో ఏదైనా పావుకిలో అరకిలోనే చేసి చూపిస్తారు. పైగా అన్నిరకాల వంటలూ ఉంటాయి. కానీ తమిళనాడులోని తేని జిల్లా బోడికి చెందిన ఆర్ముగం ఛానెల్లో దాదాపు అన్నీ మాంసాహార వంటకాలే. అదీ పెళ్లి భోజనాల్లో వండినట్లు పెద్ద పెద్ద పాత్రల్లో భారీ స్థాయిలో చేస్తాడు. ఒకేసారి 2500 కోడిగుడ్లతో పులుసు, పది కిలోల చికెన్‌- మటన్‌ కూర, 250 బాతుగుడ్లతో వేపుడు, వెయ్యి కోడి గుండెలతో గ్రేవీ కర్రీ, రెండడుగుల వ్యాసం కలిగిన ఆమ్లెట్‌... ఇలా డాడీ ఆర్ముగం వంటలన్నీ భారీగా ఉండి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వంటకాలను కూడా ప్రత్యేకంగా చెయ్యడంలో ఆర్ముగం సిద్ధహస్తుడు. మసాలా దట్టించిన చికెన్‌ ముక్కల్ని ఖాళీ కొబ్బరి బోండాం లోపల పెట్టి దాన్ని కాల్చి బోండాం చికెన్‌ చేస్తాడు. అలాగే తాటిముంజల్లోపల మసాలా పట్టించిన ఎండ్రకాయల్ని పెట్టి వెరైటీగా వండేస్తాడు.

డాడీ ఆర్ముగం బిర్యానీ

44 లక్షల మంది సబ్​స్క్రైబర్లు

ఇక, నదులూ సెలయేళ్లూ పంటపొలాలూ కొండ గుహలూ ఇలా ప్రకృతి రమణీయత, పల్లె వాతావరణం కనిపించేలా ఒక్కో వీడియోనూ ఒక్కోచోట చిత్రీకరించడం వల్ల వంటలతో పాటు ఆ ప్రకృతి అందాలను కూడా వీక్షకులు ఆస్వాదిస్తుంటారు. అందుకే, ‘విలేజ్‌ ఫుడ్‌ ఫ్యాక్టరీ’కి స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ ఎంతోమంది అభిమానులున్నారు. ఈ ఛానెల్‌కి 44లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

కొడుకు ఆలోచన.. తండ్రి ఆచరణ

నిజానికి నాలుగేళ్ల కిందటి వరకూ ఆర్ముగం ఓ సాధారణ వ్యక్తి. పొట్టకూటి కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాలకూ తిరుగుతూ చీరలు అమ్మేవాడు. ఆ తర్వాత ఏవో పెయింటింగ్‌ పనులు చేయడం మొదలు పెట్టాడు. మరోపక్క అతడి పెద్ద కొడుకు గోపీనాథ్‌ దర్శకత్వం మీద ఇష్టంతో ఏడాది పాటు సినీ రంగంలో సహాయ దర్శకుడిగా పనిచేసి, అవకాశాలు రాక సొంతూరు చేరుకున్నాడు. అయినా తనకిష్టమైన దర్శకత్వాన్ని వదులుకోలేక ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు గోపీనాథ్‌. కానీ అది ఆదరణ పొందలేదు. ఆ సమయంలోనే మాంసాహార వంటకాలు ఎంతో రుచిగా చేసే తన తండ్రి సాయంతో వంటల ఛానెల్‌ని ప్రారంభించాలనుకున్నాడు. ‘వీడియోలతో డబ్బులెలా వస్తాయిరా..?’ అంటూ ఆర్ముగం మొదట ఒప్పుకోలేదు. ఎలాగో అతడిని ఒప్పించి వీడియోలు చెయ్యడం మొదలు పెట్టారు.

చేపలు, రొయ్యలతో వంటకాలు

ఎంతో ప్రత్యేకం

విలేజ్‌ ఫుడ్‌ ఫ్యాక్టరీ ఛానెల్‌ గురించి చెప్పాల్సిన మరో మంచి విషయం ఏంటంటే... అంత భారీస్థాయిలో వండే రుచికరమైన వంటకాలను షూటింగ్‌ పూర్తయ్యాక దగ్గర్లోని అనాథాశ్రమాలూ వృద్ధాశ్రమాలకు అందిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఛానెల్‌ని ప్రారంభించిన మొదటి నెలలో రూ.ఏడువేలు ఆదాయం వస్తే ఆ తర్వాత నెలలో రూ.47వేలు, మూడోనెలలో ఏకంగా మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో కూలికెళ్లే ఆర్ముగం పనిమానేసి వీడియోలకోసం వంటలు చేస్తూ ‘డాడీ ఆర్ముగం’ పేరుతో సెలెబ్రిటీ అయిపోయాడు. వీడియో మధ్యలో అతని కొడుకు పదే పదే డాడీ అని పిలవడంతో ఆ పేరొచ్చిందిలెండి. ఈ పేరుతో ఆర్ముగం అభిమాని ఒకతను మలేషియాలో ఓ హోటల్‌ కూడా ప్రారంభించాడు. ఆర్ముగం కుటుంబం కూడా మదురైలో రెండు హోటళ్లను నిర్వహిస్తోంది. ఇంకేముందీ... మూడేళ్ల కిందట సొంతిల్లు కూడా లేని ఆర్ముగం ఇప్పుడు రూ.50లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. స్కార్పియో, నిసాన్‌ సన్నీ వాహనాలకూ యజమాని అయ్యాడు. గ్రేట్‌ కదూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.