ఎక్కువగా పండగల సమయంలో చేసుకునే రవ్వ షీరాను.. మనకు వీలు దొరికినప్పుడు చేసుకుని (rava sheera calories) ఆవురావురుమంటూ లాగించేయొచ్చు. ఇంతకీ దీని తయారీ ఎలా, ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దామా!
కావాల్సిన పదార్థాలు: యాలకుల పొడి-ఒక టేబుల్ స్పూన్, బెల్లం-అరకప్పు, నెయ్యి-రెండు టేబుల్ స్పూన్లు, రవ్వ-ఒక కప్పు, కిస్మిస్, నానబెట్టిన బాదం
తయారీ విధానం:
ముందుగా పొయ్యిపై గిన్నె పెట్టి నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగించుకోవాలి. మరో గిన్నెలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో యాలకుల పొడి, కరిగించుకున్న బెల్లం రసం పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్, నానబెట్టుకున్న బాదం కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని బాదంతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ రవ్వ షీరా రెడీ అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: గోళ్లు కొరికే అలవాటుకు ఇలా చెక్ పెట్టండి..