కాంబినేషన్లో వంటకాలను చేసుకుంటే ఎన్నో పోషకాలు (healthy recipes indian) శరీరానికి అందుతాయి. స్నాక్స్లోనూ ఇలా తయారు (healthy and tasty snacks) చేసుకుంటే కావల్సిన పోషకాలతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే.. జొన్నపిండి, పాలకూరతో పొంగనాలను (healthy and tasty breakfast) ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా?
కావల్సిన పదార్థాలు: జొన్నపిండి- ఒక కప్పు, పాలకూర- ఒక కప్పు, పచ్చి మిర్చి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్, అ్లలం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా, నూనె- రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర, ఉప్పు, కొత్తి మీర, పచ్చి మిర్చి పేస్ట్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోయాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని చిక్కగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యిపై వేడెక్కుతున్న పొంగనాల ప్లేట్లోకి ఆ మిశ్రమాన్ని పోయాలి. రెండు పక్కల ఎర్రగా కాల్చుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే జొన్న పొంగనాలు తయారవుతాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">