ETV Bharat / priya

ఇంట్లోనే 'నూడుల్స్‌ కట్‌లెట్‌' ట్రై చేయండిలా..

కరోనా వ్యాప్తి కారణంగా బయట ఏ ఫుడ్​ తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. సాయంత్రం వేళ స్నాక్స్​కు అలవాటుపడిన వారికి మరీ కష్టంగా ఉంటుంది. అలాగని నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే 'నూడుల్స్​ కట్​లెట్​'తో చాట్​ బండార్​ రుచిని ఆస్వాదించొచ్చు. అదెలాగంటారా? అయితే.. ఓ సారి ట్రై చేయండిలా..

MAKING NUDDLES CUTLET RECIPE
నూడుల్స్‌ కట్‌లెట్‌
author img

By

Published : Nov 24, 2020, 1:01 PM IST

కరోనా కాలంలో బయటి చాట్​ బండార్​ రుచులు ఆస్వాదించలేకపోతున్నారా? అయితే.. ఇంట్లోనే 'నూడుల్స్​ కట్​లెట్​'ను సింపుల్​గా తయారు చేసుకుని.. ఆ అనుభూతిని పొందండి. ఇదిగో తయారీ విధానం మీకోసం..

కావాల్సినవి:

  • ఉడికించిన నూడుల్స్‌- పావుకేజీ
  • తురిమిన చీజ్‌- అరకప్పు
  • మైదా- రెండు టేబుల్‌స్పూన్లు
  • పాలు- రెండు కప్పులు
  • మీగడ- రెండు టేబుల్‌స్పూన్లు
  • ఉప్పు- సరిపడా
  • ఆవాలపొడి- పావు టీస్పూన్‌
  • మిరియాల పొడి- అర టీస్పూన్‌
  • నూనె- టీస్పూన్‌
  • బ్రెడ్‌పొడి- కొద్దిగా

తయారీ విధానం:

మీగడను వేడిచేసి అందులో మైదా వేసి రెండు నిమిషాలు వేయించాలి. దీంట్లో కొద్దికొద్దిగా పాలు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. చీజ్‌, ఉప్పు, ఆవాల పొడి, మిరియాల పొడి, నూడుల్స్‌ కూడా జతచేసి బాగా కలపాలి. ప్లేటుకు నూనె రాసి ఈ మిశ్రమాన్ని దానిపై పరిచి అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకుని బ్రెడ్‌ పొడిలో దొర్లించి కట్‌లెట్ల మాదిరిగా ఒత్తుకోవాలి. వీటిని పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత పాన్‌ వేడి చేసి కొద్దిగా నూనె పోసి కట్‌లెట్లు వేసి కాల్చాలి. ఇప్పుడు వీటిని తక్కువ మంట మీద బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు కాల్చాలి.

ఇదీ చదవండి: ఘుమఘుమలాడే 'చికెన్​ టిక్కా మసాలా' రెసిపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.