ETV Bharat / priya

కన్నడ స్వీట్​ 'బెళగావి కుంద' సింపుల్ రెసిపీ

తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ కాజా, బందరు లడ్డూలాగే.. కన్నడనాట కూడా ఓ స్వీట్​ బాగా పేరుగాంచింది. ఎంతగా అంటే.. బెళగావికి వెళ్లిన వారెవరైనా ఆ స్వీట్​ను తెచ్చుకోకుండా ఉండలేనంతగా! మరి ఆ స్వీట్​ను మన ఇంట్లోనే చేసుకుంటే.. భలే ఉంటుంది కదూ. అయితే ఇలా ట్రై చేయండి...

Local  Sweet Item Belgavi Kunda made at Karnataka
ఆహా! ఏమి రుచి- లోకల్​ స్వీట్​ 'బెళగావి కుంద'
author img

By

Published : Oct 19, 2020, 2:00 PM IST

కర్నాటకలోని బెళగావి వెళ్లిన వాళ్లు కుందా స్వీట్​ తెచ్చుకోకుండా వెనక్కిరారని నానుడి. అంత అద్భుతమైన స్వీట్​ తయారీ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే..

ఒకప్పుడు రాజస్థాన్​ నుంచి వచ్చిన మార్వాడీ అతను బెల్గాంలో స్వీట్​ షాప్​ పెట్టాడు. అతడో ఓ రోజు పాలు కాస్తూ స్టవ్ ఆర్పడం మర్చిపోయి బయటకు వెళ్లిపోయాడు. రెండు గంటల తర్వాత వచ్చి చూస్తే పాలు బాగా మరిగి సగం అయిపోయాయి. వాటిని రుచి చూస్తే అతడికి స్వీట్​ తిన్నట్టే అనిపించిందట. ఆ పాలలో కాస్త కోవా వేసి మరిగించగానే దాని రుచి రెట్టింపైంది. ఆ రుచికి ఫిదా అయిన అతడు.. వెంటనే దానికి 'కుంద' అని పేరుపెట్టాడు. బెల్గాంలో తయారైంది కాబట్టి బెల్గాం కుందగా మారింది. దీన్ని మనమూ తయారుచేసుకుని మధురమైన ఆ రుచిని ఆస్వాదించవచ్చు.

Local  Sweet Item Belgavi Kunda made at Karnataka
బెళగావి కుంద స్వీట్​

కావాల్సినవి:

  • చిక్కని పాలు- రెండు లీటర్లు
  • పెరుగు- అరకప్పు
  • పంచదార- కప్పు
  • యాలకులపొడి- పావు టీస్పూన్
  • జీడిపప్పు, బాదాం- పావు కప్పు

తయారీ విధానం:

స్టవ్​ మీద మందపాటి గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి. దీంట్లో పెరుగు పోసి పాలల్లో కలిసిపోయేలా బాగా కలపాలి. తర్వాత అర కప్పు పంచదార వేయాలి. ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి మరో అర కప్పు పంచదార వేసి వేయిస్తే అది చిక్కటి ద్రవంలా తయారవుతుంది. దీన్ని పాల మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా గట్టిపడేంతవరకు గరిటెతో తిప్పుతుండాలి. చివరగా యాలకులపొడి వేసి పైన జీడిపప్పు, బాదాంతో అలంకరించాలి.

ఇదీ చదవండి: ఆహా! అనిపించే 'గోంగూర రొయ్యల కూర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.