ETV Bharat / priya

చిల్లీ పన్నీర్.. సాయంత్రం వేళ గరంగరంగా! - పనీర్ కర్రీ

పన్నీర్​ అంటే ఇష్టపడని వారుండరు. రుచిగా వండాలే గానీ నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. దీంతో పన్నీర్​ బటర్​ మసాలా, పన్నీర్ టిక్కా, కడాయి పన్నీర్​ లాంటి ఎన్నో రకాల రెసిపీలను తయారు చేసుకోవచ్చు. ఇక నోరూరించే చిల్లీ పన్నీర్​ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ నేపథ్యంలో దాని తయారీ విధానం ఎలాగో తెలుసుకోండి.

chilli paneer
చిల్లీ పన్నీర్​
author img

By

Published : Sep 6, 2021, 4:52 PM IST

కొన్ని వంటకాల ప్రత్యేకతే వేరు.. కావాలనుకున్నప్పుడు కర్రీలా, కాలక్షేపానికి స్నాక్స్​లా పనికొస్తాయి. అలాంటిదే చిల్లీ పన్నీర్. సాయంత్రం వేళ పిల్లలకు చిరుతిళ్లలా, అతిథులకు మర్యాద కోసం దీనిని చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ క్రమంలో దీని తయారీ విధానం ఎలానో చూసేయండి.

chilli paneer
చిల్లీ పన్నీర్​

కావాల్సిన పదార్థాలు: (తగిన మోతాదులో తీసుకోండి)

కార్న్​ఫ్లోర్​, మైదాపిండి, ఉప్పు, చిల్లీ పేస్ట్, పన్నీర్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, సోయాసాస్, మిరియాలపొడి, స్ప్రింగ్ ఆనియన్స్

తయారీ విధానం:

బౌల్​లో కొంచెం కార్న్​ఫ్లోర్​, కొద్దిగా మైదాపిండితో పాటు ఉప్పు, చిల్లీ పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని బ్యాటర్​ తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వసి మంచి కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

తరువాత ఇంకొక పాన్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వేసి కాస్త వేగిన తరువాత అందులో రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, సోయాసాస్, మిరియాలపొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు వేసి టాస్ చేసుకొని పై నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ పన్నీర్ రెడీ.

ఇదీ చూడండి: నోరూరించే పన్నీర్​ దమ్​ బిర్యానీ.. చేసుకోండిలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.