ఇడ్లీ, సాంబార్(idli sambar).. డెడ్లీ కాంబినేషన్. అయితే దీనికి ఏమాత్రం తీసుపోదని అంటుంది రసం ఇడ్లీ (Idli Recipe). దీనిని తీసుకోవడం వల్ల చక్కని రుచితో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు అజీర్తి సమస్య మటుమాయం అవుతుంది. ఇంతటి ఆరోగ్యకరమైన రసం ఇడ్లీని తయారు చేసుకునే విధానంపై ఓ లుక్కేద్దామా?
తయారీ విధానం..
ముందుగా పాన్లో ధనియాలు, కందిపప్పు, పచ్చి శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టి పొడిగా(idli podi) చేసుకోవాలి. బాగా కాగే పాన్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, వేసి కలుపుకోవాలి, తరువాత టమాటా ముక్కలు వేసి కొంచెం వేగాక.. పచ్చిమిర్చి, ఉప్పు, పుసుపు, చింతపండు రసం, నీళ్లు పోసుకొని.. ముందుగా పట్టి పెట్టిన పప్పుల మిశ్రమాన్ని వేసుకొని ఉండికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లో ఇడ్లీలు వేసుకొని... పై నుంచి రసం(rasam recipe) వేసుకొని కొత్తిమేరతో గార్నిష్ చేసుకుంటే 'రసం ఇడ్లీ' రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కావాల్సిన పదార్థాలు..
- ధనియాలు
- ఎండు మిర్చి
- మిరియాలు
- కందిపప్పు
- పచ్చి శనగపప్పు
- జీలకర్ర
- టమాటా ముక్కలు
- చింతపండు రసం
- పుసుపు
- ఇంగువ
- పచ్చిమిర్చి
- నూనె
- ఉప్పు
- ఆవాలు
- కరివేపాకు
- కొత్తిమేర
- ఇడ్లీలు
ఇదీ చూడండి: Chicken recipes: పసందైన చికెన్ మిరియాల రసం