చిరుతిండ్ల విషయానికొస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే నూడుల్స్, పాస్తా, చాక్లెట్స్, కేక్, చిప్స్.. మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇవి శరీరంలో కొవ్వు (snacks item for kids) శాతాన్ని పెంచుతాయి. వీటికి బదులు ఆరోగ్యానికి మేలు చేసే క్యాబేజీ-65 స్నాక్స్‌ని మీరే ఇంట్లో తయారుచేసి వారికి తినిపించండి.
కావల్సిన పదార్థాలు:
క్యాబేజీ, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, కొంచెం కారం, ఉప్పు, ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని కట్ చేసుకున్న క్యాబేజీని వేసి బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచ్ చేసుకున్న క్యాబేజీని చల్లని నీళ్లలో వేసి నీళ్లు అన్ని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, కొంచెం కారం, ఉప్పు, ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని రౌండ్‌గా చేసుకుని మరుగుతున్న నూనెలలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని బౌల్లోకి తీసుకుని తర్వాత దానిపై నుంచి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజీ-65 రెడీ అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:ప్రాన్స్ 65.. రుచిగా.. కరకరలాడుతూ..