ETV Bharat / priya

బ్రెడ్​తో స్పైసీ స్పైసీ వంటలు- తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా! - బ్రెడ్‌ చాట్‌

Bread Chaat and Manchurian Making Process: బ్రెడ్​ అంటే చాలా మందికి ఇష్టం. బ్రెడ్​ ఉపయోగించి చాలా రకాల వంటలు చేస్తారు. అయితే అందులో గుర్తొచ్చే స్వీట్​.. డబల్​ కా మీఠా. అయితే బ్రెడ్​తో కేవలం స్వీట్​ మాత్రమే కాదు.. స్పైసీ స్పైసీ వంటలు కూడా రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

Bread Chaat and Manchurian Making Process

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 2:14 PM IST

Bread Chaat and Manchurian Making Process: బ్రెడ్​.. చాలా మంది ఇళ్లల్లో నిత్యం ఉంటుంది. చాలా మంది దీనిని పాలతో కలిపి బ్రేక్​ఫాస్ట్​లాగా తీసుకుంటారు. ఇంకా బ్రెడ్​తో వెరైటీలు ఏం చేసుకోవచ్చు అంటే.. డబల్​ కా మీఠా గుర్తుకు వస్తుంది. అయితే కేవలం స్వీట్​ మాత్రమే కాదు.. బ్రెడ్​తో స్పైసీ వంటలు కూడా చేసుకోవచ్చు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ ఆ రెసిపీలు ఏంటి..? వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

బ్రెడ్‌ చాట్‌: చాట్​ అనగానే.. బఠానీ, శనగలతో చేసినదే గుర్తుకు వస్తుంది. కానీ బ్రెడ్​తో కూడా చాట్​ రెడీ చేసుకోవచ్చు. టేస్ట్​ కూడా అదిరిపోతుంది. చేయడం కూడా వెరీ ఈజీ. మరి ఇంకెందుకు లేట్​.. ఎలా చేయాలో చూద్దాం పదండి..

చికెన్​ రెగ్యులర్​గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా!

కావాల్సిన పదార్థాలు:

  • బ్రెడ్‌స్లైసులు: నాలుగు
  • వెన్న: రెండు చెంచాలు
  • ఉడికించిన బంగాళాదుంప ముక్కలు: పావుకప్పు
  • ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు
  • టమాట ముక్కలు: పావుకప్పు
  • పచ్చిమిర్చి: ఒకటి
  • గిలకొట్టిన పెరుగు: అరకప్పు
  • సన్నని కారప్పూస: పావుకప్పు
  • గ్రీన్‌ చట్నీ: ఒకటిన్నర చెంచా
  • స్వీట్‌ చట్నీ: ఒకటిన్నర చెంచా
  • నల్ల ఉప్పు: పావుచెంచా
  • ఉప్పు: తగినంత
  • వేయించిన జీలకర్రపొడి: అరచెంచా
  • చాట్‌మసాలా: 1 స్పూన్​
  • కారం: పావుచెంచా

కార్తిక మాసం ముగిసిపోయింది - ఈ సండే మీ ఇంట్లో ఏం కూర - ఈ నాన్​వెజ్​ ట్రై చేస్తారా!

తయారుచేసే విధానం:

  • బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తొలగించి మీడియం సైజ్​ ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • పొయ్యి మీద బాణలి పెట్టి వెన్న, అరచెంచా చాట్‌మసాలా వేయాలి. ఇందులో బ్రెడ్‌ముక్కల్ని వేసి కరకరలాడేలా వేయించుకుని తీసుకోవాలి.
  • వీటిపైన నల్ల ఉప్పు, కారం, జీలకర్రపొడి, మిగిలిన చాట్‌మసాలా వేసి బాగా కలపాలి.
  • తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలూ వేసి కలపాలి.
  • వడ్డించేముందు పెరుగు, గ్రీన్‌, స్వీట్‌ చట్నీలు, సన్నకారప్పూస వేస్తే చాలు.
  • బ్రెడ్‌ముక్కలు కరకరలాడేలా ఉంటేనే చాట్‌ రుచిగా ఉంటుంది.

బ్రెడ్​ మంచూరియా: మంచూరియా అంటే వెజ్​, చికెన్​, ఫ్రాన్స్​, ఎగ్​ మంచూరియా గుర్తుకువస్తుంది. ఎప్పుడూ అవే కాకుండా ఈసారి బ్రెడ్​తో ట్రై చేసుకోండి. మరి ఆ ప్రాసెస్​ ఏంటంటే..

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

కావాల్సినవి:

  • బ్రౌన్‌ బ్రెడ్‌ పొడి- అరకప్పు
  • క్యారెట్‌ తురుము- అర కప్పు
  • సన్నగా తరిగిన క్యాబేజీ- కప్పు
  • మిరియాల పొడి-అర చెంచా
  • అల్లంవెల్లుల్లి ముద్ద- అర చెంచా
  • మొక్కజొన్న పిండి- పావు కప్పు
  • ఉప్పు- తగినంత
  • నూనె- వేయించడానికి సరిపడా
  • సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు- మూడు
  • పచ్చిమిర్చి- ఒకటి (నిలువుగా చీల్చినవి)
  • ఉల్లికాడల తరుగు- నాలుగు పెద్ద చెంచాలు
  • టమాట సాస్‌- రెండు పెద్ద చెంచాలు,
  • క్యాప్సికమ్‌ ముక్కలు- పావు కిలో
  • చిల్లీసాస్‌- 1 స్పూన్​
  • మొక్కజొన్న పిండి- చెంచా,
  • వెనిగర్‌- 1 స్పూన్​
  • సోయాసాస్‌- పెద్ద చెంచా
  • మిరియాలు- పావు చెంచా
  • ఉప్పు- తగినంత.

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

తయారీ:

  • ఓ పెద్ద గిన్నెలో బ్రెడ్‌ పొడి, క్యాబేజీ, క్యారెట్‌ తురుము, మిరియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, మొక్కజొన్న పిండి, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపాలి.
  • దీన్ని మెత్తగా చపాతీ పిండిలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకుని గుండ్రంగా చిన్న చిన్న బంతులను(మంచూరియా) సిద్ధం చేయాలి.
  • తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి.. వేడయ్యాక మంటను మీడియంలో పెట్టి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు ఈ బాల్స్‌ను వేయించాలి. ఆ తర్వాత వీటిని టిష్యూ కాగితంపై వేసి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు పొయ్యి మీద మరో కడాయి పెట్టి అది వేడయ్యాక కొద్దిగా నూనె పోసి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. క్యాప్సికమ్‌ ముక్కలనూ వేసి వేయించాలి.
  • తర్వాత టమాట సాస్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌, మిరియాలు, ఉప్పును జోడించాలి.
  • సాస్‌ చిక్కగా మారేవరకు పెద్ద మంటపై కలుపుతూ ఉండాలి.
  • తర్వాత చెంచా మొక్కజొన్న పిండిలో పావు కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. దీన్ని ఈ మిశ్రమంలో కలపాలి. గ్రేవీ కొద్దిగా చిక్కగా అయ్యే వరకు నిరంతరం కలుపుతూనే ఉండాలి.
  • గ్రేవీ చిక్కగా అయిన తర్వాత.. వేయించి పెట్టుకున్న మంచూరియన్‌ బాల్స్‌, కొద్దిగా ఉల్లి కాడల తరుగు వేసి కలపాలి.
  • తర్వాత మిగిలిన ఉల్లి కాడలతో అలంకరిస్తే సరి. వేడి వేడి బ్రెడ్​ మంచూరియా రెడీ..

Nellore Chepala Pulusu Recipe in Telugu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్​ సూపర్​.. ప్లేటు నాకాల్సిందే..!

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.