ETV Bharat / opinion

అధ్యక్ష పదవిపై గందరగోళం వీడేదెన్నడో..? - అమెరికా ఎన్నికలుఫలితాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విజేతకు తిరుగులేని మెజారిటీ వస్తుందా? లేక అరకొర మెజారిటీ వచ్చి ఫలితాల బంతి కోర్టు వాకిట్లో పడుతుందా? అనే ప్రశ్న అందరి నోటా వినవస్తోంది. అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల ఫలితాలను అన్ని పార్టీలు శిరసా వహించినా.. అమెరికాలో భిన్నమైన సమాఖ్య పద్ధతి నెలకొని ఉండటం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది.

us election
అమెరికా
author img

By

Published : Nov 7, 2020, 7:48 AM IST

Updated : Nov 7, 2020, 10:13 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి ట్రంప్‌, బైడెన్‌లలో ఎవరు గెలుస్తారా అని అమెరికన్లతోపాటు ఇతర దేశాలవారూ ట్విటర్‌ను, ఎన్నికల వెబ్‌సైట్లను ఉత్కంఠతో శోధిస్తున్నారు. భారతీయులైతే బిహార్‌ ఎన్నికలకన్నా అమెరికా ఎన్నికల మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే అతిశయోక్తి కాదు. విజేతకు తిరుగులేని మెజారిటీ వస్తుందా లేక అరకొర మెజారిటీ వచ్చి ఫలితాల బంతి కోర్టు వాకిట్లో పడుతుందా అనే ప్రశ్న అందరి నోటా వినవస్తోంది.

కరోనా వల్ల పోలింగ్‌ తేదీకి ముందే 10 కోట్ల ఓట్లు తపాలా ద్వారా పోల్‌ కావడం, వాటి మీద ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోర్టుల్లో పేచీలు పెట్టడం ఈ గందరగోళానికి కారణం. కోర్టు వ్యాజ్యాల వల్ల ఎన్నికల ఫలితం వెలువడటానికి రోజులు లేదా వారాలు పట్టవచ్చన్న అనుమానాలు ఏర్పడ్డాయి. పోలింగ్‌ పూర్తయ్యాక నిర్దిష్ట తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడటం, వాటిని అన్ని పార్టీలు శిరసా వహించడం అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నదే- ఒక్క అమెరికాలో తప్ఫ అక్కడ ఇతర దేశాలకు భిన్నమైన సమాఖ్య పద్ధతి నెలకొని ఉండటం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది.

అమెరికాలో కొన్ని నిర్దేశిత అంశాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకే అత్యధిక అధికారాలు ఉంటాయి. ఎన్నికలను ఎలా నిర్వహించాలి, ఎవరు ఎప్పుడు ఎలా ఓటు వేయాలనే అంశంపై రాష్ట్రాలకే పూర్తి అధికారం ఉంది. ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సొంత నిబంధనలను అనుసరిస్తాయి. పోలైన ఓట్లను ఎప్పుడు లెక్కించాలి, పోలింగ్‌ తేదీ తరవాత అందిన పోస్టల్‌ ఓట్లను ఆమోదించాలా వద్దా, ఓట్ల లెక్కింపును ఏ తేదీకల్లా పూర్తి చేయాలనే అంశాలపై పూర్తి నిర్ణయాధికారం రాష్ట్రాలదే. అమెరికాలో చిన్న రాష్ట్రమైనా, పెద్ద రాష్ట్రమైనా- కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఎగువ సభ సెనేట్‌లో తలా రెండేసి సీట్లు ఉంటాయి.

తపాలా ఓట్లపై తకరారు

ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించిన ట్రంప్‌ బ్యాలట్‌ పత్రాల చెల్లుబాటును, ఓట్ల లెక్కింపును కోర్టుల్లో సవాలు చేస్తున్నారు. కరోనా విజృంభణ వల్ల చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో 10 కోట్లమంది వరకు అమెరికన్లు తపాలా ద్వారా ఓటు వేశారు. వీరిలో 80 లక్షలమంది 18-29 ఏళ్ల ప్రాయంలోని యువజనులేనని అంచనా. పోలింగ్‌ కేంద్రాల్లోనూ రికార్డు సంఖ్యలో యువ ఓటర్లు కనిపించారు. వీరు కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం, నిరుద్యోగం, జాత్యహంకారాలకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

పెన్సిల్వేనియా రాష్ట్రంలో యువత తొలిసారి ఓటర్లుగా నమోదయ్యేటప్పుడు సరైన గుర్తింపు పత్రాలను చూపలేదనే వంకతో వారి తపాలా ఓట్లను తిరస్కరించాలని ట్రంప్‌ వర్గీయులు దావా వేశారు. యువ ఓటర్లు బైడెన్‌ వైపు మొగ్గారనడానికి ఇది బలమైన సూచన. అత్యధిక డెమొక్రాట్‌ ఓటర్లు కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా ముందస్తుగా తపాలా ఓట్లు వేశారనే అంచనాలు ఉన్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ను సమర్థించే రిపబ్లికన్‌ ఓటర్లు మాత్రం ఆయనలానే మాస్కులు ధరించకుండా బయటికి వచ్చి పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు వేశారని, దీన్ని వీరత్వ ప్రదర్శనగా భావించారని విశ్లేషణ వినవస్తోంది.

అమెరికాలోని 50 రాష్ట్రాలకు 34 రాష్ట్రాలు, వాటితోపాటు రాజధాని వాషింగ్టన్‌ కూడా తపాలా బ్యాలట్లను అనుమతిస్తున్నాయి. ఈ తపాలా ఓట్లలో అత్యధికం డెమొక్రాట్ల ఖాతాలో పడతాయనే భయంతో ఆ ఓట్ల చెల్లుబాటును ట్రంప్‌ కోర్టుల్లో సవాలు చేస్తున్నారు. మిషిగన్‌, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును ఆపాలని, పెన్సిల్వేనియాలో పోలింగ్‌ రోజు రాత్రి ఎనిమిది గంటల తరవాత అందే బ్యాలట్‌ పత్రాలను లెక్కించకూడదని వాదిస్తూ దావాలు వేశారు.

జార్జియా రాష్ట్రంలో ఒక ఎన్నికల కార్యకర్త తపాలా ఓట్లను కలగాపులగం చేశాడనే సాకుతో దావా వేశారు. చివరకు మిషిగన్‌, జార్జియా రాష్ట్రాల కోర్టులు ఈ దావాలను కొట్టివేయగా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌నకు అనుకూలంగా తీర్పు వచ్చింది. బైడెన్‌ స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్న నెవాడా రాష్ట్రంలోనూ అవకతవకలు జరిగాయని ట్రంప్‌ వర్గం ఆరోపిస్తోంది. మిషిగన్‌, జార్జియా, నెవాడాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. బైడెన్‌ గెలిచిన లేక ఆధిక్యం కనబరుస్తున్న రాష్ట్రాలన్నింటిలో ట్రంప్‌ వర్గీయులు కోర్టు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ దావాలపై తుది నిర్ణయాధికారం సుప్రీంకోర్టుదేనని ట్రంప్‌ అంటున్నా- ఏ వ్యాజ్యమైనా కింది కోర్టు నుంచి పైకి రావలసిందే.

పీటముడి...

బైడెన్‌కు 20,000 ఓట్ల ఆధిక్యాన్ని కట్టబెట్టిన విస్కాన్సిన్‌ రాష్ట్రంలో రీకౌంట్‌ను డిమాండ్‌ చేస్తామని ట్రంప్‌ శిబిరం బెదిరిస్తున్నా, దానివల్ల అక్కడ బైడెన్‌ మెజారిటీ ఏమీ తారుమారు కాదు. చాలా రాష్ట్రాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో పడిన ఓట్లను మొదట లెక్కించగా ట్రంప్‌కు ఆధిక్యం కనిపించింది. తపాలా ఓట్లను లెక్కించగానే ఆ ఆధిక్యం హరించుకుపోయింది. అందుకే ట్రంప్‌ కోర్టులకెక్కుతున్నారు. జార్జియా, నార్త్‌ కరోలైనా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్‌ స్వల్ప ఆధిక్యాన్ని సాధించినా, తపాలా ఓట్లతో ఫలితం తారుమారు కావచ్చు.

మొత్తం మీద తొమ్మిది కీలక రాష్ట్రాల్లో ఎవరైతే ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు సాధిస్తారో వారినే అధ్యక్ష పదవి వరిస్తుంది. బైడెన్‌కు 264 ఎలక్టోరల్‌ ఓట్లు లభించాయనే వార్తలు వచ్చినందువల్ల, ఇక ట్రంప్‌ వర్గం ఎన్ని వ్యాజ్యాలు వేసినా బైడెన్‌ గెలుపును ఆపలేకపోవచ్చు. డిసెంబరు ఎనిమిదో తేదీకల్లా అన్ని వ్యాజ్యాలను పరిష్కరించడమో, నిలిపివేయడమో జరగాలి. ఆపైన జనవరి ఆరున కొత్త అధ్యక్షుడిని చట్టబద్ధంగా ఖరారు చేసి తీరాలి. జనవరి 20న కొత్త సారథి ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియను కోర్టు దావాలతో ఆపడం సాధ్యపడదనే చెప్పాలి.

యూఎస్‌ దారే వేరు!

మిగతా ప్రజాస్వామ్యాలకు భిన్నంగా అమెరికాలో కాంగ్రెస్‌ దిగువ సభ (ప్రజా ప్రతినిధుల సభ)కన్నా ఎగువ సభ సెనేట్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అమెరికా ప్రజావాణిని ప్రతిబింబించేది ప్రజా ప్రతినిధుల సభే కానీ, ఆ వాణికన్నా సెనేట్‌కు ఎన్నికయ్యే ఘరానా వ్యక్తుల మాటకే అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఎక్కువ విలువ ఇచ్చారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలతోపాటు 100 సీట్ల సెనేట్‌లో 35 సీట్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాటికి వెలువడిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు చెరి 48 సీట్లు దక్కాయి. ఇంకా నాలుగు సీట్లకు ఫలితాలు వెలువడవలసి ఉంది.

కాంగ్రెస్‌ దిగువ సభలో మెజారిటీ ఉన్న డెమొక్రాట్లు, సెనేట్‌లోనూ మెజారిటీ సాధించగలిగితే, తమ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ అజెండా అమలుకు వెన్నుదన్ను కాగలుగుతారు. శుక్రవారం వరకు దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కు విజయావకాశాలు దండిగా కనిపించాయి. అమెరికాలో సామాన్య ప్రజల ఓట్లతో కాకుండా ఎలక్టోరల్‌ కాలేజ్‌ (నియోజక గణం) ఓట్లతోనే అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ గణంలో మొత్తం 538 ఓట్లు ఉంటాయి. వాటిలో 270 సాధించిన అభ్యర్థే అధ్యక్షుడవుతారు. శుక్రవారంనాటికి బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా, ట్రంప్‌ 214 ఓట్లతో వెనకబడిపోయారు.

(రచయిత - కైజర్‌ అడపా)

Last Updated : Nov 7, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.