ETV Bharat / opinion

'అనిశ్చితిలో ప్రపంచం- సరైన రాజకీయ నిర్ణయాలే కీలకం'

author img

By

Published : Jun 30, 2020, 3:10 PM IST

అంతర్జాతీయంగా ఏర్పడ్డ అనిశ్చితుల మధ్య చైనా పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనాను ఒంటరి చేయడానికి అమెరికా వంటి ప్రపంచశక్తులు భారత్​ను తమతో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. చైనా సైతం భారత్​ను దూరం చేస్తూ పాశ్చాత్య శక్తులతో ఏకమయ్యేలా బలవంతం చేస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు గురించి ఆలోచించి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Weigh options carefully - geopolitical equations in a state of flux
'అనిశ్చితిలో ప్రపంచం- సరైన రాజకీయ నిర్ణయాలే కీలకం'

భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల తీవ్ర స్థాయిలో అనిశ్చితి ఏర్పడటం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. భద్రతా పరమైన నిర్ణయాలు, వాణిజ్య ఏర్పాట్లు, బహుపాక్షిక అవగాహనలు వంటి అంశాలేవైనా ఇప్పుడు సులభంగా ఊహించే విధంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ఇలాంటి పరిస్థితులకు బాటలు వేసింది. ఇందుకు కారణమైనందుకు ఇద్దరిని 'అభినందించాలి'. ఒకరు అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే... కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 'చక్రవర్తి' షీ జిన్​పింగ్ మరొకరు.

'మేక్ అమెరికా గ్రేట్ అగైన్', 'అమెరికా ఫస్ట్' నినాదాలతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అమెరికా ఉదారతను తన ప్రయోజనాలకు వాడుకుంటున్నారని భాగస్వామ్య దేశాలపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జీ7, నాటో దేశాల కూటముల లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం అమెరికా గణనీయమైన వ్యయాలకోర్చి వీటిని నెలకొల్పిందని, కానీ సభ్యదేశాలు ఆర్థిక భారాన్ని సమానంగా పంచుకోవడంలేదని మండిపడ్డారు. వీటిని 'ఫ్రీ-లోడర్లు'గా అభివర్ణించారు. అయితే, ట్రంప్ అపహాస్యం చేసిన దేశాల్లో ఒక్కటి కూడా రక్షణ రంగంపై జీడీపీలో 1 శాతం కూడా ఖర్చు చేయడం లేదు.

ఒప్పందాల విస్మరణ

అంతేకాకుండా గతపాలకుల వారసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ముద్ర ఉన్న ప్రతి విషయంలో వ్యతిరేకంగా పనిచేశారు. ప్రతిష్టాత్మక టీపీపీ(ట్రాన్స్​-పసిఫిక్ భాగస్వామ్యం) వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలిగారు. వాతావరణ మార్పులపై చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలగడం వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.

అమెరికా ఒప్పందం నుంచి వైదొలిగినప్పటికీ ఇరాన్ మాత్రం దానికి కట్టుబడే ఉంది. అయినా.. ఆ దేశంపై ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. అమెరికాకు అత్యంత ఆప్తులైన జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియా నేతలతోనూ ప్రతికూల వైఖరి అవలంబించారు ట్రంప్.

అయితే ట్రంప్ ఒక్క విషయాన్ని మాత్రం సరిగ్గా గ్రహించారు. అదే చైనా ముప్పు! అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 2016 డిసెంబర్​లో తైవాన్ నుంచి వచ్చిన అభినందనను అంగీకరించి 35 ఏళ్ల నుంచి అమెరికా పాటిస్తున్న 'వన్ చైనా పాలసీ'కి తెరదించారు.

ఈ చర్యతో చైనాలో కొద్దిపాటి కలవరం మొదలైంది. దీనిని 'తైవాన్ ప్రయోగించిన చిన్న ఉపాయం' అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. అమెరికాతో ఏర్పడిన రాజకీయ పునాది చెదిరిపోవడాన్ని చైనా చూడాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

సుంకాలు-ఆంక్షలు

అప్పటికి చైనా విషయంలో ట్రంప్ ఆలోచనలు స్పష్టంగానే ఉన్నాయి. దశాబ్దాలుగా అమెరికా నుంచి చైనా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతోందని ఆయన ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నారు. చైనాతో 375 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉండటాన్ని వ్యతిరేకించారు. అమెరికా ప్రయోజనాలను చైనా బలహీనం చేస్తోందని, వాణిజ్య గూఢచర్యంలో నిమగ్నమైందని ఆరోపించారు. హైటెక్ కంపెనీలను తెలివిగా సైనిక శక్తితో తన కనుసన్నల్లో పనిచేయించుకుంటోందని పేర్కొన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ప్రత్యక్ష సంబంధాలున్న హువావే, జడ్​టీఈ వంటి సంస్థలపై ఆంక్షలు విధించారు.

అస్థిరతలకు చైనా ఆజ్యం

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ వ్యవహారశైలి అగ్నికి ఆజ్యం పోసింది. అవినీతికి వ్యతిరేకంగా అసమ్మతి స్వరం వినిపించే రాజకీయ ప్రత్యర్థులను అణిచేందుకు అంతర్గత నిబంధనలను కఠినతరం చేశారు. శాంతియుతంగా ఎదగాలనే నియమాలను విస్మరించారు. తైవాన్, టిబెట్, హాంకాంగ్, షింజియాంగ్​ పట్ల బెదిరింపు వ్యూహాలను అమలు చేశారు. దక్షిణ చైనా సముద్రంలో సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేశారు. జపాన్, ఆస్ట్రేలియా, భారత్​ వంటి దేశాల పట్ల అనవరస దూకుడును ప్రదర్శిస్తున్నారు.

అమెరికాను కేవలం ప్రాంతీయ ఆర్థిక శక్తిగా చూపించే ప్రయత్నం చేసింది చైనా. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రగల్బాలు పలికింది. సాయుధ దళాలను ఆధునికీకరిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నావికాదళ స్థావరాలను అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను అప్పుల వలలో చిక్కుకునేలా చేసేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్​ఐ)ను ప్రారంభించింది. తన బలాన్ని ప్రదర్శించుకుంటూ.. అమెరికాతో వాణిజ్య చర్చల్లో మొండి వైఖరి అవలంబించింది.

చైనాను ఒంటరి చేసే వ్యూహం!

అటు అధ్యక్షుడు ట్రంప్ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికే మొగ్గుచూపారు.

"కచ్చితంగా ప్రపంచమంతటికీ చైనా ఓ పెనుముప్పు. అందరికంటే వేగంగా సైనిక శక్తిని పెంచుకుంటున్నారు. నిజానికి ఇదంతా అమెరికా డబ్బును ఉపయోగించి చేస్తున్నారు."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అంతేకాకుండా ఆసియా పసిఫిక్​ను ఇండో పసిఫిక్​గా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఆసక్తి కనబర్చారు. ఆస్ట్రేలియా, జపాన్, భారత్, అమెరికాతో కూడిన చతుర్భుజ కూటమిని 2019 సెప్టెంబర్​లో మంత్రివర్గ చర్చల స్థాయికి తీసుకొచ్చారు. దక్షిణ కొరియా, వియత్నాం, న్యూజిలాండ్​తో పాటు ఫ్రాన్స్​ను సైతం కలుపుకొని ఈ కూటమిని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా ఆసియా పసిఫిక్​లో చైనాను ఒంటరి చేయడానికే.

జీ7లో సమూల మార్పులు

మరోవైపు జీ7 దేశాల కూటమిలోని సభ్యదేశాల సంఖ్యను పెంచాలని ప్రతిపాదించారు ట్రంప్. ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, భారత్​ను చేర్చుకొని జీ11గా మార్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో చైనాను విస్మరించారు. విస్తరించిన కూటమి సమావేశానికి సెప్టెంబర్​లో లేదా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆతిథ్యమిస్తామని ప్రకటించారు ట్రంప్.

నిజానికి జీ7 అనేది ధనిక దేశాల కూటమి. భారత్ వంటి దేశాలను అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి దేశాలను కూటమిలో శాశ్వతంగా చేర్చుకోవాలని భావిస్తే జీ7 ఛార్టర్​ను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. విస్తరణ అనేది ఒక ఒప్పందం మాత్రమే. జీ7 దేశాలలో ఏకాభిప్రాయం లేకపోయినా.. విస్తృతమైన ఒప్పందం ఉండాలి. ఆయా దేశాలు ప్రస్తుతమున్న నిర్మాణాన్నే కొనసాగించాలని కోరుకోవచ్చు. లేదా అమెరికా కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో స్నేహభావాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఆశించవచ్చు.

డెమొక్రటిక్-10

జీ7ను జీ11 లేదా జీ12గా మార్చడం వల్ల జీ20 కూటమి ఆవశ్యకతపై ప్రశ్నలు తలెత్తుతాయి. మరోవైపు ఇంగ్లాండ్ డీ10(డెమొక్రటిక్-10) దేశాల కూటమిని ప్రతిపాదిస్తోంది. జీ7 దేశాలతో పాటు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాను కలుపుకోవాలని చూస్తోంది.

భారత్ సానుకూలం- చైనా ప్రతికూలం

ఇలాంటి ఆలోచనలకు భారత్ స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి విజయవంతంగా నిర్వహించడానికి భారత్ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. "ఏ సంస్థ అయినా, అది ఎంత ముఖ్యమైనదైనా, దాన్ని ప్రారంభించే సమయంలో స్తంభింపజేయడం కుదరదు. బహుపాక్షిక విధానాలలో సంస్కరణలకు మేం ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నాం" అని అన్నారు భారత విదేశాంగ మంత్రి డా. జయ్​శంకర్.

కాగా.. ఈ నిర్ణయంపై చైనా యథావిధిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ7 కూటమి.. జీ11 లేదా జీ12గా మారినా పెద్ద ప్రభావవంతంగా ఉండదని ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

చైనా దుస్థితి

అయితే అమెరికా మాత్రం చైనా వైఖరిని అవకాశం దొరికినప్పుడల్లా ఎండగడుతూనే ఉంది. చైనా విస్తరణవాదం ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిందని అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో దుయ్యబట్టారు. చైనా కమ్యూనిస్టు పార్టీని ధూర్త శక్తిగా అభివర్ణించారు. ఆసియాలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవడానికి అమెరికా బలగాలు సరైన ప్రాంతంలోనే ఉన్నాయో లేదో సమీక్షించుకుంటామని తెలిపారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో చైనా స్థితి అగమ్యగోచరంగా తయారైంది. చైనా అధ్యక్షుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారికి రెండు మార్గాలు. దూకుడును తగ్గించి దేశంలో ఎదురుదెబ్బలు తగిలించుకోవడం లేదా ఇదే వైఖరి కొనసాగించి ప్రపంచానికి మరింత వ్యతిరేకంగా మారడం.

ఏ వైఖరి పాటించినా భారత్​ను దూరం చేయడానికే ప్రయత్నిస్తుంది చైనా. పాశ్చాత్త శక్తులతో ఏకమయ్యేలా బలవంతం చేస్తుంది. అదే సమయంలో ప్రపంచం అస్థిరతలో ఉంది. పరిస్థితులు ఏ విధంగా చక్కబడతాయనే విషయం అర్థం కావడం లేదు. అందువల్ల భవిష్యత్తు గురించి ఆలోచించి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి.

(రచయిత-విష్ణు ప్రకాష్, ఒట్టావా, సియోల్​లకు మాజీ రాయబారి, షాంఘైకి మాజీ కాన్సుల్ జనరల్)

ఇదీ చదవండి: యాప్స్​ నిషేధంపై చైనా స్పందన.. ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.