ETV Bharat / opinion

భూ హక్కులకు కొత్త చట్టాల దన్ను

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లి.. అక్కడే ఏదో ఒక ఉపాధి వెతుక్కుంటున్నారు. తమకు ఉన్న భూమిలో వ్యవసాయానికే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో భూమికోసం కొట్లాటలు పెరిగాయి. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' పేరుతో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా భూమి, కార్మిక చట్టాల్లో సంస్కరణలకు పెద్దపీట వేస్తామని ప్రకటించింది. స్వమిత్వా పేరుతో దేశవ్యాప్తంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలూ మార్పులకు తెరతీశాయి. భూ హక్కులకు ఈ కొత్త చట్టాలు దన్నుగా నిలవనున్నాయి.

new laws for land rights
భూ హక్కులకు కొత్త చట్టాల దన్ను
author img

By

Published : Oct 28, 2020, 6:40 AM IST

కరోనా కలిగించిన కష్టాలతో కొన్ని నెలలుగా ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఈ కొత్త జబ్బు మనుషుల ఆరోగ్యంపైనే కాదు ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. కోట్ల మంది ఈ వ్యాధిబారిన పడ్డారు. లక్షల మరణాలు సంభవించాయి. కుటుంబాలు, దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఎందరో తమ జీవనోపాధులను కోల్పోయారు. కొవిడ్‌ ప్రభావం ఇప్పటికే ఎన్నో చిక్కుల్లో ఉన్న భూహక్కులపైనా పడింది. కొవిడ్‌ వ్యాధి, దీని నివారణకు ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ లాంటి నిర్ణయాలు, ఆర్థిక పునరుత్తేజానికి తీసుకుంటున్న చర్యలవల్ల ప్రజల భూ హక్కులపై ప్రభావం పడుతోంది. పేదలు, మహిళలు, గిరిజనులు, చిన్న సన్నకారు రైతులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. భూమి కోసం కొట్లాటలు పెరిగాయి. భూపరిపాలన, వివాద పరిష్కార వ్యవస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.

పెరుగుతున్న ఒత్తిడి

బతుకు తెరువు కోసం పట్టణాలకు వచ్చినవారు లాక్‌డౌన్‌ సమయంలో పల్లెబాట పట్టారు. వీరిలో ఎక్కువమంది తమ సొంతగ్రామాల్లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. తమకు ఉన్న కొద్దోగొప్పో భూమిలో వ్యవసాయం చేసుకోవడమో, కొంత భూమి కౌలుకు తీసుకోడమో- వ్యవసాయ లేదా ఉపాధి హామీ కూలికి వెళ్లడమో చేస్తున్నారు. భూమి కౌలుకో, కొనుగోలుకో ప్రయత్నించే వారి సంఖ్య పెరిగింది. దీనివల్ల భూ వివాదాలూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌వల్ల రెవిన్యూ కోర్టులు, సివిల్‌ కోర్టులు పూర్తిగా లేదా పాక్షికంగా మూసి ఉండటంవల్ల పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారంలో విపరీతంగా జాప్యం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెవిన్యూ కోర్టుల్లో దాదాపు డెబ్బై వేల కేసులు ఉన్నాయి. ఇక అయిదు అంచెల సివిల్‌ కోర్టుల్లో ఉన్న వేలాది కేసులు వీటికి అదనం. కొనుగోలు, వారసత్వం, భాగ పంపకాలు, వీలునామా, దానం, కోర్టు డిక్రీ లేదా మరో మార్గంలో భూమి వస్తే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియకు చాలా సమయం పడుతోంది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో రెవిన్యూ యంత్రాంగం భూపరిపాలనకు, భూవివాదాల పరిష్కారానికి సమయం ఇవ్వలేకపోతోంది. కొవిడ్‌ కారణంగా భూ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని భుహక్కులపై పనిచేస్తున్న సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. గడచిన కొన్ని దశాబ్దాలుగా పేదల భూహక్కుల కోసం జరిగిన కృషి ఫలితాలు- కరోనా వల్ల కనుమరుగు అవుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూ ఆక్రమణలు, బలవంతపు తొలగింపులవల్ల పేదలు భూములు కోల్పోతున్న దృష్టాంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. కొవిడ్‌ తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని ఆదుకోవడం కోసం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా భూమి, కార్మిక చట్టాల్లో సంస్కరణలకు పెద్దపీట వేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా కేంద్రం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలూ మార్పులకు తెరతీశాయి.

మారుతున్న నియమాలు

దేశంలోని 6.62 లక్షల గ్రామాలను సర్వేచేసి ప్రతి ఇంటి స్థలానికి ఆస్తి కార్డు ఇవ్వడం లక్ష్యంగా కేంద్రం కొత్త పథకానికి అంకురార్పణ చేసింది. ‘సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌ (స్వమిత్వా)’ పేరుతో రాబోయే నాలుగు సంవత్సరాల్లో దేశంలోని అన్ని గ్రామాలను సర్వే చేయనుంది. పట్టాలను రూపొందించి, ప్రతి ఇంటికి/ ఇంటి స్థలానికి ఆస్తి కార్డు ఇవ్వాలనేది లక్ష్యం. రాబోయే సంవత్సర కాలంలో 79.65 కోట్ల రూపాయల వ్యయంతో డ్రోన్‌లను వినియోగించి ఆరు రాష్ట్రాల్లోని దాదాపు లక్ష గ్రామాలను సర్వే చేయబోతున్నారు. మిగతా గ్రామాల్లో సర్వే 2024 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. వ్యవసాయ భూముల రికార్డులనూ ఆధునికీకరించి మరో నాలుగేళ్లలో భూమి హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే వ్యవస్థ తేవాలని కేంద్రం ప్రయత్నాలను వేగవంతం చేసింది. భూ యజమానికి, కౌలుదారుకు మేలు చేసేలా కొత్త చట్టాలు చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇప్పుడు అమలులో ఉన్న కౌలు చట్టాలను రద్దుచేసి- నీతి ఆయోగ్‌ రూపొందించిన ముసాయిదా కౌలు చట్టాన్ని అనుసరించి అన్ని రాష్ట్రాలు చట్టం చేసుకోవాలని కేంద్రం కోరింది.

కరోనా సంక్షోభం కొన్ని మంచి పరిణామాలకూ కారణమైంది. పాలన, ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో గుణాత్మక మార్పులకు దోహదం చేసింది. భూ హక్కులు, చట్టాలు, పరిపాలనలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ ఫలితాలు అందరికీ దక్కేలా తగిన చర్యలు తీసుకోవాలి. భూములు సర్వే చెయ్యడం, వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు ఆస్తి కార్డులు/ హక్కు పత్రాలు ఇవ్వడం, వాటికి ప్రభుత్వమే పూర్తి హామీ ఇచ్చే చట్టాలు చెయ్యడం ఆహ్వానించదగ్గ పరిణామం. భూ వివాదాల పరిష్కరాలకూ సత్వర చర్యలు తీసుకోవాలి. జిల్లా, రాష్ట్ర స్థాయి భూమి ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తే మేలు. పేదలు, మహిళలు, గిరిజనుల భూహక్కుల రక్షణకు, వారి భూ సమస్యల పరిష్కారానికి న్యాయ సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కరోనా పేదల ఆరోగ్యంతోపాటు భూములనూ కబళించకుండా ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలి.

ముమ్మరంగా సరళీకరణ చర్యలు

కర్ణాటక రాష్ట్రం వ్యవసాయ భూములను రైతులు కాని వారు కొనకూడదంటూ చట్టంలో ఉన్న నియమాన్ని తొలగించింది. కొవిడ్‌ వల్ల కలిగిన ఆర్థిక నష్టం నుంచి బయట పడాలంటే పెట్టుబడులను పెంచే ఇలాంటి చర్యలు అవసరమని ఆ రాష్ట్రం పేర్కొంది. తెలంగాణాలో ఇటీవల తెచ్చిన కొత్త చట్టమూ సరళీకరణలో ఒక భాగమే. ఏక గవాక్ష విధానం ద్వారా ఒకే రోజు వ్యవధిలో ఒకే చోట భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్‌ విలువలనూ హేతుబద్ధంగా సవరించి సర్వే నంబర్‌వారీగా ధరణి వెబ్‌సైట్‌లో ఉంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భూముల సర్వే ప్రారంభించింది. టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ భూ చట్టాల్లో మార్పులు వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం అన్ని భూ చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించే ప్రయత్నంలో ఉంది.

- ఎం.సునీల్​ కుమార్​ ( రచయిత, భూచట్టాల నిపుణులు, నల్సార్​ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.