ETV Bharat / opinion

ఉపాధిపై కరోనా మహమ్మారి వేటు - కరోనాతో నిరుద్యోగ సంక్షోభం

కరోనాతో ​దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరగడమేగాక అనేకమంది జీవనోపాధి కోల్పోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. మహమ్మారి రెండో దశ విజృంభణతో ఆర్థిక కార్యకలాపాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఫలితంగా ఉత్పాదకత, సేవారంగాలు తీవ్రంగా ప్రభావితమై.. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

unemployment
ఉపాధిపై మహమ్మారి వేటు
author img

By

Published : May 5, 2021, 8:24 AM IST

కరోనా సంక్షోభంలో అనేక సంస్థలు ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించడం, వేతనాల్లో కోత విధించడంవంటి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు- ఈ పరిస్థితి ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కొన్ని నిత్యావసర సరకులను అందజేస్తున్నప్పటికీ, అవి అందరికీ సరిపోవడంలేదు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు వంటి అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని నెలలుగా మెల్లగా కోలుకుంటున్న ఉపాధిరంగంపై- కొవిడ్‌ రెండో దశ వ్యాప్తితో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠినతరమైన కొవిడ్‌ నిబంధనలు, పాక్షిక లాక్‌డౌన్‌లతో నిరుద్యోగం కనీసం పదిశాతం మేర పెరిగినట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

నైపుణ్య శిక్షణ అవసరం

అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది ప్రజల ఆర్థిక పరిస్థితిలో గత ఏడాది కాలంగా పురోగతి లేకపోగా, తిరోగమనం కనిపిస్తోంది. కేంద్ర కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి తొమ్మిదో తేదీ వరకు ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా సుమారు 16.5 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందారు. పీఎంజీకేవై కింద 38.82 లక్షల మంది ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో రూ.2,567.66 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సైతం కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పథకం ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్దయెత్తున చేపడితే నిరుద్యోగ సమస్యను కొంతవరకు ఎదుర్కోవచ్చు. 'సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ' అంచనాల ప్రకారం భారత్‌లో 4.40 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో 2.80 కోట్ల మంది ఉపాధి కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతావారు ఉపాధిని కోరుకుంటున్నా దానికోసం తీవ్రంగా ప్రయత్నించడంలేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగుల్లో 3.80 కోట్లమంది యువకులే. పట్టణాలనుంచి గ్రామాలకు వెళ్లే శ్రామికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో నిరుద్యోగ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదమూ ఉంది.

ఈ సంక్షోభ సమయంలో నిరుద్యోగులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. నిరుద్యోగ సమస్య పెరిగేకొద్దీ దేశంలో నేరాలూ పెచ్చరిల్లడం సహజం. ఉపాధి కల్పనపై దృష్టి సారించడం ద్వారా శాంతిభద్రతల సమస్యలనూ గణనీయంగా తగ్గించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో అన్ని రకాల ఉద్యోగాల ఖాళీలనూ వేగంగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వాలి. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలి. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శిక్షణను కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి స్వయం ఉపాధికోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. స్థానిక సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించి, స్వయం ఉపాధిని పెంపొందించే పనులకు పెద్ద పీట వేయాలి. నూతన ఆవిష్కరణలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పట్టణ, గ్రామీణ మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.

ఉపాధి కల్పన పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు సైతం ఆశించినదానికన్నా మెరుగ్గా ఉంటుంది. వలస కార్మికులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాల్ని స్థానిక ప్రభుత్వాలు విధిగా నమోదు చేసి, ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచాలి. దీనివల్ల శ్రామికులకు అవసరమైన సహాయాన్నినేరుగా అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందరికీ అందేలా చూడాలి.

సరఫరా పెంచాలి

గత సంవత్సరం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి- జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లుగానే.. ఇప్పుడూ ఆర్థిక సహాయాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి పెద్దయెత్తున ఆర్థిక వనరులను కూడగట్టాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయడమే పరమావధి కావాలి. ప్రభుత్వ ఖర్చు పెరగడం వల్ల లోటు పెరిగిపోయినప్పటికీ, నేటి పరిస్థితుల దృష్ట్యా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకే ప్రభుత్వం ఉపాధి కల్పన కార్యక్రమాలకు పెద్దయెత్తున శ్రీకారం చుట్టాలి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు తీవ్రంగా కొరత ఉన్నందువల్ల- టీకాల సరఫరాను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగం, కొన్ని ప్రైవేటు కంపెనీలు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు, ప్రజల్లో ధైర్యాన్ని పాదుగొల్పేందుకు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగినప్పుడే ప్రజలు భవిష్యత్తుపై భరోసాతో ఉంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికీ ఆస్కారం ఉంది.

- డాక్టర్‌ చిట్టెడి కృష్ణారెడ్డి
(హెచ్‌సీయూలో అర్థశాస్త్ర సహాయ ఆచార్యులు)

ఇవీ చదవండి: దేశాభివృద్ధికి చోదకశక్తి యువతరం- భవితకు దారిదీపం!

'కరోనాతో మహిళల ఆదాయంపై ప్రతికూల ప్రభావం'

'ఏప్రిల్​లో 75 లక్షల ఉద్యోగాలు ఉఫ్​'

'నిరుద్యోగం గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.