ETV Bharat / opinion

Submarine: భారత జలాల్లోకి కొత్త 'సొరలు'

భారత నౌకాదళంలో జలాంతర్గాముల (Submarine) తయారీకి రంగం సిద్ధం అయింది. 'ప్రాజెక్ట్‌ 75 ఇండియా'కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఆరు డీజిల్‌ విద్యుత్తు జలాంతర్గాములను (Submarine) విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించనున్నారు.

indian navy
భారత నావీ
author img

By

Published : Jun 9, 2021, 6:58 AM IST

Updated : Jun 9, 2021, 9:20 AM IST

భారత నౌకాదళంలోని అణుశక్తి జలాంతర్గామి(Submarine) ఐఎన్‌ఎస్‌ చక్ర-2 లీజు గడువు ఈ ఏడాదితో ముగియనుంది. దానితో అది ఇండియాకు వీడ్కోలు పలికి రష్యాకు తిరుగుముఖం పట్టింది. ఆ చిత్రాలు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కొన్ని గంటల్లోనే భారత నౌకా దళానికి ఒక తీపి కబురు అందింది. రెండు దశాబ్దాల కిందటే భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఎస్‌) అనుమతులు లభించిన 'ప్రాజెక్ట్‌ 75 ఇండియా'కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దీనికింద ఆరు డీజిల్‌ విద్యుత్తు జలాంతర్గాములను(Submarine) విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించనున్నారు. ఇవి 'ప్రాజెక్టు 75' కింద నిర్మిస్తున్న స్కార్పియన్‌ శ్రేణి జలాంతర్గాముల కంటే 50 శాతం పెద్దవిగా ఉండనున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం మాజేగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌, ఎల్‌అండ్‌టీతో పాటు 'వ్యూహాత్మక భాగస్వామి' గా మరో విదేశీ సంస్థ సైతం జత కలవనుంది. అయిదు దేశాల సంస్థలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నా- నేవల్‌ గ్రూప్‌ (ఫ్రాన్స్‌), రూబిన్‌ డిజైన్‌ బ్యూరో (రష్యా), టీకేఎంఎస్‌ (జర్మనీ)ల్లో ఒక దానికి కాంట్రాక్టు దక్కవచ్చు. ఈ భారీ ప్రాజెక్టుతో దేశీయంగా జలాంతర్గాముల నిర్మాణానికి అవసరమైన విడిభాగాల తయారీ పరిశ్రమలు పుట్టుకొస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

పదిహేనేళ్లలో రెండే..

భారత్‌ విమాన వాహక నౌకల సంఖ్యను పెంచుకోవాలనే వాదనలు ఉన్నా- ప్రభుత్వం తొలుత జలాంతర్గాములను(Submarine) సమకూర్చుకోవడానికే మొగ్గు చూపింది. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయుధాలను వీలైనంత రహస్యంగా ఉంచడం కీలకం. 'సముద్ర ఉపరితలంపై ఉండే వాటిని శత్రువులు ఉపగ్రహాలతో గుర్తించి క్షిపణులతో ధ్వంసం చేస్తారు. నౌకాదళానికి విమాన వాహక నౌకల కంటే జలాంతర్గాములే అవసరం అనుకుంటున్నా'నని సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ నిరుడు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి విమాన వాహక నౌకలు అత్యంత ఖరీదైనవి. వీటి వెంట సహాయక నౌకల బృందమూ కదలాల్సిందే. వీటిలో పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, రాడార్లు, క్షిపణులు ఉంటాయి. శత్రువులు వీటిపై దాడి చేస్తే వేల కోట్ల రూపాయల నష్టంతో పాటు దేశ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. డీఎఫ్‌21ఏ వంటి నౌకా విధ్వంసక బాలిస్టిక్‌ క్షిపణులను చైనా భారీగా సమకూర్చుకొంది. వీటితో భారత నౌకలకు ముప్పు పొంచి ఉంది.

మరోవైపు, విశాల సంద్రంలో నీటి అడుగున నిశ్శబ్దంగా ప్రయాణించే జలాంతర్గాములను గుర్తించడం చాలా కష్టం. ఆధునిక పరిజ్ఞానం ఉన్న అమెరికా సైతం వీటి జాడను పసిగట్టడంలో కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది. 2005లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో స్వీడిష్‌ డీజిల్‌ జలాంతర్గామి గాట్‌లాండ్‌ పలుమార్లు అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్‌ రీగన్‌పై గురిపెట్టగలిగింది!

గ్లోబల్‌ ఫైర్‌పవర్‌ సూచీ ప్రకారం చైనా దగ్గర దాదాపు 79 వరకు జలాంతర్గాములు ఉన్నాయి. 1990ల్లో భారత్‌ దగ్గర అత్యధికంగా 20 వరకు ఉండేవి. క్రమేణా వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా చక్ర-2 పోను ప్రస్తుతం 16 మాత్రమే మిగిలాయి. పదిహేనేళ్లలో భారత్‌ కేవలం రెండు జలాంతర్గాములను మాత్రమే సమకూర్చుకోగలిగందని నౌకాదళం- రెండేళ్ల క్రితం రక్షణ శాఖ స్థాయీసంఘం ముందు వెల్లడించింది. ఆ సంఘం సైతం ఇండియాకు 18 డీజిల్‌ ఎలక్ట్రిక్‌, ఆరు అణుశక్తి జలాంతర్గాములు అవసరమని నొక్కి చెప్పింది. 2030 నాటికి చైనా 80 జలాంతర్గాములను సమకూర్చుకోబోతోంది. అప్పటికి భారత్‌ దగ్గర 21 వరకు ఉండవచ్చు. ఇప్పటికే అరిహంత్‌ శ్రేణిలో తయారైన అరిఘాత్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఇది భారత్‌ అమ్ములపొదిలో చేరే అవకాశాలున్నాయి. ఇక చక్ర-2 స్థానంలోకి 2025లో రష్యా నుంచి చక్ర-3 వచ్చి చేరనుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై 2019లోనే సంతకాలు జరిగాయి.

నీటి అడుగున...

తాజాగా 'ప్రాజెక్టు 75 ఐ' లో నిర్మించనున్న ఆరు జలాంతర్గాముల్లో(Submarine) డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఏఐపీ(ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపెల్షన్‌) వ్యవస్థను అమర్చనున్నారు. సాధారణంగా డీజిల్‌ ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములు రెండు వారాలకు ఒకసారి సముద్ర ఉపరితలంపైకి వచ్చి గాలిని గ్రహించి డీజిల్‌ను మండించి విద్యుత్తును తయారు చేసుకుని, నిల్వ చేసుకుంటాయి. ఈ అవసరాన్ని ఏఐపీ తగ్గించేస్తుంది. నిశ్శబ్దంగా రసాయనిక చర్యతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. జలాంతర్గాముల్లో ధ్వని (ఎకోస్టిక్‌ సిగ్నేచర్‌)ని సృష్టించకుండా, వీలైనంత వరకు వాటిని రహస్యంగా ఉంచేందుకు ఇది ఉపకరిస్తుంది. దీనితో జలంతర్గాములు అదనంగా మూడు వారాల పాటు నీటి అడుగున ఉండిపోవచ్చు.

అంతేకాదు, బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రయోగించేలా సైతం వీటిని నిర్మించే అవకాశం ఉంది. మరోవైపు, డ్రాగన్‌ జలాంతర్గాములు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో నక్కి అణుదాడి చేసే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. చైనాతో పోలిస్తే భారత్‌ సామర్థ్యం చాలా తక్కువని 'లోయి ఇన్‌స్టిట్యూట్‌' లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరు అణుశక్తి జలాంతర్గాముల తయారీకి ఉద్దేశించిన 'ప్రాజెక్టు 75 ఆల్ఫా'ను సైతం భారత్‌ వేగంగా పట్టాలెక్కించాలి!

- పెద్దింటి ఫణికిరణ్‌

Last Updated : Jun 9, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.