ETV Bharat / opinion

చైనా దూకుడుకు 'క్వాడ్‌' పగ్గాలు - is quad useful?

చైనా దుందుడుకు చర్యలను కట్టడి చేయడంలో 'క్వాడ్'​ కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'క్వాడ్‌' సంకల్పం- చైనా ఒంటెత్తు ధోరణులకు 'చెక్‌' పెట్టేందుకు ఉద్దేశించిందేనని పేర్కొంటున్నారు . డ్రాగన్‌ను హద్దుల్లో ఉంచి ప్రపంచానికి మంచి చేసే ప్రజాస్వామ్య కూటమిగా 'క్వాడ్‌'కు భారత్‌ బలీయమైన దన్ను కావాలని ఆకాంక్షిస్తున్నారు. ​

quad
చైనా దూకుడుకు 'క్వాడ్‌' పగ్గాలు
author img

By

Published : Mar 16, 2021, 7:48 AM IST

పదహారేళ్ల క్రితం విలయలయలతో పెను సునామీ విరుచుకుపడిన వేళ- మానవీయ సాయమే లక్ష్యంగా మొలకెత్తిన ఆలోచన అది. ఇండియా అమెరికా జపాన్‌ ఆస్ట్రేలియాలు చతురస్రంగా రూపొందాలన్న 2007నాటి ప్రతిపాదన కాగితాల్లోనే కొడిగట్టిపోవడానికి ఆనాడు చైనాయే పుణ్యం కట్టుకొంది. అదే నేడు - ప్రపంచ దేశాల్ని కలవరపరుస్తున్న కొవిడ్‌తోపాటు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆభిజాత్య వైరస్‌ కొత్త కుంపట్లు రాజేస్తున్న తరుణంలో నాలుగు సమున్నత ప్రజాతంత్ర దేశాల కూటమిగా 'క్వాడ్‌' పురుడు పోసుకొంది.

2017నుంచి భిన్నస్థాయుల్లో జరిగిన విస్తృత సంప్రతింపుల ఫలశ్రుతి ఇది! ఎక్కడా చైనా పేరు ప్రస్తావించకుండానే నాలుగు దేశాల అధినేతలూ వెలువరించిన సంయుక్త ప్రకటన- 'క్వాడ్‌' మౌలిక అజెండాను స్పష్టం చేసింది. వసుధైక కుటుంబం అన్న భారతీయ తత్వచింతనకు ప్రతిరూపుగా 'క్వాడ్‌'ను స్వాగతించిన ప్రధాని మోదీ- టీకాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు వంటి అంశాల్లో తమ చొరవ ప్రపంచానికి మంచి చేస్తుందని విశ్వాసం వ్యక్తీకరించారు. టీకాల తయారీలో భాగస్వామ్యాన్ని, వ్యాక్సిన్లు, వాతావరణ మార్పులు, కీలక సాంకేతిక పరిజ్ఞానాలపై మూడు కార్యాచరణ బృందాల ఏర్పాటును 'క్వాడ్‌' సంయుక్త ప్రకటన ప్రస్తావించింది.

టీకా పంపిణీపై ప్రణాళిక

దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాల్ని 46.3 కోట్ల డోసుల దాకా ఎగుమతి/వితరణకు చైనా సిద్ధపడుతున్న దశలో ఏకంగా వంద కోట్ల డోసుల్ని ఇండో పసిఫిక్‌లోని 24 దేశాలతోపాటు తక్కిన వాటికీ అందించేందుకు 'క్వాడ్‌' ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అమెరికా పరిజ్ఞానం, అమెరికా జపాన్ల ఆర్థిక సాయం, ఆస్ట్రేలియా కల్పించే రవాణా సదుపాయాలతో వంద కోట్ల టీకాల ఉత్పత్తినీ ఇండియాయే చేపట్టనుంది. భావితరం సాంకేతికత ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగపడాలన్న 'క్వాడ్‌' సంకల్పం- చైనా ఒంటెత్తు ధోరణులకు 'చెక్‌' పెట్టేందుకు ఉద్దేశించిందే. పటుతర వాణిజ్య ఆర్థిక సైనిక శక్తిగా ఎదిగిన చైనా దాష్టీకాల్ని కాచుకొనే క్రమంలో 'క్వాడ్‌' నిశ్చయంగా మేలిమి ముందడుగే!

ఒప్పందాలను తుంగలో తొక్కి

నాలుగు దేశాల 'క్వాడ్‌'లో నాటోయేతర దేశం ఇండియా ఒక్కటే. చైనాతో సుదీర్ఘ భౌగోళిక సరిహద్దు కలిగి అంతే స్థాయి వివాదాలున్న దేశమూ ఇండియాయే. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, నాయకత్వ స్థానాన్ని ఎన్నడూ కోరరాదని నవ చైనా నిర్మాత డెంగ్‌ జియావో పింగ్‌ చెప్పిన మహితోక్తుల్ని పెడచెవిన పెట్టి, షి జిన్‌పింగ్‌ నయా సామ్రాజ్యవాద కాంక్షలతో కాలుదువ్వుతున్నప్పటినుంచే ఉద్రిక్తతలు రాజుకొన్నాయి. అధికారం చేపట్టిన కొత్తల్లోనే భారత్‌తో చెలిమికి తనదైన పంచశీల ప్రతిపాదించిన జిన్‌పింగ్‌, తన మానస పుత్రిక బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌లో ఇండియా చేరకపోయేసరికి స్వరం మార్చారు.

పాత ఒప్పందాల్ని తుంగలో తొక్కి 2017లో డోక్లామ్‌ ప్రతిష్టంభన సృష్టించిన చైనా- వుహాన్‌, మహాబలిపురాల్లో ఆత్మీయత ఒలకబోసికూడా లద్దాఖ్‌లో కయ్యానికి కాలుదువ్వింది. 22వేల కిలోమీటర్ల సరిహద్దుల్ని పద్నాలుగు దేశాలతో పంచుకొంటున్న చైనాకు వాటన్నింటితోనూ పొలిమేర పేచీలున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ తనదేనంటూ హుంకరిస్తున్న డ్రాగన్‌- మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్లలో నౌకాస్థావరాలతో ముత్యాలసరంలా ఇండియాను ఇప్పటికే చుట్టుముట్టింది.

చారిత్రకంగా దక్షిణ చైనా సముద్రంపై సర్వహక్కులూ తనవేనంటూ అక్కడ కృత్రిమ దీవుల సృష్టికి, సైనిక స్థావరాల విస్తరణకూ సమకట్టిన చైనా- అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ తీర్పునూ కాలదన్నింది. ఇలా కొరకరాని కొయ్యగా మారిన బీజింగ్‌ ఆభిజాత్య పోకడల్ని అడ్డుకోవాలంటే- ‘క్వాడ్‌’ తరహా కూటమి నేటి అవసరంగా మారడంలో వింతేముంది? 'క్వాడ్‌'ను 'ఆసియా నాటో'గా తృణీకరించి; బ్రిక్స్‌, షాంఘై సహకార సంఘాలకు ఇండియా గుదిబండగా మారిందని చైనా నోరు పారేసుకొంటోంది. డ్రాగన్‌ను హద్దుల్లో ఉంచి ప్రపంచానికి మంచి చేసే ప్రజాస్వామ్య కూటమిగా 'క్వాడ్‌'కు భారత్‌ బలీయమైన దన్ను కావాలి!

ఇదీ చదవండి : చైనా లక్ష్యంగా క్వాడ్ దేశాధినేతల వ్యాసం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.