ONDC Food Delivery App : ఓఎన్డీసీ.. కొద్దిరోజులుగా నెట్టింట బాగా వినిపిస్తున్న పేరు. కారణం.. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్‌పై స్విగ్గీ, జొమాటోను మించి రాయితీలు ఇవ్వడమే. విషయం తెలియగానే అందరూ ఓఎన్డీసీని వాడడం ప్రారంభించారు. ఇతర యాప్‌లతో పోల్చితే ఓఎన్డీసీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత డబ్బు ఆదా అయిందో చెబుతూ సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్స్ పోస్ట్ చేశారు. ఈ బంపర్ ఆఫర్స్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీతోపాటు గ్రోసరీ షాపింగ్, మొబిలిటీ(క్యాబ్, బైక్ రైడ్ బుకింగ్) సేవలు కూడా అందించే ఓఎన్డీసీని వాడడం అలవాటు చేసుకుంటున్నారు.
ONDC Full Form : ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఈ-కామర్స్‌ను సమ్మిళితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వేదిక ఇది. కేంద్ర ప్రభుత్వ విభాగమైన 'డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్-డీపీఐఐటీ' పరిధిలో లాభాపేక్ష లేని ప్రైవేటు సంస్థగా ప్రారంభమైంది ఓఎన్డీసీ. 2021లో దీనిపై కసరత్తు ప్రారంభించగా.. 2022 సెప్టెంబర్‌లో బెంగళూరులో బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఓఎన్డీసీ సేవల్ని ప్రస్తుతం దేశంలోని 236 నగరాల ప్రజలు పొందొచ్చు. ఇప్పటివరకు 36వేల విక్రయదారులు ఈ ప్లాట్‌ఫాంలో చేరారు.
ఓఎన్డీసీ ప్రత్యేకతలు ఇవే..
ONDC Features : ప్రముఖ మార్కెట్ రీసెర్చ్, బ్రోకరేజి సంస్థ 'బెర్న్‌స్టీన్ రీసెర్చ్' నివేదిక ప్రకారం భారత దేశ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇంతటి భారీ వ్యాపారంలో సత్తా చాటేందుకు పోటీ పడుతున్న దిగ్గజ సంస్థలతో పోల్చితే ఓఎన్డీసీ ఎంతో ప్రత్యేకం. ఈ విశిష్టతల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది.. ఓపెన్ నెట్వర్క్. వస్తు, సేవల బదిలీకి సంబంధించిన సమాచారం మార్పిడికి ఓపెన్ ప్రొటోకాల్స్ రూపొందించారు. దీని వల్ల కొనుగోలుదారు, విక్రయదారు మధ్య సమాచార మార్పిడి.. ఈమెయిల్ పంపినట్టుగా, యూపీఐ పేమెంట్ చేసినట్టుగా.. అత్యంత సింపుల్‌గా, పారదర్శకంగా ఉంటుందనేది నిపుణుల మాట.
ప్రస్తుతం ఈ-కామర్స్ రంగంలో ప్రతి సంస్థకు తమ సొంత యాప్ ఉంది. ఏదైనా ఉత్పత్తి అమ్మాలనుకునే వారు ఆ యాప్‌లో ముందు సెల్లర్‌గా రిజిస్టర్ కావాలి. కొనుగోలుదారులు కూడా అదే యాప్ ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారానే లావాదేవీలన్నీ సాగించాలి. ఓఎన్డీసీ ఇందుకు భిన్నం. ఇది ఒక ప్రత్యేక యాప్ ఆధారంగా పని చేయదు. ప్రభుత్వం నిర్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ పాటించే ఏ యాప్ ద్వారానైనా ఈ సేవలు పొందొచ్చు. ఈ జాబితాలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ముందుంది. పేటీఎం యాప్ ద్వారా ఓఎన్డీసీ ప్లాట్‌ఫాంను యాక్సెస్ చేసి, ఆర్డర్ చేసే వీలు కల్పించింది ఆ సంస్థ. పేటీఎం యాప్ సెర్చ్ బార్లో ఓఎన్డీసీ/ఓఎన్డీసీ ఫుడ్/ఓఎన్డీసీ గ్రోసరీ అని టైప్ చేస్తే చాలు. మీకు కావాల్సిన ఫుడ్, కిరాణా సామగ్రి ఆర్డర్ చేయొచ్చు. క్యాబ్ లేదా బైక్ రైడ్ బుక్ చేసుకోవచ్చు.
ONDC How To Use : పిన్‌కోడ్(ఫోన్‌ఫే అనుబంధ సంస్థ), మీషో, మేజిక్పిన్, మైస్టోర్ కూడా ఓఎన్డీసీ ప్లాట్‌ఫాంను తమ యాప్‌లలో చేర్చాయి. విక్రయదారుల కోసం అల్పైనో, బిట్ల్సిలా, బిజోమ్, బోట్, డెలివరీ, డిజిట్ వంటి యాప్స్ ఓఎన్డీసీ నెట్‌వర్క్‌లో భాగస్వాములు అయ్యాయి. వినియోగదారులు ఏ యాప్ ఓపెన్ చేసినా.. ఓఎన్డీసీలో రిజిస్టర్ అయిన ప్రతి విక్రయందారుడి ఉత్పత్తులు కనిపిస్తాయి. అక్కడి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేక ఆఫర్ల కోసం అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, జొమాటో గోల్డ్, స్విగ్గీ వన్ తరహాలో ప్రతి యాప్‌లోనూ అదనంగా డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పనిలేదు.
ఇద్దరికీ అలా లాభం..
ONDC How It Works : ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో స్విగ్గీ-జొమాటోదే ద్విధాధిపత్యం. హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 54% మార్కెట్ వాటా జొమాటోదే. మిగిలినది 46% స్విగ్గీది. ఇంతలా స్విగ్గీ-జొమాటో జోరు కొనసాగుతున్నా.. ఆ సంస్థలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు రెస్టారెంట్ల కమీషన్ పెంపు, కష్టమర్లపై ప్లాట్‌ఫాం ఫీజు వడ్డన వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఫలితంగా అటు రెస్టారెంట్ల యజమానులు, ఇటు వినియోగదారుల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ఇలాంటి సమయంలోనే ఇరు వర్గాలను ఆకట్టుకునే వ్యూహంతో వచ్చింది ఓఎన్డీసీ. స్విగ్గీ-జొమాటో పోల్చితే రెస్టారెంట్ల నుంచి అతి తక్కువ కమీషన్ తీసుకుంటోంది.
-
Ordering food frm @ONDC_Official at https://t.co/04zHp2UFcg is my best decision, I got all 3 i.e. low prices, discount & free delivery which is impossible to get in any other food delivery apps. Guys save your money and start ordering from #ONDC Store Now #VocalForLocal #Food pic.twitter.com/vVT9yAmPYR
— Rizwan Haider (@ItsRizwan72) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ordering food frm @ONDC_Official at https://t.co/04zHp2UFcg is my best decision, I got all 3 i.e. low prices, discount & free delivery which is impossible to get in any other food delivery apps. Guys save your money and start ordering from #ONDC Store Now #VocalForLocal #Food pic.twitter.com/vVT9yAmPYR
— Rizwan Haider (@ItsRizwan72) May 28, 2023Ordering food frm @ONDC_Official at https://t.co/04zHp2UFcg is my best decision, I got all 3 i.e. low prices, discount & free delivery which is impossible to get in any other food delivery apps. Guys save your money and start ordering from #ONDC Store Now #VocalForLocal #Food pic.twitter.com/vVT9yAmPYR
— Rizwan Haider (@ItsRizwan72) May 28, 2023
ONDC Zomato Comparison : సాధారణంగా స్విగ్గీ, జొమాటో రెస్టారెంట్ల నుంచి ప్రతి ఆర్డర్ విలువలో 18-25శాతం కమీషన్‌గా వసూలు చేస్తుంటాయి. ఓఎన్డీసీ కమీషన్ అందులో అటూఇటూగా సగం మాత్రమే. ఫలితంగా ఓఎన్డీసీ ద్వారా కాస్త తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తున్నాయి రెస్టారెంట్లు. వీటికి తోడు డెలివరీ ఛార్జీలు, ఇతర రుసుముల్లో రాయితీలతో కష్టమర్లను ఆకట్టుకుంటోంది ఓఎన్డీసీ. మొత్తంగా ఇతర యాప్స్‌లో రూ.200-215 ఖర్చు అయ్యే ఆర్డర్ ఓఎన్డీసీలో దాదాపు రూ.150కే లభిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ మే 8న ప్రచురించిన కథనం ప్రకారం.. మెక్‌డొనాల్డ్స్, పిజాహట్, కేఫ్ కాఫీ డే, టాకోబెల్, బెహ్రౌజ్ బిర్యానీ, వావ్ మోమో వంటి వాటి నుంచి స్విగ్గీ-జొమాటో ద్వారా చేసిన ఆర్డర్‌తో పోల్చితే ఓఎన్డీసీలో ధరలు రూ.30-80శాతం తక్కువ.
-
Just ordered Watch from @ONDC_Official Store on @mystoreforindia Website & my experience is wow. Beautiful watch is available at 80% discount, I got 50rs off & free shipping too, I urge everyone to shop frim ONDC Store at MyStore #ondcstore #mystore #digitalIndia #Vocalforlocal pic.twitter.com/z6vE32vlpr
— Nisha Pandey (@NishaPa07532193) May 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just ordered Watch from @ONDC_Official Store on @mystoreforindia Website & my experience is wow. Beautiful watch is available at 80% discount, I got 50rs off & free shipping too, I urge everyone to shop frim ONDC Store at MyStore #ondcstore #mystore #digitalIndia #Vocalforlocal pic.twitter.com/z6vE32vlpr
— Nisha Pandey (@NishaPa07532193) May 24, 2023Just ordered Watch from @ONDC_Official Store on @mystoreforindia Website & my experience is wow. Beautiful watch is available at 80% discount, I got 50rs off & free shipping too, I urge everyone to shop frim ONDC Store at MyStore #ondcstore #mystore #digitalIndia #Vocalforlocal pic.twitter.com/z6vE32vlpr
— Nisha Pandey (@NishaPa07532193) May 24, 2023
ONDC Last Mile Delivery : ఓఎన్డీసీ ద్వారా ఆర్డర్ చేసిన ఆహారం డంజో, షాడోఫాక్స్, లోడ్‌షేర్ ద్వారా వినియోగదారుని ఇంటికి చేరుతుంది. ఇందుకు సంబంధించిన చెల్లింపుల సంగతిని రెస్టారెంట్ యాజమాన్యమే చూసుకుంటుంది. ఫుడ్ డెలివరీ మాత్రమే కాకుండా ఇతర ఆన్లైన్ షాపింగ్(గ్రోసరీ, ఫ్యాషన్ అండ్ ఫుట్‌వేర్, హోమ్ అండ్ కిచెన్), మొబిలిటీ సేవల విషయంలోనూ ఇదే తరహాలో ఉభయతారక మంత్రంతో ముందుకుసాగుతోంది ఓఎన్డీసీ.
భారీ లక్ష్యాలతో ముందుకు..
ONDC Market Share : జనవరిలో ఓఎన్డీసీకి వచ్చిన ఆర్డర్ల సంఖ్య రోజుకు అటూఇటూగా వంద మాత్రమే. మే నాటికి ఆ సంఖ్య 10వేలకు చేరింది. మే మొదటి వారంలో సోషల్ మీడియాలో జరిగిన చర్చతో ఓఎన్డీసీ ఒక్కసారిగా పుంజుకుంది. మే 9న ఏకంగా 25వేల రిటైల్ ఆర్డర్లు సంపాదించింది. తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం రోజుకు సగటున 13వేల మంది ఓఎన్డీసీ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. బెంగళూరు, కొచిలో ఈ ప్లాట్‌ఫాం ద్వారా నిత్యం 30-40వేల క్యాబ్/బైక్ రైడ్స్ బుక్ అవుతున్నాయి. మరికొద్ది వారాల్లోనే రోజువారీ రిటైల్ ఆర్డర్ల సంఖ్య లక్షకు చేరుతుందని, ఈ ఏడాది చివరినాటికి రెండు లక్షలు అవుతుందని ఆశిస్తోంది ఓఎన్డీసీ. రానున్న రెండేళ్లలో 90 కోట్ల మంది కొనుగోలుదార్లు, కోటీ 20 లక్షల మంది విక్రయదారులు ఈ ప్లాట్‌ఫాంలో చేరేలా చూడాలని.. ప్రస్తుతం దేశంలో 4-5శాతంగా ఉన్న ఈ-కామర్స్ పెనట్రేషన్ను 25శాతానికి పెంచాలన్నది ఆ సంస్థ లక్ష్యం.
-
When every store will be digital, everything will be cheaper in India, #ONDC is doing the same, just ordered 2 @NirulasOfficial rolls from @craftsvilla's @ONDC_Official STORE, got delivery free & got discount equal to taxes. Ordered zero extra cost #Food after a long time🥳🙌… pic.twitter.com/TOY1RtJP59
— Rahul Prajapati (@RahulReply) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">When every store will be digital, everything will be cheaper in India, #ONDC is doing the same, just ordered 2 @NirulasOfficial rolls from @craftsvilla's @ONDC_Official STORE, got delivery free & got discount equal to taxes. Ordered zero extra cost #Food after a long time🥳🙌… pic.twitter.com/TOY1RtJP59
— Rahul Prajapati (@RahulReply) May 22, 2023When every store will be digital, everything will be cheaper in India, #ONDC is doing the same, just ordered 2 @NirulasOfficial rolls from @craftsvilla's @ONDC_Official STORE, got delivery free & got discount equal to taxes. Ordered zero extra cost #Food after a long time🥳🙌… pic.twitter.com/TOY1RtJP59
— Rahul Prajapati (@RahulReply) May 22, 2023
ఓఎన్డీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం లెక్కలు.. వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. అసలు లక్ష్యం డిజిటల్ ఇండియా నిర్మాణానికి ఊతమివ్వడం. దేశంలోని నలుమూలల ఉన్న చిరు వ్యాపారుల్ని ఆన్లైన్ ప్రపంచంతో అనుసంధానం చేసి, కొనుగోలుదార్లకు చేరువ చేయాలన్నది సర్కార్ ఆలోచన. ప్రస్తుతం దేశంలో వస్తు, సేవల రంగం ద్వారా కోటీ 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే వీరిలో 15వేల మంది(0.1255) మంది మాత్రమే ఈ-కామర్స్ బాట పట్టారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల చిరు వ్యాపారులు ఈ-కామర్స్‌కు ఇప్పటికీ దూరమే. వీరందరిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కచ్చితంగా ఒక్క యాప్ మాత్రమే వాడాల్సిన అవసరం లేకపోవడం, కమీషన్ తక్కువగా ఉండడం వంటివి.. చిరు వ్యాపారులు ఓఎన్డీసీలో చేరేందుకు దోహదం చేస్తాయని భావిస్తోంది. ఆన్లైన్ షాపింగ్ విషయంలో కొనుగోలుదార్లకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని చెబుతోంది.
ఓఎన్డీసీ ద్వారా చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) పథకాన్ని ఓఎన్డీసీతో అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్ నిలిచింది. ప్రతి జిల్లాలో స్థానికంగా ఉత్పత్తయ్యే వస్తువులకు జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఓఎన్డీసీని ఎంచుకుంది. ఇదే తరహాలో జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
-
I was looking for Farm Fresh Pure Herbal honey for myself & My search ends at @mystoreforindia's @ONDC_Official Store. Price at #ONDC Store are responsible & Shipping is free. Must say ONDC is one of the best online shopping store to buy anything #VocalForLocal #DigitalIndia pic.twitter.com/bOWSjp5fMv
— @$@nj@y✍️ (@Sanjay_Seth1) May 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I was looking for Farm Fresh Pure Herbal honey for myself & My search ends at @mystoreforindia's @ONDC_Official Store. Price at #ONDC Store are responsible & Shipping is free. Must say ONDC is one of the best online shopping store to buy anything #VocalForLocal #DigitalIndia pic.twitter.com/bOWSjp5fMv
— @$@nj@y✍️ (@Sanjay_Seth1) May 19, 2023I was looking for Farm Fresh Pure Herbal honey for myself & My search ends at @mystoreforindia's @ONDC_Official Store. Price at #ONDC Store are responsible & Shipping is free. Must say ONDC is one of the best online shopping store to buy anything #VocalForLocal #DigitalIndia pic.twitter.com/bOWSjp5fMv
— @$@nj@y✍️ (@Sanjay_Seth1) May 19, 2023
ONDC Growth : ఓఎన్డీసీతో భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వస్తాయనే అంచనాలతో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెకెన్సీ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు..
- 2030 నాటికి భారత దేశ డిజిటల్ వినిమయం 5 రెట్లు పెరిగి 340 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం.
- డిజిటల్ లావాదేవీలు జరిపే వినియోగదారుల సంఖ్య ప్రస్తుతం 165-190 మిలియన్లు. ఈ సంఖ్య 3-4 రెట్లు పెరిగి 450-500 మిలియన్లకు చేరొచ్చని అంచనా.
- ప్రస్తుతం ఎమ్ఎస్ఎమ్ఈల్లో 6%(5-6 మిలియన్లు) మంది మాత్రమే ఈ-కామర్స్ ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. ఓఎన్డీసీ కారణంగా 2030 నాటికి ఆ సంఖ్య 6-7 రెట్లు పెరిగి 30-40 మిలియన్లకు చేరే అవకాశం.
--జీఎస్ఎన్ చౌదరి.