ETV Bharat / opinion

కరోనా యోధులపై అంతులేని ఒత్తిడి

కరోనాపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది.. అదే వైరస్​ బారినపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. లాక్​డౌన్​ కారణంగా దేశ ప్రజలంతా ఇంటికే పరిమితమైన వేళ.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన వైద్యుల ప్రాణాలకు రక్షణ కరవైంది. ఈ మహమ్మారి.. వైద్య వృత్తిలో ఉన్నవారినే కాకుండా వారి కుటుంబాలనూ తీవ్రమైన అశాంతికి, మానసిక సంఘర్షణకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వాలి. వైరస్​ నియంత్రణకు శాశ్వత పరిష్కారమైన టీకాలను పూర్తిస్థాయిలో అందించాలి.

CORONA WARRIORS
కరోనా యోధులు, వైద్యులు
author img

By

Published : May 9, 2021, 6:59 AM IST

మొదటి వరస సైనికులైన వైద్యవర్గం నిర్విరామంగా కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తూ- అదే జబ్బు బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తమ సహచరులు పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటంతో వైద్య వర్గాల్లో తీవ్రమైన అభద్రతాభావం నెలకొంటోంది. దేశ ప్రజలందరూ లాక్‌డౌన్‌ సమయంలో నివాసాలకు పరిమితమై, బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నప్పుడు కరోనా బాధితులకు బాసటగా నిలిచిన వైద్యుల ప్రాణాలకు రక్షణ కరవైంది. 2021 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 734 మంది వైద్యులు విధి నిర్వహణలో కొవిడ్‌ కోరలకు చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు- ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రికి రాసిన లేఖలో భారత వైద్య సంఘం (ఐఎంఏ) పేర్కొంది. కరోనా బాధితుల సేవలో అంకిత భావంతో పనిచేస్తున్న వైద్యుల పట్ల ప్రభుత్వం, ప్రజలు సహృదయంతో వ్యవహరించాలని ఐఎంఏ కోరింది. వివిధ దేశాల్లో వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారు జనాభాలో కేవలం మూడు శాతం లోపే ఉంటారు. డబ్ల్యూహెచ్‌ఓకు అందిన సమాచారం మేరకు దాదాపు 14శాతం కొవిడ్‌ బాధితులు వైద్య సిబ్బందే కావడం గమనార్హం. కొవిడ్‌ మహమ్మారి వైద్య వృత్తిలో ఉన్నవారినే కాకుండా వారి కుటుంబాలనూ తీవ్రమైన అశాంతికి, మానసిక సంఘర్షణకు గురి చేస్తోంది.

నిరుపమాన సేవలు

చికిత్స సమయంలో సాంక్రామిక వ్యాధుల బారిన పడకుండా నేర్పుగా వ్యవహరిస్తూనే- రోగులకు సాంత్వన కలిగించే వైద్యనారాయణులు... కొవిడ్‌ దెబ్బకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్‌ బాధితుల సేవల్లో ఉన్న వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందిలో ప్రతి నలుగురిలో ఒకరు కుంగుబాటుకు, ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రలేమికి గురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరియడంలో వైద్యులు కీలక భూమిక పోషిస్తున్నారు. వారి సేవలను గుర్తించి గౌరవించాల్సిన అవసరాన్ని మహమ్మారి మరోసారి గుర్తు చేసిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అంటున్నారు. ప్రభుత్వాలు, ఆసుపత్రుల యాజమాన్యాలు- వైద్యుల సంక్షేమానికి పూర్తి బాధ్యత స్వీకరించాలని ఆయన స్పష్టీకరిస్తున్నారు. వైద్యులకు తగిన రక్షణ కల్పిస్తే వారు ప్రజలకు మరింత సంతోషంగా సేవలు అందించగలరని చెబుతున్నారు. ‘వైద్య సిబ్బంది ఆనందమే రోగుల పాలిట ఆరోగ్యం’ అంటూ... అదే మన అందరి నినాదం కావాలనీ ఆయన స్పష్టీకరిస్తున్నారు.

పెరిగిన పనిభారం, ఒత్తిడి

ఒక ఎంబీబీఎస్‌ వైద్యుడిని తయారు చేయాలంటే సగటున పాతిక లక్షల రూపాయల ప్రజాధనం వ్యయమవుతుంది. స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల తయారీకి ఒక కోటి నుంచి కోటీ డెభ్భై లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్వాహకుల అంచనా. ప్రస్తుతం మన దేశంలోని 139 కోట్ల జనాభాకు సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. కరోనా రెండోదశ విజృంభణలో రోగుల సంఖ్య పెచ్చు మీరుతుండటంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరిగి, ఒత్తిడి అధికం అవుతోంది. కరోనా వైరస్‌ పుట్టి ఏడాదిన్నర కావస్తున్నా, ఈనాటికీ వైద్య శాస్త్రానికి అది సరికొత్త సవాళ్లను విసురుతూనే ఉంది. అందుబాటులో ఉన్న పరిమితమైన వనరులతో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న రోగులకు నాణ్యమైన చికిత్సను అందించడం వైద్యులకు సైతం తలకు మించిన భారంగా పరిణమించింది. నాణ్యమైన పీపీఈ కిట్లు సరిపడా సంఖ్యలో అందుబాటులో లేనందువల్ల హెచ్చు సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్య సంఘం ప్రతినిధి డాక్టర్‌ హర్జిత్‌ సింగ్‌ అంటున్నారు. పనిభారం, పని చేయాల్సిన సమయం పెరగడంతో వైద్యులకు కరోనా సోకే అవకాశాలూ పెచ్చుమీరాయని ఆయన స్పష్టీకరిస్తున్నారు.

జాగ్రత్త వహించాలి

వైద్యులు, వైద్య సిబ్బంది తమ స్వీయ రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కరోనా కట్టడికి మూలాలైన వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం, ముఖ కవచ ధారణలను చిత్తశుద్ధితో పాటించాలి. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చినప్పుడు, ఇంటికి రాగానే చేతులను శుభ్రపరుచుకోవడాన్ని బాధ్యతగా నిర్వర్తించాలి. పీపీఈ కిట్లు ధరించి భౌతిక దూరాన్ని విధిగా పాటించడం వల్ల కరోనా సంక్రమణను చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. తరచూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకుంటూ, తమ ఆరోగ్య స్థితిగతులపైనా వారు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. రోగులు, వారి సహాయకులు, సందర్శకుల పట్ల ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌ఓ వంటి సంస్థల సూచనలను త్రికరణశుద్ధితో పాటించాలని నిర్దేశిస్తున్నారు.

శాశ్వత పరిష్కారమైన టీకాలివ్వాలి

వైద్యులు, వైద్య సిబ్బంది, రోగుల భద్రతకు సంబంధించి అమెరికాకు చెందిన సీడీసీ ఒక ఉమ్మడి కార్యాచరణకు రూపకల్పన చేసింది. పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, చేతి తొడుగుల వంటి ఉపకరణాలను ఆసుపత్రులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలి. టెలీ మెడిసిన్‌ను ప్రోత్సహించి, వీడియో కాల్స్‌ ద్వారా అంకిత భావంతో పనిచేసేలా వైద్యవర్గాలకు శిక్షణ ఇవ్వాలి. వైద్యుల మానసిక ఒత్తిడిని, పని భారాన్ని తగ్గించి- వారు ఉల్లాసంగా వృత్తిలో నిమగ్నమయ్యే వాతావరణాన్ని కల్పించాలి. వృత్తి పరమైన ప్రమాదాలకు గురైన వారికి బీమా సౌకర్యం కల్పించాలి. కరోనా రోగులకు వైద్య సేవలు అందించే క్రమంలో వైద్య సిబ్బంది పట్ల రోగుల బంధుమిత్రుల అనుచిత ప్రవర్తనను నియంత్రించాలి. కొవిడ్‌ నియంత్రణకు శాశ్వత పరిష్కారమైన టీకాలను వైద్య సిబ్బందికి పూర్తిస్థాయిలో అందించాలి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌, వైద్య రంగ నిపుణులు

ఇదీ చదవండి: ''వ్యాక్సినేషన్​' బడ్జెట్​ను​ వినియోగించని కేంద్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.