ETV Bharat / opinion

కాలుష్య రవాణా... ఇంకెంత కాలం? - దేశంలో కాలుష్య స్థాయి

కాలుష్య రవాణాతో భూతాపం పెరిగి, ప్రకృతి ఉత్పాతాలు ఎక్కువవుతున్నాయి. భూతాపాన్ని తగ్గించేందుకు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ చొరవ చూపిస్తూ 'యూకే హరిత పారిశ్రామిక విప్లవం' చేపట్టి.. వచ్చే పదేళ్లలో పెట్రోల్​, డీజల్​ కార్ల విక్రయాలను నిషేధించనున్నారు. కాలుష్యరహిత వాహనాల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధుల్నీ కేటాయించారు. వాతావరణ మార్పులపై పోరాటంలో స్వచ్ఛ ఇంధనం ఓ శక్తిమంతమైన సాధనమని ప్రధాని మోదీ రెండేళ్లనాడే ఎలుగెత్తినా, వాహన రంగంలో విద్యుత్‌ వేగం లోపించింది. జాతీయస్థాయిలో సమగ్ర కార్యాచరణ వ్యూహానికి కేంద్రం సమకట్టినప్పుడే కాలుష్య భూతాన్ని భారత్​ కట్టడి చేయగలుగుతుంది.

INDIA POLLUTION
కాలుష్య రవాణా... ఇంకానా?
author img

By

Published : Nov 21, 2020, 9:50 AM IST

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి పాదు చేసిన పారిశ్రామిక విప్లవం కాలుష్య భూతానికి కోరలు తొడిగి పర్యావరణాన్ని పాడు చేసి భూతాపం పెరుగుదలకు, ప్రకృతి ఉత్పాతాలకు మూలకారణమైందన్నది నిజం. 'మనకున్నది ఒకటే భూమి' అంటూ భూతాపం కట్టడి ద్వారా మానవాళి పరిరక్షణకు ప్యారిస్‌ ఒడంబడిక ప్రతిన బూనినా సమష్టిగా సమర్థ కార్యాచరణ మరీచికను తలపిస్తున్న నేపథ్యంలో- బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా చొరవ సంస్తుతిపాత్రం! 'యూకే హరిత పారిశ్రామిక విప్లవం' పేరిట విస్తృత కార్యాచరణను ప్రతిపాదించిన ప్రధాని జాన్సన్‌ దాదాపు లక్షా 20 వేల కోట్ల రూపాయల హరిత ప్రణాళికలో భాగంగా 2030 నాటికి పెట్రోలు, డీజిల్‌ కార్ల విక్రయాలపై నిషేధం విధించనున్నారు. కాలుష్యరహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 58.2కోట్ల పౌండ్లతో నిధిని, విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ పాయింట్లను విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు 130 కోట్ల పౌండ్ల నిధుల్ని ప్రత్యేకించారు.

ఉమ్మడి కార్యాచరణేదీ.?

పెట్రోలు, డీజిల్‌ కార్ల ఉత్పత్తిదారులూ విక్రేతల ఆమోదంతోనే వాటి నిషేధానికి సంకల్పించిన ప్రభుత్వం- వచ్చే నాలుగేళ్లలో విద్యుత్‌ వాహన బ్యాటరీల అభివృద్ధి ఉత్పాదనలకూ వనరులు కేటాయించింది. పవన, అణు, హైడ్రోజన్ల నుంచి విద్యుదుత్పత్తికి, విద్యుత్‌ వాహనాలతో రవాణారంగ పరిపుష్టికి; విమానాలు, నౌకలు సైతం కాలుష్యం వెదజల్లని సాంకేతికత అభివృద్ధికి, 2030 నాటికి వాతావరణం నుంచి హానికర బొగ్గుపులుసు వాయువు కోటి టన్నుల్ని సంగ్రహించి భద్రపరచే పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రేట్‌ బ్రిటన్‌ సమాయత్తమవుతోంది. అయిదేళ్ల క్రితం దాకా డీజిల్‌ కార్ల హవా నడిచిన ఐరోపా విపణిలో గత నెలలో అమ్ముడైన ప్రతి నాలుగు కార్లలో ఒకటి హైబ్రిడ్‌ లేదా విద్యుత్‌ వాహనం కావడం విశేషం. ఆ గాలిమార్పును ప్రభావాన్వితం చేసేలా ఉమ్మడి కార్యాచరణ నేటి అవసరం.

ఇండియాలో..

వాతావరణ మార్పులపై పోరాటంలో స్వచ్ఛ ఇంధనం ఓ శక్తిమంతమైన సాధనమని ప్రధాని మోదీ రెండేళ్లనాడే ఎలుగెత్తినా, వాహన రంగంలో విద్యుత్‌ వేగం కనపడటమే లేదు. 2030 నాటికి ఇండియాలో విద్యుత్‌ ఆధారిత ద్విచక్ర వాహనాలు 25-35శాతానికి, త్రిచక్ర వాహనాలు 65-75శాతానికి చేరనున్నాయన్న కేపీఎంజీ-సీఐఐ అధ్యయనం, 10-12శాతానికే విద్యుత్‌ బస్సులు పరిమితమవుతాయని ఇటీవల నివేదించింది. జనబాహుళ్యం విద్యుత్‌ వాహనాలవైపు మొగ్గేలా సానుకూల వాతావరణ పరికల్పనకు కేంద్రం రాష్ట్రాలు సమన్వయంతో పని చెయ్యాలన్న సూచన ఎంతో విలువైనది. మరో పదేళ్లలో వ్యక్తిగత కార్లలో 30శాతం, వాణిజ్య వాహనాల్లో 70శాతం, బస్సులు 40శాతం, ద్వి-త్రిచక్రవాహనాలు 80శాతం దాకా విద్యుత్‌ ఆధారితమైతేనే దేశీయ రవాణారంగం కాలపరీక్షకు నిలవగలుగుతుంది. ఇండియాలాంటి వర్ధమాన దేశాలు విద్యుత్‌ వాహనాల వైపు మళ్ళితే ఏటా 25 వేల కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆదా చేసుకోగలవని అధ్యయనాలు చాటుతున్నాయి.

ప్రత్యామ్నాయాల కోసం..

విద్యుత్‌ బ్యాటరీల్లో అత్యంత కీలకమైన లిథియం, కోబాల్ట్‌ వంటివి కొద్ది దేశాలకే పరిమితం కాగా- కాంగో, బొలీవియా, చిలీ, ఆస్ట్రేలియాల్లోని గనుల్ని కొనేసిన చైనా.. ఇప్పటికే ఆ విపణిలో 60శాతం వాటా దక్కించుకొంది. ఈ నేపథ్యంలో లిథియం ఇయాన్‌ బ్యాటరీలకు మేలైన ప్రత్యామ్నాయాలకోసం సాగుతున్న పరిశోధనలకు ఇండియా సైతం ఊతంగా నిలవాలి. విద్యుత్‌ వాహన అంకురాల్లో పరిశోధనలకు తోడ్పాటునందించడంతో పాటు, అమెరికా జపాన్‌ ఆస్ట్రేలియాలతో 'క్వాడ్‌'గా జట్టుకట్టిన ఇండియా- శుద్ధ ఇంధన సాంకేతికతపై ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కలిసి నడవాలి. తెలంగాణ, ఏపీ, దిల్లీ సహా పది రాష్ట్రాలు విద్యుత్‌ వాహన విధానాలతో ముందుకొచ్చిన దరిమిలా- జాతీయస్థాయిలో సమగ్ర కార్యాచరణ వ్యూహానికి కేంద్రం సమకట్టినప్పుడే కాలుష్య భూతాన్ని ఇండియా కట్టడి చేయగలిగేది!

ఇదీ చదవండి: మళ్లీ కోరలు సాచిన కాలుష్య భూతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.