ETV Bharat / opinion

మహమ్మారి నేర్పిన సైకిల్‌ సవారీ

సైకిల్..​ ఈ పేరు చెప్పగానే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. కాలక్రమేణా బైకులు వీటి స్థానాన్ని భర్తీ చేశాయి. అయితే కరోనా కారణంగా ప్రజారవాణా నిలిచిపోవడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించాల్సి రావడం వల్ల ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సైకిళ్లనే ఆశ్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సైకిళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగిపోయింది. లాక్‌డౌన్‌ వేళ చిన్న, పెద్ద, పల్లె, పట్నం అన్న తేడాలేకుండా అనేకమంది సైకిల్‌నే ఎంచుకుంటున్నారు.

Cycling During Coronavirus | Riding During Coronavirus
మహమ్మారి నేర్పిన సైకిల్‌ సవారీ
author img

By

Published : Aug 17, 2020, 8:15 AM IST

Updated : Aug 17, 2020, 11:37 AM IST

ఒకప్పుడు పేద, సామాన్య ప్రజల నేస్తమైన సైకిల్‌కు క్రమేణా ఆదరణ తగ్గిపోయింది. వాటి స్థానాన్ని బైకులు ఆక్రమించాయి. అయితే కరోనా కారణంగా ప్రజారవాణా నిలిచిపోవడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటించాల్సి రావడంతో ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సైకిళ్లనే ఆశ్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సైకిళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కొన్ని దుకాణాల్లో ‘స్టాక్‌ లేదు’ అని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌- మనిషి ఆలోచనా సరళిని, జీవనశైలిని మార్చేసింది. లాక్‌డౌన్‌ వేళ చిన్న, పెద్ద, పల్లె, పట్నం అన్న తేడాలేకుండా అనేకమంది సైకిల్‌నే ఎంచుకుని తమ గమ్యస్థానాలకు, పనులకు హాజరయ్యేందుకు కార్యాలయాలకు, వ్యాపార సముదాయాలకు వెళ్లడం కనిపించింది. చాలా మంది నిరుపేదలు, వలస కూలీల నుంచి సామాన్య వ్యక్తుల వరకు రవాణా సౌకర్యంలేని కారణంగా వేల కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామాలు, పట్టణాలకు సైకిల్‌పైనే ప్రయాణించిన దృశ్యాలు కనిపించాయి.

మహా నగరాల్లో సైతం..

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన ప్రస్తుత కాలంలోనూ దేశంలోని చాలా నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ ప్రజారవాణాను ప్రారంభించలేదు. ముఖ్యంగా హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో సైకిళ్లపై ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యవంతంగా ఉండటం, కాలుష్యాన్ని తగ్గించడానికి సైకిల్‌ సవారే ఉత్తమమన్న స్పృహ నగర ప్రజల్లో పెరిగిపోయింది. ట్రాఫిక్‌, రవాణా ప్రణాళిక విభాగం అధికారుల అంచనా ప్రకారం ఒక్క కోల్‌కతాలోనే జూన్‌ 1 నుంచి 15 లక్షల సైకిళ్లు రోడ్లపై తిరుగుతున్నాయి. సైకిళ్లను వినియోగించేవారి సంఖ్య అధికమవడంతో వీటి కొనుగోళ్లూ భారీగానే పెరిగాయి. లాక్‌డౌన్‌ వేళ 50 శాతం డిమాండ్‌ ఒక్కసారి పెరిగిందని, డిమాండ్‌ మేరకు శని, ఆదివారాలు సైతం సెలవులు లేకుండా కొన్ని సంస్థలు సైకిళ్లను తయారు చేస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే సైకిళ్లకు జూన్‌ నుంచి 200 శాతం డిమాండ్‌ పెరిగిందంటున్నారు. కోల్‌కతాలోని బెంటింక్‌ స్ట్రీట్‌కు చెందిన సైకిళ్ల వ్యాపారులు. లాక్‌

కాలుష్య నివారణకు..

వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి సైకిళ్లనే వాడాలంటూ పలువురు పర్యావరణ ప్రేమికులు ఉద్యమాలు చేపట్టగా- ప్రత్యేకంగా సైకిల్‌ కారిడార్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలపడుతోంది. సైక్లింగ్‌ కోసం ప్రత్యేకంగా లేన్లు, కారిడార్లను ఏర్పాటు చేయాలంటూ బెంగళూరుకుచెందిన సత్య శంకరన్‌, డా.ఈరవింద్‌ భటేజా- మరికొందరు పర్యావరణ ప్రేమికులతో కలిసి అక్కడి మహానగర పాలకసంస్థకు లేఖలు రాశారు. దీంతో బెంగళూరు నగరంలో సుమారు 190 రోడ్ల వెంట సైకిల్‌ లేన్లను ఏర్పాటు చేయాలని అక్కడి నగరపాలక సంస్థ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అదేవిధంగా సైకిల్‌ లేన్లు, సైకిల్‌ కారిడార్లను ఏర్పాటు చేయాలంటూ చెన్నై, పుణె, గువాహటి ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాల్లోని పర్యావరణ ప్రేమికులు ఉత్తరాలు రాశారు. హైదరాబాద్‌లోనూ సైకిల్‌ లేన్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

2030 కల్లా...

నగరాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న వాహనాలను నియంత్రించకుంటే 2030 కల్లా ప్రస్తుతమున్నదానికంటే 50 శాతం కాలుష్యం పెరుగుతుందని ఓ సర్వేలో తేలింది. దీంతో ద్విచక్ర వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ ధ్వని, వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ గత జూన్‌ 25న దేశంలోని 141 నగరాల్లో ‘ఇండియా సైకిల్స్‌ 4 ఛేంజ్‌’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నగర ప్రజల్లో సైకిళ్ల వినియోగంపై స్పృహ, ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ తద్వారా కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యను తగ్గించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో భాగంగా సైకిళ్లను ఎక్కువగా వినియోగించిన 10 నగరాలను కేంద్రం ఎంపికచేసి ఒక్కో నగరానికి కోటి రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలతో సైకిళ్ల వినియోగం పెరిగే అవకాశముంటుంది. అదేవిధంగా వాహనాలను వాడితే కాలుష్యం అధికమవుతుందని, సైకిళ్లను వినియోగిస్తే ఆరోగ్యవంతంగా ఉంటారన్న స్పృహను విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించడంతోపాటు విద్యార్థులను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సైకిల్‌ సవారీ అక్కరకొస్తుంది. ఆరోగ్య పరిరక్షణతోపాటు కాలుష్యాన్ని కట్టడి చేసే మహదాశయంతో ఇప్పటికే కర్ణాటక, పశ్చిమ్‌ బంగ, త్రిపుర, తమిళనాడు, పంజాబ్‌ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు ప్రతిభావంతులైన, పేద విద్యార్థులకు సైకిళ్లను సరఫరా చేస్తున్నాయి. ఇలా సైకిళ్లకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడంతోపాటు పెరుగుతున్న కాలుష్యం, పర్యవసానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే సైకిళ్ల వినియోగం పెరిగి వాతావరణాన్ని కాపాడగలిగిన వారమవుతాం. విద్యార్థులు, ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచినవారమవుతాం. నగరాలు, పట్టణాల్లో ప్రత్యేకంగా సైకిల్‌ లేన్లను ఏర్పాటు చేస్తే సైకిళ్లను వినియోగించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

Last Updated : Aug 17, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.