ETV Bharat / opinion

లాక్​డౌన్​ వేళ సంకెళ్లు తెంచుకున్న సృజన - lockdown innovative thoughts

ఒకప్పుడు ప్రముఖ నటీనటులు మేకప్‌, ప్యాకప్‌లతో మాత్రమే సహజీవనం చేసేవారు. ఇప్పుడు ప్రముఖుల్లో కొందరు అంట్లు తోమారు. కొందరు బట్టలుతికారు. కొందరు దోశలు వేశారు. కొందరేమో సొంతంగా గుండు కూడా గీసుకున్నారు. నిజానికి, సామాన్యులు ఎంత ఘనకార్యం చేసినా పెద్దగా లెక్కలోకి రాదు. కానీ, ప్రముఖులు చిన్న రిబ్బను ముక్క కత్తిరించినా జనాల్లో అదో ఆసక్తి. అయితే, అత్యంత ప్రముఖులు కొందరుంటారు. వారేం చేసినా అది సంచలనమే. ప్రపంచవ్యాప్తంగా అలాంటి కొందరు లెజెండ్స్‌ లాక్‌డౌన్‌ వేళ ఏం చేశారో వారి మాటల్లోనే చూద్దాం.

change by lockdown across the world
లాక్​డౌన్​ వెేళ సంకెళ్లు తెంచుకున్న సృజన
author img

By

Published : May 23, 2020, 8:47 AM IST

Updated : May 23, 2020, 9:16 AM IST

సృజనాత్మకతకు లాక్‌డౌన్‌ కొత్త రెక్కలు తొడిగింది. ఒకప్పుడు మగాళ్లు వంటింటికి భౌతికదూరం పాటించేవారు. కరోనా పుణ్యమాని ఇప్పుడు కిచెన్‌తో క్యారమ్స్‌ ఆడేసుకుంటున్నారు. చేతులూ కాళ్లూ కాల్చేసుకుని వంటల్లో నలభీముల్ని మించిపోతున్నారు. ఒకప్పుడు సెలవుల్లో పిల్లకాయలు ఇల్లు పీకి పందిరి వేసేవారు. ఇప్పుడు ఎంచక్కా సెల్లు పీకి ప్లే స్టేషన్లూ, ప్రపంచ యుద్ధాలు చేస్తున్నారు. సాగదీత సీరియళ్లు, అమ్మలక్కల ముచ్చట్లూ గట్రా లేకపోయినా ప్రశాంతంగా ఉండగలిగే స్థితప్రజ్ఞతను మహిళలు సాధించేశారు. ఐటీ కుర్రాళ్లు వీకెండ్‌ పార్టీల్లేకుండానే బతికేయడం నేర్చుకున్నారు. ఒకప్పుడు ప్రముఖ నటీనటులు మేకప్‌, ప్యాకప్‌లతో మాత్రమే సహజీవనం చేసేవారు. ఇప్పుడు ప్రముఖుల్లో కొందరు అంట్లు తోమారు. కొందరు బట్టలుతికారు. కొందరు దోశలు వేశారు. కొందరేమో సొంతంగా గుండు కూడా గీసుకున్నారు. ఇక, కొందరు లేడీసేమో భర్తల నెత్తి పైభాగాన తమ చేతికందేంత జుట్టు మాత్రం వదిలి, చుట్టూరా డిప్ప కటింగు కొట్టే నేర్పు సాధించారు. కొందరు మొబైల్‌లోనే పూజలు, వ్రతాలు చేయించారు. కొందరైతే ఫోనుకే తాళితో మూడు ముళ్లేసి పెళ్లి కానిచ్చేశారు. ఇలా లాక్‌డౌన్‌ సృజనాత్మకతను ఏకరువు పెడితే అదో ఉద్గ్రంథమవుతుంది.

నిజానికి, సామాన్యులు ఎంత ఘనకార్యం చేసినా పెద్దగా లెక్కలోకి రాదు. కానీ, ప్రముఖులు చిన్న రిబ్బను ముక్క కత్తిరించినా జనాల్లో అదో ఆసక్తి. అయితే, అత్యంత ప్రముఖులు కొందరుంటారు. వారేం చేసినా అది సంచలనమే. ప్రపంచవ్యాప్తంగా అలాంటి కొందరు లెజెండ్స్‌ లాక్‌డౌన్‌ వేళ ఏం చేశారో వారి మాటల్లోనే చూద్దాం.

నచ్చని ఒకే ఒక్క మాట..

'ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట... మేడిన్‌ చైనా! వాళ్లేమిటో, వాళ్ల తిండి తీర్థాలేమిటో, వాళ్ల విచిత్ర వేషధారణేమిటో, అబ్భే.. అసలు చైనా అంటేనే ఎలర్జీ నాకు. ఇప్పటికే అర్థమయ్యుండాలి నేనెవరో? యెస్‌, నేనే... అమెరికా ట్రంప్‌ కార్డ్‌, డొనాల్డ్‌ ట్రంప్‌! పోయినేడాది నా ఎడంకన్ను అదో మాదిరిగా అదిరినప్పుడే అనిపించింది. చైనా ఇట్టాంటి కొంప ముంచే పనేదో చేస్తుందని. నిజానికి ఈ భూమ్మీద కొంపలు ముంచినా, ఆర్పినా అది మేమే చేయాలి. అది అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారానికి ఈ మధ్య చైనా గండికొడుతోంది. అందుకే మాకు చైనా అంటే అంత కడుపుమంట. ఇప్పుడీ చైనీస్‌ కరోనా దెబ్బకు మా దేశం కకావికలమైంది. అందుకే ఈ లాక్‌డౌన్‌ వేళ నా శ్వాస, ధ్యాస అన్నీ ఒక్క చైనాపైనే కేంద్రీకరించా. కరోనా సృష్టి చైనాపనేనని రుజువు చేయడమే నా ధ్యేయం. ప్రపంచంలో అల్లకల్లోలానికి, ఆర్థిక మాంద్యానికి కారణం చైనాయేనని దుమ్మెత్తిపోస్తా. నా శత్రువును ప్రపంచానికే శత్రువును చేస్తా. ఇదే నా శపథం. నా ఈ లాక్‌డౌన్‌ మిషన్‌ పేరు- ఆపరేషన్‌- డ్రాగన్‌ పరేషాన్‌!'

ఎంటర్​ ది డ్రాగన్​..

'మోదీ, ట్రంపు, పుతిన్‌... ఎవ్వరైతేనేం? వీరి కుర్చీ కాలం అయిదేళ్లే. మహా అయితే పదేళ్లు. కానీ, నా కుర్చీకి కాలం చెల్లడమనే మాటే లేదు. చైనాకు నేనే జీవితకాల చక్రవర్తిని! మోనార్కులకే మోనార్కుని! నియంతలకే మహానియంతను! నేనే జిన్‌ పింగ్‌! డ్రాగన్‌ స్వైరవిహారాన్ని ఎవ్వరూ ఆపలేరు. కరోనా- మేడిన్‌ చైనా అంటూ ఈ కాకుల గోలేమిటో! వీళ్లకసలు బుద్ధీ జ్ఞానం ఏమైనా ఉందా? పదార్థాన్నెవ్వరూ సృష్టించలేరు, నాశనం చెయ్యలేరు. కరోనా కూడా అంతే. కాకపోతే ఈ లాక్‌డౌన్లో నేనొకటే ఆలోచించా. కరోనా కల్లోలాన్ని వాడుకుని అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతా. ప్రపంచమంతా మేడిన్‌ చైనా మంత్రం జపించేలా చేస్తా. నా లాక్‌డౌన్‌ మిషన్‌ పేరు.. ఎంటర్‌ ది డ్రాగన్‌!'

నా రూటే సెపరేటు..

'ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది ఇంకోదారి. ఊరు, ఉలిపికట్టె ఇవేవీ నడవని దారే... ఉత్తరకొరియాది! మా దేశంలో కరోనా కేసుల సంఖ్య... జీరో! కాబట్టే, మాకు క్వారంటైన్లు లేవు, లాక్‌డౌన్లు అసలే లేవు. ఇక ప్రపంచమంతా లాక్‌డౌన్‌ ఉన్నవేళ, ఉబుసు పోక ఊబకాయాన్ని తగ్గించే ప్రయత్నాలేవో చేశా. నేను నాల్రోజులు కనబడకపోతే అమెరికాకు నిద్రపట్టదు. ఒకటే వదంతులు. ఏమిటో వీళ్ల పిచ్చి ప్రేమ. ట్రంప్‌ మామ కోసం ఓ అణు క్షిపణి రెడీ చేశా. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనితరసాధ్యం నా కుటుంబ మార్గం... నేనే కిమ్‌ జంగ్‌ ఉన్‌!' నా లాక్‌డౌన్‌ మిషన్‌ ఎప్పటికీ... నార్త్‌ కొరియా నెవ్వర్‌ డైస్‌!'

లాక్​డౌన్ సీక్వెల్స్..

'అఖండ భారత్‌, స్వచ్ఛ భారత్‌, మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా... రామనామ జపంలాగా, ఇండియా జపం చేసేదెవరు? ఇంకెవరు నేనే, నమో అలియాస్‌ నరేంద్రమోదీ! లాక్‌డౌన్‌ చిత్రానికి 1.0 నుంచి 4.0 దాకా సీక్వెల్స్‌ తీశా. కరోనా వేళ అందరు సీఎమ్‌లతో మన్‌ కీ బాత్‌ నిర్వహించా. బిగ్‌బాస్‌ అవతారమెత్తి దేశ ప్రజానీకానికి ఎన్నో టాస్కులిచ్చి ముందుకు నడిపించా. దేశానికి ఆత్మ నిర్భర మంత్రం నేర్ఫా విదేశీయాత్రలు చేయలేకపోయాననే బాధ తప్ప, లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేశా. నా లాక్‌డౌన్‌ మిషన్‌ పేరు కరోనా... భారత్‌ ఛోడోనా?'

నో మిషన్​..

'బొమ్మ పక్కన బొరుసు ఉండాల్సిందే. నిశి చెంత శశి ఉండాల్సిందే. రాహువు జోడీగా కేతువు ఉండాల్సిందే. మోదీ మాటెత్తితే రాహుల్‌ ప్రస్తావన రావాల్సిందే. ఏమిటీ, ఎంట్రీనే తిక్కతిక్కగా ఉందనుకుంటున్నారా? నేనంతే! లాక్‌డౌన్‌ యావత్‌ ప్రపంచాన్ని ఆవాహన చేసుకుని మరీ దీర్ఘంగా ఆలోచించా. ఇప్పుడీ ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్‌ చేతుల్లో పెట్టకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తరవాత మీ ఇష్టం. ఎంత ప్రయత్నిస్తున్నా కరోనా బొమ్మకి కొమ్ములు సరిగ్గా రావట్లేదు. పోయి స్కెచ్‌ ప్రాక్టీస్‌ చేసుకుంటా, వస్తా. బై! అన్నట్టు నాకే మిషనూ లేదు, ఉండదు, ఉండబోదు.'

-నాగరాజ్

Last Updated : May 23, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.