ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Live
🎬 Watch Now: Feature Video
Published : Jan 2, 2024, 5:39 PM IST
|Updated : Jan 2, 2024, 6:01 PM IST
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి షర్మిల అధికారికంగా ప్రకటించారు. జనవరి నెలలో జనవరి 18వ తేదీన నిశ్చితార్థం వేడుక జరగనున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుందని తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించుకోనున్నట్లు వైఎస్ షర్మిల చెప్పారు. తన కుమారుడి వివాహ తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సంవత్సరంలో తమ ఇంట్లో జరగబోయే సంతోషకరమైన విషయం అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు కుమారుడు, కాబోయే కోడలితో కలిసి ఇడుపులపాయకు వెళ్లారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద మొదటి శుభలేఖ ఉంచారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడే అవకాశముంది.