ETV Bharat / lifestyle

ఉబికివచ్చే కన్నీళ్లు.. ఏరీ అయినవాళ్లు!

author img

By

Published : Sep 11, 2020, 11:55 AM IST

కరోనాతో మానవ సంబంధాలు ప్రశ్నార్థకమవుతున్నాయి. సొంత తల్లిదండ్రులే బిడ్డలకు భారంగా మారుతున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత అక్కున చేర్చుకోవాల్సిన వారే దూరం పెడుతున్నారు. రకరకాల కారణాలు చూపుతూ ఇంటికి తీసుకెళ్లేందుకే నిరాకరిస్తున్నారు. చేసేదిలేక గాంధీలో ఇప్పటికే 25 మంది వరకు ఉండిపోవాల్సి వచ్చింది.

children abandoned their parents due to corona
మానవ సంబంధాలపై కరోనా ప్రభావం

గతంలో 90 మంది ఉండేవారు. పలుమార్లు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన తర్వాత కొందరు ముందుకొచ్చి తీసుకెళ్లారు. ప్రస్తుతం మిగిలినవారి బాధ్యతను వైద్యులే చూస్తున్నారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా డిపెండెంట్‌ వార్డును ప్రారంభించారు. 24 గంటలూ సేవలందించేలా సిబ్బందిని సిద్ధం చేశారు.

కౌన్సెలింగ్‌కు ప్రత్యేక బృందం..

కుటుంబ సభ్యులు రాక ఆసుపత్రిలో ఉండిపోయినవారికి భోజనంతోపాటు ఇతర అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. మానసిక పరిస్థితి బాగాలేనివారికి నిపుణులతో కౌన్సెలింగ్‌ అందిస్తున్నామన్నారు. ఇందుకు ఒక ఫ్రొపెసర్‌, ఒక అసోసియేట్‌, ఒక సహాయ ప్రొఫెసర్‌ను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు వీరు రోగులతో మాట్లాడి ధైర్యం కల్పిస్తున్నారని తెలిపారు. కరోనా నుంచి స్వస్థత పొందినవారిలో 15-20 మంది పక్షవాతంతో బాధపడుతున్నారని, వారిని కూడా ఆసుపత్రిలో ఉంచి సేవలు అందిస్తున్నామన్నారు.

నగరానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో గాంధీలో చికిత్స పొందారు. పూర్తిగా నయమవడంతో ఆయన కుటుంబ సభ్యులకు ఆసుపత్రి నుంచి సమాచారం ఇచ్చినా..వారు తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. చేసేదిలేక తన స్వస్థలంలో ఇదివరకు తన వద్ద పనిచేసిన ఓ వ్యక్తికి ఆ పెద్దాయన ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడు. రాగానే అతని ఇంటికి వెళ్లిపోయాడు.

ఆయన వయసు దాదాపు 75 ఏళ్లు.. కరోనా రావడంతో కుటుంబ సభ్యులు తెచ్చి గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్సతో ఆయన కోలుకున్నారు. ఈ సమాచారాన్ని ఆయన ఇంటికి వైద్యులు ఫోన్‌లో సమాచారమిచ్చారు. కుమారుడు రావడంతో ఆ తండ్రి సంతోషించాడు. తీరా బిడ్డ నోటి నుంచి వచ్చిన మాట విని నీరుగారిపోయాడు. ‘వృద్ధాశ్రమంలో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు నాన్నా. మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండు’ అని చెప్పి జారుకోవడంతో ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

కొవిడ్‌తో గాంధీలో చేరిన మరో వృద్ధుడిదీ విషాద గాథే. బతికి వస్తాడో, రాడో నమ్మకం లేక ఆస్తిపై హక్కులు దక్కేలా అతని కుటుంబంలోని ఓ వ్యక్తి వీలునామా రాయించుకోవడానికి లాయర్‌తో సహా వచ్చాడు. ఆసుపత్రి వర్గాలు మందలించి పంపించేశాయి. అయినా అవతలి వ్యక్తి పట్టుదల వదల్లేదు. కాగితాలు తయారుచేసి లోపల ఉన్న వ్యక్తులతో పైరవీలు చేసి మరీ సంతకం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ వృద్ధుడే బాధపడుతూ వైద్యులకు తెలిపాడు.

‘కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఫోన్లకు సమాచారమిస్తున్నాం. ఇదిగో వస్తున్నాం అని చెబుతారు. మళ్లీ ఫోన్‌ చేస్తే...ఎత్తక పోవడమో...లేదంటే బ్లాక్‌ చేయడమో చేస్తున్నారు. వేరే నెంబరు ద్వారా చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే దిగి వస్తున్నారు. మరికొందరైతే ఇంటి వద్ద స్థలం లేదనో...చిన్న పిల్లలు ఉన్నారనో చెప్పి తప్పించుకుంటున్నారు. అందుకే ఆసుపత్రిలో ఉండేలా ఏర్పాట్లు చేశాం’

- డాక్టర్‌ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.