ETV Bharat / lifestyle

అవాంఛిత రోమాలు పెరగకుండా చిట్కాలు.. - Unwanted hair removal for women

కొంతమంది మహిళలకు అవాంఛిత రోమాలు వస్తుంటాయి. ఇవి చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. క్రీములూ, మందుల అవసరం లేకుండా ఇంట్లోనే వీటిని నివారించవచ్చు. ఎలా అంటే...

Unwanted hair removal tips for women
అవాంఛిత రోమాలు పెరగకుండా చిట్కాలు
author img

By

Published : Nov 3, 2020, 11:40 AM IST

బాగా పండిన బొప్పాయి గుజ్జులో ఒకట్రెండు టేబుల్‌ స్పూన్ల పసుపు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని నేరుగా చర్మంపైనా, ముఖంపైన కూడా రాసుకోవచ్చు. 15 నిమిషాలుంచి కడిగేస్తే సరి. ఇలా క్రమంతప్పకుండా మూడు నెలలుపాటు వారానికి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడంవల్ల రోమాలు, మృతకణాలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.

ఓ కప్పు పెసలు, మినుములను నీళ్లలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత ఇందులో ఓ చెంచా చొప్పున బంగాళాదుంప రసం, తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కావాల్సిన చోట రాసుకుని ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో నెమ్మదిగా రుద్ది కడిగేయాలి.

మొక్కజొన్న పిండిలో కొద్దిగా చక్కెర, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి 30 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తరువాత పీలాఫ్‌ మాస్కులా తీసేస్తే సరి. ఇది రోమాలు పెరగకుండా చేయడంతోపాటు మృతకణాలనూ తొలగిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.