- శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్రా అంతే ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే బరువు పెరగడం, ఇమ్యూనిటీ తగ్గడం, భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో సమస్యలొస్తాయి. జీవగడియారం దెబ్బతింటుంది. పొద్దున్నే నిస్సత్తువగా ఉండటమే కాకుండా జుట్టు ఊడటం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి వాటికీ కారణమవుతుంది.
- నిద్రలేమి విపరీతమైన ఒత్తిడి, ఆందోళనతోపాటు ఇతర సమస్యలకూ దారి తీస్తుంది. కోపం, దేనిమీదా దృష్టి పెట్టలేకపోవడం, ఆకలి లేకపోవడం, త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడం, కళ్లకింద వాపులను కలిగిస్తుంది. దీర్ఘకాల వ్యాధులకూ దారితీస్తుంది. కాబట్టి, కనీసం ఏడు గంటలు అదీ నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే ముందు ఆరోజు ఆందోళన కలిగించినవీ, మరుసటి రోజు చేయాల్సిన వాటి గురించి ఆలోచించొద్దు. ఆహ్లాదకర సంగీతం, ఎసెన్షియల్ నూనెలు సాంత్వన కలిగించడమే కాక గాఢనిద్రనీ ఇస్తాయి. కాలానికి తగ్గట్టుగా దిండ్లు, దుప్పట్లను మార్చుకోవాలి. ఇవీ ముఖ్యమే.
- నిద్రపోయే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగాలని మీ బామ్మ దగ్గర వినే ఉంటారు. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే, పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం, మెలటోనిన్ మరియు విటమిన్ డి ఉన్నాయి. ఈ నాలుగు నిద్రను ప్రోత్సహించే సమ్మేళనాలు. కొద్దిగా రుచి మరియు అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం పసుపును కూడా కలపవచ్చు.
- అన్ని నట్స్‌లో మెలటోనిన్‌తో పాటు మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ మొదలైన ఖనిజాలు ఉంటాయి. కొన్ని అధ్యయనాలు ఇవి నిద్రలేమిని ఎదుర్కోవడంలో సహాయపడతాయని నిరూపించాయి.
- టీ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధమైనది చమోమైల్ టీ. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందటంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, అపిజెనిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున నిద్రలేమిని తగ్గించి హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
- విటమిన్ సి అధికంగా ఉండే పండు కివి. కేలరీలు తక్కువ, పోషకాలు అధికంగా ఉండే పండు. అందులో యాంటీఆక్సిడెంట్లు, మెలటోనిన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
- విటమిన్ డి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం కావడంతో పాటు, సాల్మొన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు సెరోటోనిన్‌ను నియంత్రిస్తాయి. ఇది చక్కని నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇదీ చూడండి: ఈ టీలు తాగితే.. హాయిగా నిద్రపట్టేస్తుంది!