సమస్య ఉంటే వద్దు
చాలామందికి నెలసరి సమయంలో వ్యాయామాలు చేయొచ్చా? అనే అనుమానం కలుగుతుంది. అప్పుడూ వర్కవుట్లు చేయొచ్చు కాకపోతే, మీరు రోజూ చేసేలాంటి కష్టమైనవి ఎంచుకోవద్దు.. వ్యాయామం అంటే బరువులు ఎత్తడమో, కిలోమీటర్లు పరిగెత్తడమే మాత్రమే కాదు.. శరీరానికి చురుకు పుట్టించేలా కాసేపు నడిచినా ఫలితం ఉంటుంది. ఇలాంటప్పుడు కొందరిని నొప్పులు బాధిస్తుంటాయి. అయినా బరువు తగ్గాలనే ఆలోచనతో వ్యాయామం కొనసాగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సమయంలో వీలైనంతగా విశ్రాంతి తీసుకోవడం మేలు.
అతిగా చేయొద్దు
బరువు తగ్గాలనే ఆలోచన మంచిదే కానీ.. దానికి తొందర వద్దు.. ఇలా చేస్తే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఏదైనా క్రమపద్ధతిలో సాగాలి. మీరు చేసే అతి వ్యాయామం వల్ల అంతర్గతంగా గాయాలయ్యే ప్రమాదం ఉంది. మీ కండరాలు ఒత్తిడికి గురై, తీవ్రమైన నొప్పుల బారినపడే ఆస్కారమూ ఎక్కువే. కీళ్ల నొప్పుల వంటి సమస్యలూ ఎదురుకావొచ్చు. నిపుణులకు మీ ఆరోగ్య పరిస్థితిని వివరించి వారి సలహాతో మీకు తగ్గ వ్యాయామ ప్రణాళిక వేసుకోండి. అప్పుడే కోరుకున్న ఫలితం మీ సొంతమవుతుంది.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో వచ్చేస్తున్నాయ్... సైకిల్ ట్రాక్లు