కోపం వచ్చినప్పుడు భాగస్వామిని అడిగేయాలనీ, కడిగేయాలనీ అనిపిస్తుంది. కానీ పిల్లల మనసునీ కాస్త అర్థం చేసుకోండి. చిన్నారుల్ని మానసికంగా ఆందోళనకు గురిచేసే విషయాల్లో.. తల్లిదండ్రులు విడిపోతారనే భయం కూడా ఒకటని చెబుతున్నాయి పరిశోధనలు. విడిపోవడం వరకే అక్కర్లేదు.. అమ్మానాన్నలిద్దరూ ఎడమొహం, పెడమొహం అన్నట్టున్నా చదువుల్లో ఏకాగ్రత కోల్పోతారు. కాబట్టి మీ కోపాన్ని పిల్లల ముందు వ్యక్తం చేయకండి.
- ఎదుటివారిపై మీ కోపాన్నీ, వారి ప్రవర్తన వల్ల ఏర్పడ్డ బాధను ఓ కాగితంపై రాయండి. వాటిని పంచుకునేందుకు ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసుకోండి. ఇందువల్ల పిల్లల ముందు బయటపడే పరిస్థితి ఎదురుకాదు.
- నిజానికి మనసులో ఉన్న ఏవో అసంతృప్తులు, ఇంకేవో విషయాలే కోపంగా పెల్లుబుకుతాయి. పిల్లల మధ్యకు రాకముందే వాటి గురించి మాట్లాడుకోండి. సమస్య ఒక్కసారిగా పరిష్కారం కాకున్నా.. కోప్పడే ఆస్కారం తగ్గుతుంది. ఒకవేళ దానిపై కోపం ఉన్నా.. పిల్లల ముందు ఆ కాసేపైనా మౌనంగా ఉండండి. ఇతర అంశాలు ప్రస్తావించండి.
ఇదీ చదవండి: టైటానిక్ ప్రేమికులు పెట్టుకున్నారు మాస్కులు!