ETV Bharat / lifestyle

Porn Videos: పిల్లలు ఏకాంతంగా గడుపుతున్నారా? పోర్న్ చూస్తున్నారా? - పిల్లల్లో పెరిగిన పోర్న్ వీక్షణం

తెలిసీ తెలియని ప్రాయం.. ఎదగని వయసు.. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత.. సాంకేతికత అతి వినియోగం వారిని పెడదారిన పయనించేలా చేస్తోంది. వివిధ పరిస్థితుల ప్రభావంతో కొంతమంది పిల్లలు అశ్లీలత వీక్షణకు అలవాటుపడుతున్నారు. చివరకు బానిసలుగా మారుతున్నారు. ఇది చిట్టి బుర్రలపై పెను ప్రభావాన్నే చూపుతోంది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన పోర్న్‌.. ఇప్పుడు పిల్లలు కూడా చూసే పరిస్థితులు వచ్చాయి. పాఠశాలలకు భౌతికంగా వెళ్లకుండా ఇళ్లకే పరిమితమవుతుండడంతో ఈ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వర్చువల్‌గా తరగతులకు హాజరవుతుండడంతో ఫోన్లు, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లపై ఎక్కువ సమయం గడపాల్సి రావడమే ఇందుకు కారణం.

Porn Videos
పిల్లల్లో పెరిగిన పోర్న్ వీక్షణం
author img

By

Published : Sep 13, 2021, 11:20 AM IST

గతేడాదిగా పిల్లలు అశ్లీలాన్ని అధికంగా చూస్తున్నారని వివిధ సర్వేల్లో తేలింది. ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా మొబైళ్లు, ట్యాబ్‌ల వినియోగం తప్పనిసరైంది. తరగతులకు వర్చువల్‌గా హాజరుకావడంతో పాటు, హోంవర్క్‌, అసైన్‌మెంట్లు, తదితర అన్ని అవసరాలకు వీటిపై ఆధారపడాల్సిందే. ఉపాధ్యాయులు ఇచ్చే అసైన్‌మెంట్ల కోసం వివిధ సైట్లను అన్వేషించి సమాచారాన్ని క్రోడీకరించుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా.. వివిధ వెబ్‌సైట్లను బ్రౌజ్‌ చేస్తుండగా పోర్న్‌సైట్లకు చెందిన పాప్‌అప్‌లు వస్తుంటాయి. కుతూహలం కొద్దీ వీటిపై క్లిక్‌ చేస్తే పోర్న్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే. ఇలా అలవాటు పడి, చివరకు బానిసలుగా మారుతున్నారు. అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పదే పదే చూసేందుకు అలవాటు పడుతున్నారు.

చెడు ఆలోచనలు

పోర్న్‌ వీక్షణ ప్రభావం పిల్లల్లో ఎక్కువగా ఉంటుందని, ఇది దుష్ఫలితాలకు దారి తీస్తుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. చిట్టి మనస్సును కులషితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సినిమాలు, వెబ్‌సీరీస్‌ల్లోని అర్ధనగ్న దృశ్యాలు కూడా పిల్లల మస్తిష్కకంలో లేనిపోని ఆలోచనలకు దారితీసేలా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పోర్న్‌ సైట్లను నిషేధించింది. వీటిని బ్లాక్‌ చేయాలని టెలికం సంస్థలను ఆదేశించింది. ఇది కొంత వరకే ఫలితం ఉంటోంది. ఆ సైట్లు పేర్లు మార్చుకుని అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో నిషేధం పూర్తిగా అమలు కావడం లేదు. వివిధ దేశాలకు చెందిన సైట్లను కూడా చూస్తున్నారు. మానసికంగా, శారీరకంగా సరైన వయసు రాకుండానే చూడడం వల్ల వారి ఆలోచనా ధోరణి కూడా మారుతుంది. ఇది క్రమంగా దారి తప్పేందుకు దోహదపడుతుంది.

ఇంట్లో ఎవరూలేని సమయంలో తరచూగా...
  • విజయవాడ నగరానికి చెందిన 13 ఏళ్ల అబ్బాయి.. పాఠ్యాంశాల కోసం ఆన్‌లైన్‌ను విస్తృతంగా వినియోగిస్తుంటాడు. అనుకోకుండా ఓసారి తెరపై అర్ధనగ్న చిత్రం ఉన్న పాప్‌అప్స్‌ క్లిక్‌ చేశాడు. అశ్లీల వీడియోలు ఉన్న ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లాడు. అప్పటి నుంచి పోర్న్‌ కంటెంట్‌ను చూడడం అలవాటుపడ్డాడు. ఇంట్లో వారికి కనిపించకుడా దొంగచాటుగా చూడడం చేసేవాడు. కుదరని సందర్భాల్లో వాష్‌రూమ్‌కు వెళ్లి అందులో చూసేవాడు. దీని వల్ల చదువుపై పూర్తిగా దృష్టి పోయింది. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి మొబైల్‌ను పరీక్షించే సరికి అసలు విషయం బయటపడింది.
  • నగరానికి చెందిన ఓ బాలుడికి తన స్నేహితుల సూచనతో సెక్స్‌ వీడియోలను చూడడం అలవాటు అయింది. క్రమంగా ఈ అలవాటు పతాక స్థాయికి చేరింది. తల్లిదండ్రులతో కాకుండా వేరే గదిలో పడుకోవడం, అర్ధరాత్రి దాటే వరకు అశ్లీల వీడియోలు చూడడం చేసేవాడు. తిరిగి మెలకువ వస్తే దిండు కింద పెట్టుకున్న ఫోన్‌ను తీసి ఎడతెరిపి లేకుండా వీక్షించేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో పూర్తిగా నియంత్రణ కొరవడింది. పేరుకు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నా.. మరో విండోలో పోర్న్‌ చూసేవాడు. చదువులో పూర్తిగా వెనకబడడంతో ఆఖర్లో గుర్తించిన తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు సైకియాట్రిస్టు వద్దకు తీసుకెళ్లారు.

ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి

కౌన్సిలింగ్‌ సైకాలజిస్టు

కొవిడ్‌ కారణంగా పిల్లలు ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగింది. ఇందులో ఎక్కువ సమయం గడపడం వల్ల తమకు తెలియకుండానే అశ్లీలతకు ఆకర్షితులవుతున్నారు. వారిలో డపామిన్‌ అనే హార్మోను విడుదల అవుతుంది. ఇది ఆనందంగా ఉండడానికి దోహదపడుంది. ఫలితంగా పోర్న్‌ చూడడం వల్ల వారిలో మనసు ఆనందంగా ఉందన్న భ్రమలో ఉంటారు. అమ్మాయిలు, స్త్రీలను వారు ఇదే భావనతో చూస్తారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు నిశితంగా గమనిస్తుండాలి. వారిలో పెడ ధోరణులకు ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయాలి. లేనిపక్షంలో ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. వారి నడవడికపైనా అమితమైన ప్రభావం చూపుతుంది.

- డా. టి.ఎస్‌ రావు, కౌన్సిలింగ్‌ సైకాలజిస్టు, విజయవాడ

తల్లిదండ్రులూ.. కాస్త గమనించండి

  • పిల్లలు అశ్లీల కంటెంట్‌ను చూడకుండా నిరోధించేందుకు ఫిల్టర్స్‌, వెబ్‌సైట్‌ బ్లాక్స్‌ను ఉపయోగించాలి. వారు ఏమేం చూస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలి.
  • ఎక్కువ మంది ఉద్యోగాల్లో తలమునకలై ఉండడం వల్ల పిల్లలు దారి తప్పుతున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు వీలైనంత సమయం గడపాలి.
  • ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాలం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. విజ్ఞానం పెంచుకోవడానికి దీనిని ఉపయోగించుకోవాలి. తప్పుడు దారిలో పయనించేందుకు ఇది వేదిక కారాదు. పిల్లలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
  • చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వీటి సాకారం కోసం నిరంతరం శ్రమ పడాలి. అశ్లీల అంశాల జోలికి వెళ్లొద్ధు
  • ఇంటర్నెట్‌ అనంతమైన విజ్ఞాన గవాక్షం వంటిది. ఇందులో వివిధ ప్రతిభావంతుల విజయగాధలను తెలుసుకోవడం వల్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంది.

ఇదీ చూడండి: Minor Girl Rape Case : వెంటబడిన మానవమృగం.. ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.