చెెర్రీస్.. వీటిలో పోషకాలు అత్యధికం, క్యాలరీలు తక్కువ. పొటాషియం ఎక్కువ శాతంలో ఉండి, అధికరక్త పోటును నియంత్రిస్తుంది. బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిండెట్లు మూత్రాశయ సంబంధిత సమస్యలను దరికి చేరనివ్వవు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
యాపిల్.. వర్షాకాలంలో వచ్చే తాజా యాపిళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పీచు జీర్ణశక్తిని మెరుగు పరచడమే కాదు, మెదడు, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
పీచ్.. యాంటీ ఆక్సిడెంట్లు సహా ఎ, సి విటమిన్లు ఇందులో పుష్కలం. పీచు, పొటాషియం ఉండే పీచ్ ఫ్రూట్ జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా, హృద్రోగ సమస్యలను దూరంగా ఉంచుతుంది. టాక్సిన్లను బయటికి పంపుతుంది. వర్షాకాలంలో ఈ పండును రోజూ తీసుకుంటే మంచి ఆరోగ్యం మీ సొంతం.
ప్లమ్స్.. విటమిన్ సి, జింక్, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ప్లమ్స్ మహిళల్లో వయసుపైబడిన ఛాయలను దూరం చేస్తాయి. జీర్ణశక్తితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని ముందుగా ఉప్పునీటిలో కడిగి, ఆ తర్వాత మంచి నీటిలో శుభ్రం చేశాకే తినాలి.
ఇదీ చదవండి: Viral Video: వర్షం నీటిలో చిట్టి సింహం సరదా ఆటలు