ETV Bharat / lifestyle

అప్పుడు తలపై మజ్జిగ పోసి అవమానించాడు! - వసుంధర కథనాలు

మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టిన ఆడవారికి భర్త అండగా నిలవాలి. ఆమె ఆకాంక్షలు, ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఆ దిశగా తనను ప్రోత్సహించాలి. అంతేకానీ తనే అడ్డుపుల్లగా మారకూడదు. అలా తన కలలకు అడ్డుపడ్డాడని కట్టుకున్న వాడికి విడాకులిచ్చింది సుదీప్త మొండల్‌. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సరికొత్త ఆరోగ్య సూత్రాలతో సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది.

how-this-woman-braved-domestic-violence-and-abuse-to-find-her-dreams-as-a-fitness-trainer
అప్పుడు తలపై మజ్జిగ పోసి అవమానించాడు!
author img

By

Published : Aug 1, 2021, 3:37 PM IST

జార్ఖండ్‌లోని సింద్రీ ప్రాంతానికి చెందిన సుదీప్త... టీనేజ్‌ వయసులోనే తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. తన తల్లిదండ్రులతో పాటు ఎవరికీ భారంగా మారకూడదనుకుంది. అందుకే 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని వదిలిపెట్టి దిల్లీ చేరుకుంది. అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని ఓ న్యూస్‌ పేపర్‌లో జర్నలిస్టుగా చేరింది. ఏడాది తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లైవ్‌ థియట్రికల్‌ షో ‘Zangoora’ లో ఆర్టిస్ట్‌గా చేరి సుమారు 1,400 షోలకు పని చేసింది. షైమక్‌ దావర్‌ డ్యాన్స్‌ బృందంలో టాప్‌ డ్యాన్సర్‌గా కూడా పేరందుకుంది సుదీప్త. వీటితో పాటు ఫిట్‌నెస్‌ పాఠాలు కూడా చెప్పేది.

తలపై మజ్జిగ పోసి అవమానించాడు!

‘పెళ్లి’ అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మేలి మలుపు కావాలి. అయితే దురదృష్టవశాత్తూ సుదీప్త జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఓ చేదు జ్ఞాపకంగా మారిపోయింది. ఆరేళ్ల క్రితం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సుదీప్త దిల్లీ నుంచి ముంబయికి తన మకాం మార్చింది. అయితే అక్కడ ఆమె భర్త తనపై అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించాడు. మొదట తన జుంబా ట్రైనింగ్‌ క్లాసులకు అడ్డుపడ్డాడు. ప్రత్యేకించి మగాళ్లకు ట్రైనింగ్‌ వద్దన్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి శారీరకంగా, మానసికంగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

‘నా భర్త ఎంతగా హింసించినా ఓ సగటు భారతీయ మహిళగా సర్దుకుపోయి కాపురం చేయడానికే ప్రయత్నించాను. అతను మారతాడంటూ ఓపికతో ఎన్నో రోజులు వేచి చూశాను. కలహాలను దూరం చేసుకుని సజావుగా కాపురం చేసేందుకు ప్రయత్నించాను. అతను ఎప్పుడూ నా మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు మాట్లాడుతుండగానే నా తలపై లస్సీ (మజ్జిగ) పోసి అవమానించాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ మా మధ్య గొడవలు పెరిగాయే కానీ తగ్గలేదు. అందుకే అతని నుంచి విడిపోవాలనుకున్నాను’ అని ఓ సందర్భంలో తను పడిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుందీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.

ఆర్థికంగానూ నష్టపోయాను!

దాంపత్య బంధాన్ని తెంచుకుని తన జీవితం తాను బతకాలన్న సుదీప్త ఆశ అంత సులభంగా నెరవేరలేదు. విడాకులు ఇవ్వడానికి భర్త, అత్తింటివారు నిరాకరించారు. సుమారు రెండేళ్లకు పైగా ఆమెను విసిగించి ఆ తర్వాత విడాకుల అంగీకారపత్రంపై సంతకాలు చేశారు.

‘నా భర్త, అత్తింటివారు నా హక్కులన్నిటినీ కాలరాశారు. వారికి దూరంగా కొన్ని రోజులు నా స్టూడెంట్‌ గదిలో ఉన్నాను. విడాకుల కోసం తిరుగుతూ నా దగ్గర దాచుకున్న మొత్తాన్ని ఖర్చు చేశాను. ఈ వ్యవహారం నన్ను మానసికంగానూ, ఆర్థికంగానూ బాగా దెబ్బతీసింది. అందుకే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా అదనపు గంటలు పని చేశాను. అలా వచ్చిన డబ్బుతో జుంబా, పిలాటిస్‌, ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సుదీప్త.

నూనె లేని వీగన్‌ ఆహారం!

గత మూడేళ్లలో ఫిట్‌నెస్‌ కోచ్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించింది సుదీప్త. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమె దగ్గర ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2018 నుంచి ఎకో ఫ్రెండ్లీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తోందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్. ఇందులో భాగంగా నూనె లేని వీగన్‌ ఆహారాన్ని అలవాటు చేసుకుంది. దీంతో పాటు తన దగ్గరున్న దుస్తులు, పుస్తకాలు, ఫర్నిచర్‌లో సగ భాగాన్ని ఇతరులకు దానం చేసి తన దాతృత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం జుంబా, పిలాటిస్‌, ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ సెషన్లు నిర్వహిస్తోంది సుదీప్త. అదేవిధంగా పోషకాహారం, లైఫ్‌స్టైల్‌ కోచింగ్‌కు సంబంధించి అవగాహన వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది.

మనం ఏదైనా సాధించగలుగుతాం!

ఎన్ని సమస్యలు ఎదురైనా ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడింది సుదీప్త. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా తన కలను నెరవేర్చుకుంది. ఈ సందర్భంగా మహిళలకు మీరిచ్చే సలహా ఏమిటని అడిగితే ‘ప్రతి మహిళలో సహజ సిద్ధమైన బలం, శక్తి దాగి ఉంటాయి. వాటిని గుర్తించినప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం’ అని స్ఫూర్తిని పంచిందీ సూపర్‌ వుమన్‌.

ఇదీ చూడండి: Lal Darwaza Bonalu: వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.