హైదరాబాద్ బంజారాహిల్స్‌లో తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ కౌసల్యం పేరుతో వస్త్ర, క్రాఫ్ట్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. రోడ్ నెంబర్ 12లోని సీసీటీ స్పెస్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌లో దేశ నలుమూలల నుంచి చేనేత డిజైనర్లు రూపొందించిన రకరకాల వస్త్రాలను ప్రదర్శించారు.
రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన చింతకింది మల్లేశం రూపొందించిన వస్త్రాలు కూడా ఇందులో ఉన్నాయని నిర్వాహకురాలు విజయలక్ష్మీ తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల పట్ల ఆసక్తి ఉన్నవారికి సిదర్ క్రాఫ్ట్ నుంచి బంధాని, సమన్ చికన్ ఆర్ట్ నుంచి చికంకరి, ద్వారకా ప్లస్ నుంచి కలంకరి, బాటిక్, కచ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లు చీరలు నగర వాసులకు అందుబాటులో ఉన్నాయన్నారు.
- ఇదీ చూడండి : నగరంలో కొత్త బొటిక్... హొయలొలికించిన మోడల్స్