ETV Bharat / lifestyle

Trendy Saree Styles : దసరా స్పెషల్.. మగువల కోసం న్యూ శారీ స్టైల్స్..

తెలుగిళ్లలో ఏ వేడుకకైనా మగువల ఫస్ట్ ఛాయిస్​ చీరనే. మరి ఇప్పుడు దసరా సీజన్. పండుగవేళ ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి మగువా ఆశపడుతుంటుంది. కానీ ప్రతిసారి ఒకే రకంగా చీరకట్టు ఉంటే బోర్​ కొడుతుంది. అందుకే మీ కోసమే సరికొత్తగా ఈ న్యూ శారీస్టైల్స్(Trendy Saree Styles)...

Trendy Saree Styles
Trendy Saree Styles
author img

By

Published : Oct 12, 2021, 5:07 AM IST

దసరా వచ్చేసింది. పండగవేళ ప్రత్యేకంగా కనిపించాలంటే చీరని కట్టాల్సిందే. ఇది తెలుగు సంస్కృతికే కాదు...భారతీయతకూ అద్దం పట్టే అలంకరణ. కట్టుకునే పద్ధతి తెలియాలే కానీ...ఇందులో ఇనుమడించే అందం మరే దుస్తుల్లోనూ కనిపించదు. అందుకే ఆధునికంగానూ, ఆకట్టుకునేలానూ కనిపించాలనుకునే అమ్మాయిలూ ఈ శారీ స్టైల్స్‌(Trendy Saree Styles)ని ప్రయత్నించొచ్చు.

చీరకట్టులో ఎన్నో పద్ధతులు. ప్రాంతం, ఆచార-సంప్రదాయలను బట్టి కూడా కట్టుకుంటారు. ఏ శైలిని ఎంచుకున్నా...నయా లుక్‌తో మెరిసిపోవడమే ఈ తరం ట్రెండ్‌.

పెప్లమ్ శారీ

పెప్లమ్‌ శారీ : ప్రింటెడ్‌ లేదా ఎంబ్రాయిడరీ పెప్లమ్‌ బ్లవుజుకి ప్లెయిన్‌ శారీ మ్యాచింగ్‌ చేస్తే పండగ కళంతా మీదే.

చీరకు దుపట్టా:

చీరకు దుపట్టా: పండగ వేళ కట్టేందుకు పట్టుకి మించింది ఏముంది? అందుకే ఈసారి చీర ఏదైనా జతగా కంచి లేదా బెనారస్‌ దుపట్టానూ వేస్తే ఆడంబరంగానే కాదు అందంగానూ కనిపించొచ్చు. రెండు భుజాల మీద కొంగులు...రాచరికపు కళను తెచ్చిపెడతాయి.

లెహెంగా శారీ: ఇప్పుడు ఈ చీరకట్టు ట్రెండ్‌. కాన్‌కాన్‌ వేసి లెహెంగాలపై కడితే ఆధునికంగానే కాదు సంప్రదాయంగానూ కళగా కనిపిస్తారు. బుట్టబొమ్మలా మెరిసిపోతారు.

షరార చీర: ఈ సంప్రదాయ లక్నోడ్రెస్‌ని టాప్‌ టూ బాటమ్‌ సేమ్‌ కలర్‌లో కడితే...కొత్తగా కనిపించొచ్చు.

క్లాసిక్‌ ట్విస్ట్‌

క్లాసిక్‌ ట్విస్ట్‌ : పల్లూని చిన్నగా తీసి కొంగు దగ్గర మడతలు కాస్త ఎక్కువగా, నడుం దగ్గర వెడల్పుగా ఉండేలా చూసుకుంటే చాలు అదుర్స్‌. దీనికి కాస్త బెంగాలీ శైలిని చేర్చి... నడుం దగ్గర మెటాలిక్‌, ఫ్యాబ్రిక్‌ బెల్ట్‌ వాడితే మీ లుక్కే మారిపోతుంది.

డబుల్‌ శారీ స్టైల్‌: రెండు చీరల కట్టు... పూర్తి కాంట్రాస్ట్‌ చందేరీ/పట్టు చీరలను ఎంచుకొని ఒక రంగు చీరను ఒకవైపునకు లెహంగా కుచ్చిళ్లు సెట్‌ చేసుకొని, మరోవైపు మరో చీరతో కుచ్చిళ్లు తీసి, భుజం మీదుగా పవిట కొంగు తీస్తే సరి.

ధోతీ కట్టు

ధోతీ కట్టు : ఇందులో రెడీమేడ్‌ రకాలు దొరుకుతున్నాయి. ప్యాంట్‌, లెగ్గింగ్‌లపై కట్టుకుంటే సౌకర్యం కూడానూ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.