ETV Bharat / lifestyle

ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడుకునేందుకూ టొమాటో!! - health news

టొమాటోలు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడుకునేందుకూ ఉపయోగపడతాయి. మరి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా?

benefits of Tomatos in telugu
ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడుకునేందుకూ టొమాటో!!
author img

By

Published : Aug 8, 2020, 3:58 PM IST

రోజూ పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా తేనె కలిపి ముఖానికి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. ఇలాచేస్తే చర్మంపై పేరుకున్న మురికి, టాన్‌ తొలగి కాంతిమంతంగా కనిపిస్తుంది.

వయసు పెరిగే కొద్దీ చర్మం సాగినట్లు కనిపిస్తుంది. దీనికి పరిష్కారంగా పావుకప్పు టొమాటో గుజ్జులో ఒక గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి... ఈ మిశ్రమాన్ని కనీసం వారానికి రెండు సార్లు ప్యాక్‌లా వేసుకుంటే ఫలితం ఉంటుంది.

కొందరి చర్మం కాలంతో సంబంధం లేకుండా పొడిబారుతుంది. వీరు రెండు చెంచాల టొమాటో రసం, అరచెంచా ఆలివ్‌నూనె, కొద్దిగా తేనె తీసుకుని ముఖం, చేతులకు రాసుకుంటే సరి.

టొమాటో

ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.