ETV Bharat / lifestyle

వీపు నాజూగ్గా తయారవ్వాలంటే..!

ఈ రోజుల్లో దాదాపు అమ్మాయిలందరూ బరువు తగ్గి, నాజూగ్గా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కూడా! అయితే కొంతమంది మాత్రం వారికి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వీపు భాగంలో అనవసర కొవ్వులు ఎక్కువగా పేరుకుపోయి బొద్దుగా, చర్మం సాగి వేలాడినట్లుగా కనిపిస్తుంటుంది. దీంతో చిన్న వయసులోనే వారిలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అలాగే వీపు భాగంలో పేరుకుపోయిన ఈ కొవ్వు వల్ల అసౌకర్యానికి గురై చీరలు, పరికిణీలు ధరించాలని ఉన్నా.. డీప్‌నెక్ బ్లౌజ్ వేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. మరి.. వీపు భాగంలో కొవ్వులు పేరుకుపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుని, మన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వీపును మరింత నాజూగ్గా, ఆకర్షణీయంగా తయారుచేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి...

amazing beauty tips
వీపు నాజూగ్గా తయారవ్వాలంటే..!
author img

By

Published : Apr 7, 2021, 1:46 PM IST

వీరిలో ఎక్కువ!

మహిళల్లో వీపు భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి పలు కారణాలున్నాయి. ఇందులో భాగంగా కొంతమంది మహిళలకు గర్భం ధరించిన సమయంలో వీపు భాగంలో కొవ్వులు ఎక్కువగా చేరడం, మరికొంతమందికి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. వీపు భాగంలో వెన్నెముకకు ఇరువైపులా కొవ్వు పేరుకుపోయి అక్కడుండే చర్మం వేలాడబడినట్లుగా తయారవడం జరుగుతాయి. ఇంకొంతమంది మహిళలు గర్భం ధరించకుండానే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటారు. వీరిలో ముఖ్యంగా పియర్ శరీరాకృతి కలిగిన వారిలో నడుము భాగంలో, తొడలు, పిరుదులు.. తదితర భాగాల్లో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా చూడడానికి మరింత లావుగా కనిపిస్తుంటారు. ఈ సమస్య ఎదురుకావడానికి.. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. వంటివి ముఖ్య కారణాలుగా వివరిస్తున్నారు నిపుణులు. మరి దీన్నుంచి బయటపడాలంటే రోజూ వ్యాయామం చేయడం, కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించి సమతులాహారం తీసుకోవడం చాలా మంచిది.

ఆరోగ్య సమస్యల వల్ల..

కారణాలేవైనా కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. వీరిలో ఆ గ్రంథి శరీరంలో అనవసరమైన కొవ్వులను కరిగించే థైరాక్సిన్ హార్మోన్‌ని సరిగ్గా ఉత్పత్తి చేయదు. ఈ స్థితినే హైపోథైరాయిడిజం అంటారు. ఫలితంగా వీపు భాగంలో కొవ్వులు అధికంగా పేరుకుపోయి లావుగా కనిపించే అవకాశం ఉంటుంది. మరికొంతమందిలో ఇన్సులిన్ స్థాయి పెరగడం వల్ల వీపు భాగంలో కొవ్వు పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటివారు సరైన పరీక్షలు చేయించుకొని మందులు వాడుతూ ఈ సమస్యలను తగ్గించుకుంటే వీపు భాగంలోని కొవ్వు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ ఆహారంతో కూడా..

పిజ్జా, బర్గర్, చిప్స్, సాల్ట్ బిస్కెట్లు, స్వీట్లు.. వంటి ఆహార పదార్థాలంటే చాలామందికి ఇష్టమే.. అలాగని ఎప్పుడూ వీటినే తింటూ ఉన్నారనుకోండి.. బరువు పెరగడం ఖాయం. ఇవన్నీ శరీర బరువును పెంచడం మాత్రమే కాదు.. వీటిలో ఉండే కొవ్వులు, సోడియం, చక్కెరలు, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు.. వంటి పదార్థాలు వీపు భాగంలో చేరి.. వీపు ఆకృతినే మార్చేస్తాయి. కాబట్టి శరీర బరువుతో సంబంధం లేకుండా ఇలాంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. తద్వారా బరువు పెరగకుండా ఉండడంతో పాటు, ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

వయసు పైబడుతున్న కొద్దీ..

వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. చర్మంపై ముడతలు, శక్తి క్షీణించడం.. వీటితో పాటు చర్మం కూడా పట్టు కోల్పోతుంది. దీంతో క్రమక్రమంగా స్పాంజిలాగా, మృదువుగా తయారై.. కేవలం వీపు భాగంలోనే కాదు.. శరీరంలో ఏ భాగంలో చూసినా చర్మం వేలాడినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలో చర్మం సాగిపోకుండా కనిపించడానికి ముందు నుంచీ మంచి పోషకాహారంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.

స్వయంగా పరిష్కరించుకోవచ్చు..

  • కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా లభించే శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండడంతో పాటు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, నీటిశాతం అధికంగా లభించే పండ్లు, కూరగాయలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఫైబర్ అధికంగా లభించే బ్రౌన్ రైస్, మొలకెత్తిన గింజలు, పండ్లు.. వంటివి తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి, తద్వారా శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా చేస్తాయి.
  • అలాగే ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకుండా.. ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కూడా వీపు భాగంలో కొవ్వులు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.
  • ఇక వ్యాయామం విషయానికొస్తే.. నడక, ఈత, జాగింగ్, సైక్లింగ్, మెట్లెక్కడం.. వంటి సులభమైన వ్యాయామాలు వీపు భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
  • కేవలం వీపు మాత్రమే కాదు.. శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వులు పేరుకుపోయి బరువు పెరగడానికి మానసిక ఒత్తిడి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది అటు ఆరోగ్యానికి, ఇటు మానసిక దృఢత్వానికి మంచిది. దీనికోసం యోగా, మెడిటేషన్ వంటివి ప్రయత్నించవచ్చు.

వీపు భాగంలో అనవసరమైన కొవ్వులు పేరుకుపోయి బరువు పెరగడానికి కారణమయ్యే కొన్ని అంశాలు, వాటిని సరిదిద్దుకోవడానికి గల మార్గాల గురించి తెలుసుకున్నాం కదా! మరి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. మీ లైఫ్‌స్త్టెల్‌లో ఇలాంటి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆకర్షణీయమైన, నాజూకైన వీపును సొంతం చేసుకోండి.

ఇదీ చదవండి: వాటర్ మెలన్​ను వెరైటీగా కోసేద్దామిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.